సర్ది చెప్పాలని వస్తే కత్తులతో దాడి..! | one stabbed to death and 3 hurt in husband family attack | Sakshi
Sakshi News home page

సర్ది చెప్పాలని వస్తే కత్తులతో దాడి..!

Published Thu, Feb 16 2017 12:27 PM | Last Updated on Thu, Oct 4 2018 8:38 PM

సర్ది చెప్పాలని వస్తే కత్తులతో దాడి..! - Sakshi

సర్ది చెప్పాలని వస్తే కత్తులతో దాడి..!

న్యూఢిల్లీ: భార్యభర్తల మధ్య గొడవలపై సర్దిచెప్పేందుకు వచ్చిన వచ్చిన ఓ వ్యక్తి అక్కడ జరిగిన దాడిలో చనిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని కజురి ఖాస్ ఏరియాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పర్వేజ్ అనే వ్యక్తికి నాలుగేళ్ల కిందట ఢిల్లీ యువతితో వివాహమైంది. గత కొన్ని రోజులుగా భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారు. గొడవ పడొద్దని, వీరికి నచ్చజెప్పేందుకు వివాహిత బంధువులు బుధవారం రాత్రి పర్వేజ్ ఇంటికి వచ్చారు.

భార్య బంధువులు అమ్రుద్దీన్, గఫార్, సబ్రతి ఖాన్, మహమ్మద్ సయీద్ లు పర్వేజ్ ఆయన తండ్రి రాయీస్ లతో సంప్రదింపులు జరుపుతున్నారు. తీవ్ర ఆవేశానికి లోనైన పర్వేజ్ ఆయన తండ్రి భార్య తరఫు బంధువులపై కత్తులతో దాడి చేసి వారిని గాయపరిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహమ్మద్ సయీద్ మృతిచెందగా, మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పర్వేజ్, రాయీస్ పరారీలో ఉన్నారని వారికోసం గాలింప చర్యలు చేపట్టినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement