Wicked
-
శతక నీతి – సుమతి: సత్సాంగత్య ఫలం
మా చిన్న తనంలో తాగడానికి ఏటినుంచి మంచినీళ్ళు పట్టుకొచ్చేవారు. ఒక్కొక్కసారి ఏటికి వరదొచ్చేది. అప్పుడు ఏటి నీరు ఎర్రగా ఉండేది. అందులో అంతా బురద మట్టి, చెత్త ఉండేది. ప్రతి ఇంట్లో ఇండుపకాయ గింజలు (చిల్ల గింజలు) ఒక డబ్బాలో పోసి ఉంచుకునేవారు. వాటిని కొద్దిగా అరగదీసి ఆ నీళ్ళబిందెలో పడేసి మూతపెట్టి కొన్ని గంటలు కదపకుండా ఉంచేవారు. తరువాత చూస్తే స్ఫటిక జలం ఎలా ఉంటుందో అలా స్వచ్ఛమైన నీరు పైకి తేలి ఉండేది. మడ్డి అంతా అడుగుకు చేరేది. అలా సత్పురుషుల సహవాసం అనే చిల్ల గింజ పడితే జన్మజన్మలనుంచి అంటుకొని ఉన్న దుర్మార్గపు ఆలోచనలు, గుణాలన్నీ అడుక్కి వెళ్ళిపోతాయి. స్వచ్ఛమైన గుణాలు పైకి తేలతాయి. ఒక గ్రంథాలయానికి వెళ్ళి వందల పుస్తకాలు చదవండి. మీలో అంత మార్పు కచ్చితంగా వస్తుందని చెప్పలేం. కానీ సత్పురుషులతో కలిసి ఉంటే ఎన్నో వందలు, వేల పుస్తకాలు తీసుకురాలేని మార్పు మీలో వస్తుంది. తప్పుపని చేయాలనుకున్నవాడు భగవద్గీత కంటిముందు కనిపిస్తున్నా చేస్తాడు. కానీ సత్పురుషుల సమక్షంలో మాత్రం అలా చేయలేడు. ఒక దేశానికి కీర్తిప్రతిష్ఠలు అక్కడున్న భౌతికమైన సంపదలతో రావు. ఆ దేశంలో ఎంతమంది మహాత్ములున్నారన్న దానిని బట్టి కీర్తిప్రతిష్ఠలు, గౌరవమర్యాదలు ఏర్పడుతుంటాయి. ఒక వివేకానందుడు, ఒక రామకృష్ణ పరమహంస, త్యాగరాజ స్వామి, ఒక శిబి చక్రవర్తి, ఒక రామచంద్రమూర్తి, ఒక ధర్మరాజు, ఒక చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు, ఒక అబ్దుల్ కలాం .. ఎంతమంది మహాత్ములు, ఎంతమంది నిస్వార్థమైన పాలకులు.. వారి కారణంగా మనం ఈరోజున తలెత్తుకుని తిరుగుతున్నాం. మనకూ ఆ మర్యాద ఇస్తున్నారు. ‘నా దేశ ప్రజలందరూ నిండుగా బట్ట కట్టుకునేవరకూ వారి ప్రతినిధి అయిన నేను కూడా ఇలాగే కొల్లాయి గుడ్డే కట్టుకుంటాను’ అని లండన్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ధైర్యంగా ప్రకటించారు మహాత్మా గాంధీ. అటువంటి నాయకులతో ఆ గడ్డ వైభవోపేతంగా వెలుగుతుంది. అంతేతప్ప తనకోసం బతికేవాడు, ఒక శీలవైభవం లేనివాడు, ఎప్పుడూ దుర్మార్గంగా ప్రవర్తించేవాడూ, పదిమందికి ఆదర్శం కానివాడు, తన జీవితాన్ని తాను అదుపు చేసుకోలేనివాడు, తెల్లవారి లేచింది మొదలు ఎవరిని మోసం చేద్దామా.. ఎవరికి అపకారం చేద్దామా అని ఆలోచించేవాడు, కోట్లకు కోట్లు వెనకేసుకుంటూ పన్నులు కట్టకుండా ప్రభుత్వానికి దొరకకుండా తప్పించుకు తిరిగేవాడు, ఈ దేశ పౌరుడిగా సకల సదుపాయాలు అనుభవిస్తూ ప్రాణం పోతున్నా పరులకోసం ఒక రూపాయి ఖర్చుపెట్టని వాడు... ఇటువంటి వారిని ఆకాశానికెత్తి మహాత్ములని పొగుడుతూ, వారిని ఆదర్శంగా తీసుకొని బతికితే... చిట్టచివరకు అధోగతిపాలుకాక తప్పదు. కర్ణుడు ఎంత మంచివాడయినా దుర్యోధనుడితో ఉన్నందుకు సర్వ నాశనమయిపోయాడు. రామచంద్రమూర్తి నీడన ఉన్నందుకు హనుమంతుడికి.. ఇన్ని యుగాలు గడిచినా రాముడికంటే దేవాలయాలు ఎక్కువగా కట్టి నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు. రామాలయంలేని ఊరుండదు. హనుమంతుడి గుడిలేని వీథీవాడా ఉండవు. అందుకే దుర్జనులతో కలిసి సహజీవనం చేస్తుంటే... నల్లులు చేరిన మంచం బడితె దెబ్బలు తిన్నట్లుగా బాధలు పడాల్సి వస్తుందన్నది బద్దెనగారి సందేశం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అదో దుర్మార్గమైన చట్టం
- విద్యా హక్కు చట్టంపై సీఎం కేసీఆర్ - ప్రైవేటు స్కూళ్లలో పేద వర్గాలకు 25 శాతం రిజర్వేషన్ ఇస్తే ప్రభుత్వ బడులేం కావాలి? - విద్యాహక్కు చట్టం అమలు చేస్తే 40 వేల మంది ప్రభుత్వ టీచర్లకు పనుండదు - యూపీఏ దుర్మార్గమైన చట్టం చేసి పోయింది - విద్యా విధానం అమలుపై సమగ్ర చర్చ జరగాలి - సభలో దీనికోసం సగం రోజు సమయం కేటాయించాలి - విద్యను మొత్తం ఒకే గొడుగు కిందికి తీసుకురావాలి - ఏప్రిల్ నాటికి ‘ఫీజు’ బకాయిలు ఉండకుండా చూస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: విద్యాహక్కు చట్టం అమలు చేసి, ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం పేద విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తే 40 వేల మంది ప్రభుత్వ టీచర్లకు పనుండదని... యూపీఏ ప్రభుత్వం పోతూపోతూ దుర్మార్గమైన చట్టం చేసి పోయిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం ఎంతమందికి ఉపయోగం, ఏం చేయాలనే దానిపై సమగ్ర చర్చ జరగాలని చెప్పారు. అవసరమైతే అందుకోసం సగం రోజు సభా సమయాన్ని కేటాయించాలని, దీనితో పాటు వైద్యం విషయంలోనూ చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రైవేటు పాఠశాలలు, ఫీజులపై ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కె.లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానమిచ్చినా... సభ్యులు సంతృప్తి చెందకపోవడంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు. ‘‘కేంద్రంలో అధికారం మారినప్పుడల్లా విద్యకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రభుత్వం రాగానే వాటిని వదిలేయడం జరుగుతోంది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు మోడల్ స్కూల్లను తీసుకొచ్చి 3వేల మంది టీచర్లను నియమించింది. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఆ పథకాన్ని ఎత్తేశారు. దీంతో మోడల్ స్కూళ్ల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాల మీద పడింది..’’ అని కేసీఆర్ చెప్పారు. విద్య విషయంలో నెలకొన్న సమస్యలను అందరం కలసి సమూలంగా చర్చించాలని, విద్యాహక్కు చట్టం ఎంత వ రకు ఉపయోగం? ఏం చేయాలనే దానిపై ఓ నిర్ణయానికి రావాలని ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఏం కావాలి.. విద్యా హక్కు చట్టంలో పేర్కొన్నట్లుగా పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఇస్తే ప్రభుత్వ పాఠశాలలు ఏం కావాలని.. దానివల్ల 50 నుంచి 60 శాతం పాఠశాలల మీద ప్రభావం పడుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో 1.50 లక్షల మంది టీచర్లేనని, అందులో 40 వేల మంది టీచర్లకు పని లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. ‘‘ఈ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా ఈ విషయంలో రిక్వెస్ట్ చేశాం. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 9 మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లున్న పరిస్థితి. ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం మందిని చేర్పించి ప్రభుత్వం ఫీజు చెల్లిస్తే ప్రభుత్వ స్కూళ్లకు ఎవరొస్తారు?..’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. కొత్తగా 70 మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని, ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాలు బాగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. సాంకేతిక, వృత్తివిద్య మినహా మిగతా విద్యా విధానాన్ని పూర్తిగా ఒకే గొడుగు కిందికి తీసుకువస్తే బాగుంటుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను మార్చి, ఏప్రిల్‌కల్లా పూర్తిగా చెల్లించాలని ఆర్థిక శాఖకు సూచించినట్లు తెలిపారు. విద్యా విధానంపై సభలో సమగ్ర చర్చ జరగాలన్నారు. సగం రోజు విద్యా విధానంపై, గంట సేపు వైద్యంపై ప్రత్యేక చర్చ నిర్వహించాలని సభాపతి మధుసూదనాచారికి సూచించారు. గుర్తింపు లేని పాఠశాలల అంశంతో పాటు కేంద్రంలో ఉన్న విద్యా సంబంధమైన పథకాలు, వాటి అమలు తీరుపై సభ్యులు చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు.