WiFi routers
-
అలెర్ట్: ఈ వైఫై రూటర్లు వాడుతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..!
సైబర్ నేరస్తులు పంథా మార్చారు. ఇన్ని రోజులు మెయిల్స్, మెసేజెస్, ఫ్రీగిఫ్ట్ లు పేరుతో బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేసేవారు. కానీ ఇప్పుడు రూటు మార్చి వైఫై రూటర్ల సాయంతో వైరస్ పంపి పర్సనల్ కంప్యూటర్లు, ఆఫీస్‌లో కంప్యూటర్లపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాడుల్లో వ్యక్తులు, లేదంటే సంస్థల రహస్యాల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. వాటిని అడ్డం పెట్టుకొని కావాల్సిన మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని మిలియన్ల వైఫై రూటర్లలో సుమారు 226 భద్రతా లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ 'ఐఓటీ ఇన్స్పెక్టర్', టెక్నాలజీ మ్యాగజైన్ 'చిప్' పలు నివేదికల్ని విడుదల చేసింది. నెట్‌గేర్, ఆసుస్, సినాలజీ,డీ - లింక్, ఏవీఎం,టీపీ -లింక్, ఇడి మ్యాక్స్ సంస్థల రూటర్లలో సెక్యూరిటీ సమస్యలు తలెత్తాయని, తద్వారా యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగిలించేందుకు అవకాశం ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నాయి. ఈ సెక్యూరిటీ సమస్యలు వెలుగు రావడంతో సంబంధిత సంస్థలు.. ఆ సమస్యని పరిష్కరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఐఓటీ ఇన్స్పెక్టర్ సంస్థ సీటీఓ ఫ్లోరియన్ లుకావ్స్కీ మాట్లాడుతూ.. మిలియన్ల రూటర్లలో తలెత్తిన 226 భద్రతా లోపాల వల్ల తలెత్తే నష్టం ఒకే విధంగా ఉంటుందని చెప్పలేం. కానీ అదే భద్రతా లోపాల్ని అడ్డంపెట్టుకొని హ్యాక్ చేయడం హ్యాకర్లకు చాలా సులభం' అవుతుందని అన్నారు. అయితే ఈ సమస్యలకు రూటర్లలో వినియోగించే కొత్త కాంపోనెంట్స్, ల్యూనిక్స్ కెర్నాల్ అనే ఆపరేటింగ్ స్టిస్టమ్ తో పాటు ఇతర డేటా సర్వీసులను టార్గెట్ చేసుకొని సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. సైబర్ దాడుల నుంచి సేఫ్‌గా ఉండాలంటే ఇటీవల నార్డ్ పాస్ అనే సంస్థ 50 దేశాలకు చెందిన ప్రజలు ఎలాంటి పాస్‌వర్డ్‌లను వినియోగిస్తున్నారు. ఆ పాస్‌వర్డ్‌లను ఎంత సమయంలో హ్యాక్ చేయొచ్చు అనే అంశంపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో మనదేశానికి చెందిన ప్రజలు..సెకను కన్నా తక్కువ సమయంలో హ్యాక్ చేసే విధంగా పాస్ వర్డ్ అనే వర్డ్‌ను పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటున్నారని తేలింది. దీంతో పాటు 12345, 123456, 123456789, 12345678, india123, 1234567890, 1234567 పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటున్నట్లు నార్డ్ పాస్ పేర్కొంది. అలా కాకుండా కష్టతరమైన వర్డ్స్‌లేదంటే నెంబర్స్ పెట్టుకోవడం వల్ల వైఫై రూటర్ల ద్వారా జరిగే హ్యాకింగ్ నుంచి సురక్షింతంగా ఉండొచ్చని ఫ్లోరియన్ లుకావ్స్కీ సూచించారు. చదవండి : వాటిని పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటే..కొంప కొల్లేరే -
మీ వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా?
ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ యుగంలో వై-ఫై అంటే తెలియని వాళ్లు చాలా కొద్దీ మాత్రమే ఉంటారు. ప్రస్తుత కరోనా కాలంలో గతంలో వై-ఫై ఉపయోగించని వారు కూడా ఇప్పుడు ఉపయోగించాల్సి వస్తుంది. దీనికి తోడు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ క్లాసుల పుణ్యమా అని గతం కంటే ఎక్కువగా వై-ఫైలు వాడకం బాగా పెరిగిపోయింది. లాక్ డౌన్ తర్వాత మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వై-ఫై వాడకం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. వైఫై కనెక్షన్ కోసం మీరు మంచి బ్రాడ్ బ్యాండ్ ని ఎంచుకొని ఉన్న కొన్ని సార్లు సమస్యలు ఎదుర్కొంటారు కొందరు. దానికి ప్రధాన కారణం వారు చేసే చిన్న తప్పులే. అయితే ఇప్పుడు మీ వై-ఫై వేగాన్ని పెంచే కొన్ని మార్గాలను మనం తెలుసుకుందాం. (చదవండి: గూగుల్ డ్యుయో సేవలు నిలిపివేత!) వై-ఫై వేగాన్ని పెంచడానికి ఈ టిప్స్ పాటించండి: మొదటగా మీరు మీ ఇంట్లో వై-ఫై అవసరం లేకపోయినా దానికి కనెక్ట్ చేయబడిన ఎలక్ట్రానిక్ పరికరాలను ముందుగా డిస్ కనెక్ట్ చేయండి. కొన్ని సార్లు మీరు వై-ఫై రూటర్ ప్రక్కన నిలబడితే మాత్రమే వై-ఫై సిగ్నల్ వస్తుంటే ముందుగా మీ వై-ఫై రూటర్ స్థానాన్ని మార్చండి. అది కూడా మీ గదిలో మధ్యలో ఉండే విదంగా చూసుకోండి. అలాగే దాని పక్కన ఎలాంటి ఎలక్ట్రానిక్, ఐరన్ వంటివి లేకుండా చూసుకోండి. అలాగే ముందుగా మీ ఇంటి యొక్క అవసరాలను గుర్తించండి. చాలా మంది వారి ఇంటిలో ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్న తక్కువ స్పీడ్ గల వై-ఫై కనెక్షన్ తీసుకోవడానికి ఇష్టపడుతారు. దీని వల్ల కొన్ని సార్లు మనకు అత్యవసర సమయంలో వై-ఫై సిగ్నల్ తగ్గిపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ 2.4గిగాహెర్ట్జ్ నుంచి 5గిగాహెర్ట్జ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ గల రూటర్ ని మీ అవసరాని బట్టి ఎంచుకోవాలి. మీ వై-ఫై వేగాన్ని పరిశీలించండి. ఒక్కోసారి మీరు వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరంలో ఏదైనా సమస్యలు ఉంటే తక్కువ స్పీడ్ వచ్చే అవకాశం ఉంది. ఇతర పరికరాలలో కూడా ఒక సారి వైఫై వేగాన్ని కొలవండి. దీని కోసం fast.com ను ఉపయోగించవచ్చు. ఒకవేల ఏదైనా సమస్య ఉన్నట్లు అయితే ముందుగా మీ పరికరంలో నెట్ వర్క్ సెట్టింగ్స్ చేయండి. మీరు ఎక్కువ మంది నివసించే ప్రాంతాలలో ఉంటే మాత్రం ఇతర నెట్ వర్క్, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే సిగ్నల్ మీకు కనెక్ట్ కావడానికి మీ రూటర్ పై ప్రభావం చూపుతుంది. అందువల్ల మీ రూటర్ లో ఛానల్ ఎంపిక మోడ్ సెట్ చేసుకోవాలి లేదా మీకు నచ్చిన ఛానెల్ ని మీరు స్వయంగా ఎంచుకోవచ్చు. కొన్ని సార్లు వై-ఫై తగ్గిపోవడానికి రూటర్ యాంటెన్నా కూడా కారణం కావచ్చు. అందుకని ఒకసారి మీ రూటర్ యాంటెన్నాల పోజిషన్ ను మార్చి చూడండి. అలాగే, ఒకసారి వై-ఫై రూటర్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయండి. ఇప్పటికి కూడా మీ వై-ఫై వేగం పెరగకపోతే రూటర్ లేదా వై-ఫై కనెక్షన్ సేవలను మార్చి చూడండి. అంటే వేరే రూటర్ తీసుకోవడం లేదా వేరే వైఫై కనెక్షన్ తీసుకోవడం మంచిది. -
డేటా సేవల మరో సంచలనం: వైఫై డబ్బా
సాక్షి, బెంగళూరు: ఉచిత డేటా, కాలింగ్ సేవలతో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో ఇన్ఫోకాం ప్రత్యర్థి కంపెనీలకు దడ పుట్టించింది. అయితే ఉచిత సేవలకు స్వస్తి చెప్పి.. బాదుడుకు సిద్ధమైన జియోకి షాకిస్తూ ఒక కొత్త స్టార్ట్అప్ దూసుకుపోతోంది. రూ.2 ఉంటే చాలు సూపర్ చీప్ అండ్ సూపర్ ఫాస్ట్ డేటా అంటోంది బెంగళూరుకు చెందిన స్టార్ట్అప్ కంపెనీ వై ఫై డబ్బా. ఇది ప్రారంభమేకానీ.. టెలికాం దిగ్గజాలతో ఢీకొనేలా పక్కా ప్లాన్‌తో వ్యవస్థాపకులు సిద్ధమవుతున్నారు. బెంగళూరు నగరంలో ఐఎస్పీ లైసెన్స్‌తో ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా డేటా సేవలు అందిస్తున్న వైఫై డబ్బా, జియో ప్లాన్లతో పోలిస్తే ఇప్పటికే భారీగా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రీ పెయిడ్ కస్టమర్లకు సరసమైన ధరల్లో డేటా ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఉదాహరణకు జియో రూ.19 లపై 150 ఎంబీ అందిస్తోంటే.. కేవలం రూ.2లకే 100 ఎంబీ డేటా ఆఫర్ చేస్తోంది. అలాగే రూ.10లకే 500ఎంబీ, రూ.20లకు 1 జీబీ డేటా అందిస్తోంది. దిగ్గజ టెలికాం కంపెనీల్లాగా లక్షలు ఖర్చుపెట్టి సెల్ టవర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా.. రూ. 4వేలతో ఒక డబ్బా(రౌటర్) ద్వారా తమ సేవలను విస్తరిస్తోంది. అతి తక్కువ ఖర్చుతో అతి వేగవంతమైన డేటా అందించడమే తమ లక్ష్యమని వైఫై డబ్బా ఫౌండర్ శర్మ చెబుతున్నారు. అంతేకాదు ఎలాంటి యాప్ ను డౌన్ లోన్ చేసుకోమని తాము వినియోగదారులకు కోరడం లేదన్నారు. వంద నుంచి 200మీటర్ల పరిధిలో 50బీపీఎస్‌తో రిలయబుల్ సేవల్ని అందిస్తున్నట్టు తెలిపారు. విభిన వర్గాలనుంచి తమకు కస్టమర్లు ఉన్నారన్నారు. ముఖ్యంగా అల్పాదాయ వర్గాల వారికి తమ డేటా సేవలు బాగా చేరుతున్నాయని తెలిపారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉన్న రోజువారీ వేతన కార్మికులను తమ ప్లాన్లు ఆకర్షిస్తున్నాయన్నారు. ఇప్పటికే బెంగళూరు నగరంలో 350రౌటర్ లేదా డబ్బాలను అమర్చగా... ఇంకా 1800 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయట. ప్రస్తుతం స్థానిక్ కేబుల్ ఆపరేటర్ల భాగస్వామ్యంతో ఈ సేవలను అందిస్తోంది. కొత్త కనెక్షన్ కోసం 5-7రోజుల సమయంపడుతోందని..త్వరలోనే దీన్ని 3-4రోజులకు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని శర్మ చెప్పారు.. అలాగే రాబోయే 3-4 ఏళ్లలో లక్షల వైఫై డబ్బాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు. కాగా వైఫై డబ్బాకి ప్రస్తుతం వై కాంబినేటర్ సహా కొన్ని సంస్థలు ఇన్వెస్టర్లుగా ఉన్నాయి -
వైఫై రూటర్లు బుక్‌చేస్తే ఖాళీ డబ్బా వచ్చింది!
మహబూబాబాద్ : ఓ కంపెనీకి చెందిన వైఫై రూటర్లు ఆఫర్లో ఇస్తున్నామని ప్రచారం చేయడంతో ఓ వ్యాపారీ ఆన్లైన్లో బుక్ చేయగా రూటరుకు బదులుగా ఖాళీ డబ్బా మాత్రమే వచ్చింది. మహబూబాబాద్ పట్టణానికి చెందిన వ్యాపారి ప్రభాకర్ సెల్ వరల్డ్ షాపును నిర్వహిస్తున్నాడు. స్నాప్‌డీల్ కంపెనీ వైఫై రూటర్లను ఆఫర్లో ఇస్తున్నట్లుగా ప్రచారం చేసింది. ప్రభాకర్ మూడు వైఫై రూటర్ల కోసం ఆన్లైన్లో బుక్ చేశాడు. వాస్తవానికి ఆ వైఫై రూటర్ ధర రూ.1000 ఉండగా ఆఫర్లో రూ. 769కి మాత్రమే అని ప్రచారం చేయడంతో మూడు రూటర్లకు ఆన్లైన్లో డబ్బులు చెల్లించాడు. ఆ రూటర్లకు సంబంధించిన మూడు బాక్సులు తపాల శాఖ ద్వారా సిబ్బంది సోమవారం రాత్రి వ్యాపారికి అందజేశారు. ప్రభాకర్ మంగళవారం ఉదయం ఒక బాక్సును తీసి చూడగా ఖాళీగానే ఉంది. మిగిలిన రెండు బాక్సులు కూడా అలాగే ఉంటాయని భావించి వాటిని తెరిచి చూడలేదు. తిరిగి ఆ బాక్సులను సంబంధిత కంపెనీకి పంపిస్తామని ఆ వ్యాపారి తెలిపారు. కంపెనీ చేసిన ప్రచారాన్ని నమ్మి డబ్బులు చెల్లిస్తే ఈ విధంగా మోసం జరిగిందని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు.