White spot
-
తెల్లమచ్చలు తగ్గుతాయా?
హోమియో కౌన్సెలింగ్ నా శరీరమంతా తెల్లమచ్చలు వచ్చాయి. నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. ఫలితంగా తీవ్రమైన మానసిక వేదన కలుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. నాకు హోమియోలో పరిష్కారం చెప్పండి. – నాగేంద్రబాబు, మహబూబ్‌నగర్ బొల్లి వ్యాధి చర్మంపై మెలనిన్ కణాలు తగ్గడం వల్ల వస్తుంది. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. టైరోసినేజ్ అనే ఎంజైమ్ తగ్గుదలకు ఈ కింది పరిస్థితులు కారణం కావచ్చు. ∙బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు ∙పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు ∙జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు ∙దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు; ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల, విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు ∙మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది ∙కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది ∙వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు : మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరెక్టర్,పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ -
వర్షాలు లేక రొయ్యలకు సోకుతున్న రోగాలు
చీరాల : మూడు నెలలకే లక్షల రూపాయాల ఆదాయం తెచ్చే రొయ్యల సాగు.. ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. వరుస నష్టాలతో రైతులు అల్లాడిపోతున్నారు. ఆరు నెలల క్రితం వరకు రైతులకు సిరులు కురిపించిన రొయ్యల సాగు.. ప్రస్తుతం నష్టాలు తెచ్చి పెడుతోంది. అదునులో కూడా వర్షాలు కురవకపోవ డంతో వైట్‌స్పాట్ సోకి రొయ్యలు చనిపోతున్నాయి. రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేదు. ఏడాదికి రెండు సార్లు సాగు చేయాల్సి ఉండగా రైతులు వరస పెట్టి చెరువులు సాగు చేయడం తెగుళ్లకు మరో కారణం. రొయ్య పిల్లల్లో నాణ్యత లేకపోవడం.. సాగు ఖర్చులు పెరిగిపోవడం.. వైరస్‌లతో దిగుబడులు పడిపోవడంతో గతంలో మీసాల తిప్పిన రైతులు ప్రస్తుతం నష్టాల ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. జిల్లాలోని చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, కొత్తపట్నం, టంగుటూరు, శింగారాయకొండ, ఉలవపాడు మండలాల్లో 3000 హెక్టార్లలో రొయ్యల చెరువులు సాగవుతున్నాయి. తెగుళ్లు ఆశిస్తున్న సమయాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తే చెరువుల్లో చేరే నీటిని రైతులు బయటకు విడుదల చేస్తుంటారు. దీంతో వైరస్ ప్రభావం తగ్గుతుంది. {పస్తుతం వర్షాలు కురవక పోవడంతో రొయ్యలకు వైరస్ సోకి అవి చనిపోతున్నాయి. సీడ్ (రొయ్యపిల్లలు) ఎంపికలో నాణ్యత లేకపోడం తెగుళ్లకు మరో కారణం. ఇతర దేశాల నుంచి మన డిమాండ్‌కు తగ్గిన విధంగా బ్రూడర్ (తల్లి రొయ్య) అందకపోవడంతో రొయ్య పిల్లల కోసం రైతులు స్థానికంగా ఉండే హేచరీలను అశ్రయించాల్సి వస్తోంది. సీడ్ మంచిదో కాదో ల్యాబ్‌లో నిర్ధారించకుండానే చెరువుల్లో పెంచున్నారు. ఫలితంగా అవి నెల.. లేకుంటే రెండు నెలల్లో చనిపోతున్నాయి. సాధారణంగా చెరువుల్లో 100 పిల్లలు వేస్తే 70 పిల్లల వరకు బతుకుతాయి. ప్రస్తుతం వంద పిల్లలకుగాను 20 నుంచి 30 రొయ్య పిల్లలే బతుకుతున్నాయి. తడిసి మోపెడైన ఖర్చులు వనామి సాగు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. సీడ్, ఫీడ్, మందులు, డీజల్, లీజు ఖర్చులు అంతకంతకూ పెరిగాయి. వనామి సాగులో వరస లాభాలు రావడంతో రొయ్యల సాగుకు డిమాండ్ పెరిగి లీజు ధరలు రెట్టింప్పయ్యాయి. గతంలో ఎకరా చెరువు ఎడాదికి లక్ష రూపాయల లీజు ఉండగా ప్రస్తుతం రూ.1.80 లక్షలకు పెరిగింది. మందుల ధరలు ఈ ఎడాది 25శాతం పెరిగాయి. గత ఎడాది ఫీడ్ ధర టన్ను రూ.63 వేలుండగా ప్రస్తుతం రూ.70 వేల వరకు పెరిగింది. గత ఎడాది ఎకరా చెరువుకు రూ.7 నుంచి రూ.9 లక్షలు ఖర్చు కాగా ప్రస్తుతం రూ.13 నుంచి రూ.15 లక్షలకు పెరిగింది. దిగజారిన ధరలు రొయ్యల ధరలు రోజురోజూకూ పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో రొయ్యలు ధరలు జనవరి నెలకంటే ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. జనవరిలో.. కౌంట్ రేటు ప్రస్తుతం 30 రూ.680 రూ.540 40 రూ.580 రూ.440 50 రూ.510 రూ.350 60 రూ.400 రూ.310 సీడ్లో కొరవడిన నాణ్యత : డాక్టర్ రఘునాథ్,మత్స్యశాఖ ఏడీ సీడ్లో నాణ్యత లేకపోవడం రొయ్యల సాగులో నష్టాలకు ప్రధాన కారణం. ముఖ్యంగా సర్వేయల్స్(బతికిన పిల్లల సంఖ్య) పడిపోతున్నాయి. 100 కిలోలకు 30 కిలోలే బతుకుతున్నాయి. రొయ్యలు సాగు చేసే రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చే తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుని మన కేంద్ర ప్రభుత్వం వాటికి పరీక్షలు నిర్వహిస్తోంది. అందులో మంచివాటిని ఎంపిక చేసుకుని చెన్నైలో ఉన్న హేచరీస్‌కు పంపి సీడ్‌ను తయారు చేస్తారు. అక్కడ పరీక్షల అనంతరం మేలైన రొయ్య పిల్లలను రైతులకు విక్రయిస్తారు. ప్రస్తుతం డిమాండ్ ఉన్నా రొయ్య పిల్లలు దిగుమతి కావడం లేదు. రైతులు స్థానికంగా హేచరీల వద్ద నుంచి పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. వాటిలో నాణ్యత లేకుండా ఉండటం వల్లే రొయ్య పిల్లలు చనిపోతున్నాయి. -
వెనామీకి ‘వైరస్’
చిట్టమూరు, న్యూస్‌లైన్ : టైగర్ రొయ్యల సాగుతో ఆక్వా రైతులను కుదేలు చేసిన ‘వైట్‌స్పాట్’, ‘విబ్రియో’ తాజాగా వెనామీని వెన్నాడుతున్నాయి. రోగ నిరోధక శక్తి అత్యధికంగా ఉండే విదేశీ పంట వెనామీ రాకతో జిల్లాలో ఆక్వా రైతులు కొద్దిగా కుదుటపడ్డారు. కొద్ది రోజుల క్రితం వరకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అంతంత మాత్రంగా ఉండటంతో పెద్ద లాభ, నష్టాలు లేకుండా వెనామీ సాగును కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో వెనామీ రొయ్యలకు మంచి డిమాండ్ ఏర్పడటంతో ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఆక్వా రైతులు ఆనంద పడ్డారు. ఇన్నాళ్ల నష్టాలను ఒక్కసారిగా పూడ్చుకోవచ్చన్న రైతుల ఆశలను హేచరీలు సొమ్ము చేసుకుని, వారిని నట్టేట ముంచుతున్నాయి. నాణ్యత లేని రొయ్యల పిల్లలను హేచరీలు రైతులకు అంటకడుతుండటంతో వెనామీకి ‘వైట్‌స్పాట్’, ‘విబ్రియో’ వంటి వైరస్లు సోకి నెల రోజుల వ్యవధిలోనే వేలాది ఎకరాల్లో గుంతలు ఖాళీ అవుతున్నాయి. మండలంలో మల్లాం, రాఘవవారిపాళెం, ఆరూరు, ఈశ్వరవాక, పిట్టివానిపల్లి, కొక్కుపాళెం, కొత్తగుంట, పల్లంపర్తి, ఎల్లూరు తదితర గ్రామాల్లో వేల ఎకరాల్లో వెనామీ రొయ్యలు సాగు చేస్తున్నారు. అయితే హేచరీల అత్యాశ రొయ్యల రైతులను నిలువున ముంచింది. అంతర్జాతీయ మార్కెట్లో వెనామీకి మంచి డిమాండ్ ఉండటంతో జిల్లాలో వేలాది ఎకరాల్లో సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. దీంతో హేచరీల్లో డిమాండ్ తగ్గట్టు సీడ్ అందుబాటులో లేకపోవడంతో హేచరీలు కృత్రిమ చర్యలతో నాసిరకమైన సీడ్ తయారు చేసి రైతులకు అందజేస్తున్నారు. పంట దిగుబడి బాగుండాలని రైతులు ఎప్పటికప్పుడు సెలినిటీ, పీహెచ్ టెస్ట్‌లు చేయిస్తుంటారు. ఈ నేపథ్యంలో టెక్నీషీయన్లు రొయ్యల రసాయనాలు వ్యాపారులతో కుమ్మక్కై రసాయన మందులు వాడకాన్ని సూచిస్తున్నారు. దీంతో రైతులు వారు సూచిస్తున్న రసాయనాలను విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇలా నెల రోజుల వరకు పిల్లల ఎదుగుదల బావున్నప్పటికీ ఆ తర్వాత రొయ్య తలపై తెల్లటి మచ్చలు (వైట్‌స్పాట్) ఏర్పడి మృతి చెందుతున్నాయి. మరికొన్ని గుంతల్లో విబ్రియో సోకి రొయ్యలు ఎర్రగా మారి చనిపోతున్నట్లు రైతులు లబోదిబో మంటున్నారు. వైరస్ గాలి ద్వారా అన్ని ప్రదేశాలకు వ్యాప్తి చెందటంతో రోజుల వ్యవధిలో మిగతా గుం తలకు త్వరితగతిన వ్యాప్తి చెంది రొ య్యలు చనిపోతున్నాయి. రొయ్యలు బాగా వచ్చిన సమయంలో రేట్లు లేక, రేట్లు ఉన్న సమయంలో రోగాలతో ఆక్వా రైతులు ఆర్థికంగా చితికి పోతున్నారు. లోకల్ సీడ్‌తోనే వైరస్ వ్యాప్తి వెనామీ విదేశీ సీడ్. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటే ఈ సీడ్ కొన్నేళ్ల క్రితం ఇక్కడకు దిగుమతి అయింది. రొయ్య పిల్లలు తయారు చేసే హేచరీలు విదేశాల నుంచి స్పెసిఫిక్ ఫాతోజెన్ ఫ్రీ బ్రూడర్స్ (ఎస్పీఎఫ్)ను దిగుమతి చేసుకుని తల్లి రొయ్యలను తండ్రి రొయ్యలతో జీన్స్ మార్పిడితో ఉత్పత్తి చేసిన పిల్లలను బ్రూడర్స్లో పెంచి అందుకు అనువైన సెలినిటీలో రైతులకు అందజేయాల్సి ఉంది. అయితే ఇలా చేయాలంటే వ్యయభారం అధికంగా ఉండటంతో హేచరీలు ఈ విధానాలకు నీళ్లొదులుతున్నాయి. జిల్లాలోని హేచరీలు స్థానికంగా సాగుచేస్తున్న గుంతల్లోని తల్లి రొయ్యలను సేకరించి వాటి ద్వారా సీడ్ ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లాలో టైగర్ రొయ్యకు సోకిన వైట్‌స్పాట్ అవశేషాలు ఇంకా గుంతల్లో ఉండటం, నాసిరకంగా సీడ్ వల్ల వెనామీకి వైట్‌స్పాట్ సోకుతున్నట్లు టెక్నిషియన్లు చెబుతున్నారు. నిస్సారంగా మారుతున్న గుంతలు రొయ్యల కోసం విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాల మూలంగా భూసారం తగ్గి భూములు నిస్సారంగా తయారవుతున్నాయి. భూమి పొరల్లో ఉండే సహజ ఖనిజ, సారాలు తగ్గిపోవడంతో భవిష్యత్‌లో రొయ్యల సాగుకు కూడా పనికి రాని విధంగా మారుతున్నాయి. కనీసం భవిష్యత్‌తో వరి, ఇతర పంటల సాగు చేసేందుకు ఉపయోగపడని విధంగా నిస్సారంగా భూమి తయారవుతుంది. ఆత్మహత్యలకు దారితీస్తున్న పరిస్థితులు రొయ్యల రేటు చూసి గుంతలు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్న రైతులకు జిల్లాలోని హేచరీల మోసంతో మళ్లీ ఆక్వా రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి అనివార్యమవుతోంది. రొయ్యలు సాగులో అనుసరించాల్సిన మెళుకువలను ఎంపెడా అధికారులు రైతులకు నేర్పి, వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉండగా అవేమి పట్టనట్లు వ్యవహరించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ేహ చరీలపై దాడులు నిర్వహించి నాసిరక రొయ్య పిల్లల్ని రైతులకు అంటకడుతున్నా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఎంపెడా అధికారులు ఆక్వా రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టేందుకు పటిష్టమైన ప్రణాళికమైన చర్యలు చేపట్టాల్సి ఉంది.