wife relatives
-
సినిమాను తలపించిన లవ్‌స్టోరీ.. పెళ్లి.. కిడ్నాప్.. ఛేజింగ్..
మంచిర్యాల జిల్లా: జన్నారం మండలం మోర్రిగూడ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కిడ్నాప్ కలకలం సృష్టించింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామానికి చెందిన యువతి లక్ష్మిని జన్నారం మండలం మోర్రిగూడెం గ్రామానికి చెందిన కోట నాగేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. చదవండి: అత్తపై కోడలు భారీ స్కెచ్.. విస్తుపోయే షాకింగ్ నిజాలు బట్టబయలు దీంతో ఆగ్రహించిన అమ్మాయి బంధువులు మోర్రిగూడ గ్రామంలోని అబ్బాయి ఇంటిలోకి చొరబడి అబ్బాయిపై దాడి చేసి అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన ఎస్సై సతీష్.. కిడ్నాప్ వాహనాలను వెంబడించి దండేపల్లి మండలం ముత్యంపేట వద్ద మూడు వాహనాలను, 17 మంది నిందితులను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. -
మాజీ భార్యను చూసేందుకు వచ్చి...
కెలమంగలం(కర్ణాటక): మాజీ భార్యను చూసేందుకు వెళ్లిన భర్తపై ఆమె తరఫు బంధువులు దాడికి పాల్పడగా తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఈ ఘటన కెలమంగలం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. బెంగళూరు మంగళమ్మపాళ్యంకు చెందిన మహమ్మద్ ఇమ్రాన్(32)కు కెలమంగలం సమీపంలోని దొడ్డబేళూరుకు చెందిన రుక్కు అనే మహిళతో నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఆరు నెలలకే విడిపోయారు. అయితే భార్యను చూసేందుకు ఇమ్రాన్ మంగళవారం వెళ్లగా ఆమె తరఫు బంధువులు అతన్ని కారులో కెలమంగలంవైపు తీసుకెళ్లి చిన్నట్టి వద్ద దాడి చేసి ఉడాయించారు. అతన్ని స్థానికులు క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితులుగా భావిస్తున్న కెలమంగలం గణేష్‌కాలనీకి చెందిన సిద్దిక్, మాలిక్, రహమ్మాన్, దొడ్డబేళూరుకు చెందిన సాధిక్, జమీర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
సర్ది చెప్పాలని వస్తే కత్తులతో దాడి..!
న్యూఢిల్లీ: భార్యభర్తల మధ్య గొడవలపై సర్దిచెప్పేందుకు వచ్చిన వచ్చిన ఓ వ్యక్తి అక్కడ జరిగిన దాడిలో చనిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని కజురి ఖాస్ ఏరియాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పర్వేజ్ అనే వ్యక్తికి నాలుగేళ్ల కిందట ఢిల్లీ యువతితో వివాహమైంది. గత కొన్ని రోజులుగా భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారు. గొడవ పడొద్దని, వీరికి నచ్చజెప్పేందుకు వివాహిత బంధువులు బుధవారం రాత్రి పర్వేజ్ ఇంటికి వచ్చారు. భార్య బంధువులు అమ్రుద్దీన్, గఫార్, సబ్రతి ఖాన్, మహమ్మద్ సయీద్ లు పర్వేజ్ ఆయన తండ్రి రాయీస్ లతో సంప్రదింపులు జరుపుతున్నారు. తీవ్ర ఆవేశానికి లోనైన పర్వేజ్ ఆయన తండ్రి భార్య తరఫు బంధువులపై కత్తులతో దాడి చేసి వారిని గాయపరిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహమ్మద్ సయీద్ మృతిచెందగా, మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పర్వేజ్, రాయీస్ పరారీలో ఉన్నారని వారికోసం గాలింప చర్యలు చేపట్టినట్లు వివరించారు.