Wi-Fi service
-
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో వైఫై సేవలు మొదలు
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగించేవారికి సోమవారం నుంచి వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనిద్వారా వీరు ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు స్టేషన్ ప్రాంగణంలో ఈ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడమే మా లక్ష్యం. సైన్సు, సాంకేతిక సేవలను ముఖ్యంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించుకునేందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఇందులోభాగంగానే ఈ రైల్వేస్టేషన్లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరైంది. ఈ స్టేషన్‌లోని 16 ప్లాట్‌ఫాంలలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలి 30 నిమిషాలపాటు ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు. ఆ తర్వాత కూడా కావాలంటే ప్రయాణికులు స్క్రాచ్ కార్డులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ. 25 వెచ్చించి కార్డును కొనుగోలు చేస్తే అరగంటపాటు, రూ. 35 కార్డును కొనుగోలు చేస్తే గంటపాటు ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ కార్డు 24 గంటలపాటు మాత్రమే చెల్లుతుంది. ఇవి ఈ స్టేషన్‌కు చెందిన పహర్‌గంజ్, అజ్మీరీ గేట్ల వద్ద అందుబాటులో ఉంటాయి’అని పేర్కొన్నారు. త్వరలో అన్ని ప్రధాన స్టేషన్లలోనూ... వైఫై సేవలను త్వరలో అన్ని ప్రధాన స్టేషన్లలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. ‘హై ఫై కాదు వైఫై తప్పనిసరిగా సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండాలనేది ప్రధానమంత్రి నరేంద్రమోదీ కల. ఈ సేవలు ఏ కొందరికో పరిమితం కారాదు. స్టేషన్లతోపాటు త్వరలో రైళ్లలో కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. ఇది ఆరంభం మాత్రమే. ఏ ఒక్క స్టేషన్‌కో దీనిని మేము పరిమితం చేయదలుచుకోలేదు. రైల్ టెల్ సంస్థ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 50 లక్షలు. ఈ వెసులుబాటును కొనసాగించేందుకు ప్రతి ఏడాది రూ. 16 లక్షల మేర నిధులను వెచ్చిస్తాం. ఈ నెలాఖరులోగా ఆగ్రా, అహ్మదాబాద్, వారణాసి రైల్వేస్టేషన్లలోనూ ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తాం’అని ఆయన పేర్కొన్నారు. -
వైఫై ప్రాజెక్టు కార్యరూపం
ఖాన్ మార్కెట్ పరిసర ప్రాంత ప్రజలకు వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో కన్నాట్ ప్లేస్‌వాసులు కూడా వీటిని వినియోగించుకునే అవకాశముంది. ఈ దిశగా ఎన్డీఎంసీ ముందుకు సాగుతోంది. న్యూఢిల్లీ: న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఫై ప్రాజెక్టు చేపట్టిన వైఫై ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. నగర ంలోని ఖాన్ మార్కెట్లో ఇందుకు సంబంధించిన సేవలు కొద్దిరోజుల క్రితం ప్రారంభమయ్యాయి. నగరంలోఈ తరహా సేవలు ప్రారంభమవడం ఇదే తొలిసారి. త్వరలో కన్నాట్‌ప్లేస్‌లోనూ ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు విజయవంతంగా సాగుతోందని దీని బాధ్యతలను నిర్వహిస్తున్న ఓపీ మిశ్రా వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను పూర్తిచేయడం ద్వారా ఖాన్ మార్కెట్ పరిసరాల్లో నివసించేవారు వినియోగించుకోవచ్చన్నారు. ఇంటర్నెట్కు అనుసంధానమయ్యేందుకుగాను తాము వన్‌టైం పాస్వర్డ్ (ఓటీపీ) అందజేస్తామన్నారు. ఉచిత వినియోగం పూర్తయ్యాక స్క్రాచ్ కార్డులను కొనుగోలు చేసి వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇవి నగరంలోని అన్ని దుకాణాల్లోనూ అందుబాటులో ఉంటాయన్నారు. కాగా ఖాన్ మార్కెట్లో ఈ ప్రాజెక్టు విజయవంతంగా నడుస్తున్నప్పటికీ కన్నాట్‌ప్లేస్‌లో ఏర్పాటుకు సంబంధించి ఎన్డీఎంసీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కన్నాట్‌ప్లేస్ అతి పెద్ద ప్రాంతమని, అయితే కన్నాట్‌ప్లేస్‌లో ఏర్పాటుకు సంబంధించి తమకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇదిలాఉంచితే భారీఎత్తున కేబుళ్లను వినియోగించాల్సి ఉంటుందని, అందువల్ల పరిసరాలు వికృతంగా మారకుండా చేసేందుకుగాను కన్నాట్‌ప్లేస్‌లోని 1.2 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని వినియోగించుకోనున్నామని తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్ల భరోసా ఎన్డీఎంసీ ఆలోచన ఇలా ఉండగా ఈ నెలాఖరునాటికల్లా కన్నాట్‌ప్లేస్ పరిసరాల్లో వైఫై సేవల అందుబాటులోకి తీసుకొస్తామని సర్వీస్ ప్రొవైడర్లయిన టాటా డొకొమో, వోడా ఫోన్ సంస్థలు భరోసా ఇస్తున్నాయి. కన్నాట్‌ప్లేస్ పరిధిలోని ఎన్‌బ్లాక్‌లో ప్రస్తుతం ైవె ఫై సేవలను ప్రయోగాత్మక ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో ైవె ఫై సేవలు జూలైలోనే ప్రారంభం కావాల్సి ఉంది. వివిధ సాంకేతిక సమస్యల కారణంగా అది కాస్తా ఆలస్యమైంది. అంతేకాకుండా కొన్ని భద్రతా విభాగాలు కూడా అభ్యంతరం చెప్పడం కూడా జాప్యానికి కారణమైంది. తమ నెట్‌వర్క్‌లకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని భావించిన ఆ సంస్థలు అభ్యంతరం చెప్పాయి. అయితే టెలిఫోన్ శాఖ నుంచి సర్వీస్ ప్రొవైడర్లు అవసరమైన అనుమ తులను పొందుతారంటూ తాము ఆ సంస్థలకు భరోసా ఇచ్చామని, దీంతో ఈ వివాదానికి తెరపడిందని ఆయన వివరించారు. కన్నాట్‌ప్లేస్‌లో వైఫై నెట్వర్క్ ఏర్పాటు సమ యంలో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు.