ఆయన నా రియల్‌ స్టార్‌.. ట్రంప్‌ కీలక మార్పు | Trump appoints John Kelly as new chief of staff | Sakshi
Sakshi News home page

ఆయన నా రియల్‌ స్టార్‌.. ట్రంప్‌ కీలక మార్పు

Published Sat, Jul 29 2017 12:17 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

ఆయన నా రియల్‌ స్టార్‌.. ట్రంప్‌ కీలక మార్పు - Sakshi

ఆయన నా రియల్‌ స్టార్‌.. ట్రంప్‌ కీలక మార్పు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ మరో కీలక మార్పు చేశారు. ఇప్పటి వరకు అమెరికా అంతర్గత వ్యవహారాలను పర్యవేక్షించిన కార్యదర్శి జనరల్‌ జాన్‌ కెల్లీని శ్వేతసౌద సిబ్బంది చీఫ్‌గా నియమించారు. ఈ విషయాన్ని ట్రంప్‌ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 'ఈ విషయం చెప్పేందుకు నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను.

ఇప్పుడే నేను జనరల్‌/సెక్రటరీ జాన్‌ ఎఫ్‌ కెల్లీని వైట్‌ హౌస్‌ స్టాఫ్‌ చీఫ్‌గా ప్రకటించాను. ఆయన గొప్ప అమెరికన్‌. గొప్ప నాయకుడు. అంతర్గత వ్యవహారాల కార్యదర్శిగా ఆయన బృహత్తర విధులు నిర్వర్తించారు. నా పరిపాలన వర్గంలో ఆయన నిజమైన స్టార్‌' అంటూ ట్రంప్‌ పేర్కొన్నారు. కెల్లీ రెయిన్స్‌ ప్రీబస్‌ స్థానంలో పనిచేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement