wimbledon 2015
-
‘జోకర్’ తీన్మార్
-
ఫైనల్లో సెరినా వర్సెస్ ముగురుజా
-
వింబుల్డన్ లో ముగురుజా సంచలనం
లండన్:వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో వెనిజులా క్రీడాకారిణి గార్బైన్ ముగురుజా సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ముగురుజా 6-2, 3-6, 6-3 తేడాతో రద్వాన్ స్కాపై విజయం సాధించి తొలిసారి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో తొలిసెట్ ను ముగురుజా అవలీలగా గెలుచుకున్నా.. అనవసర తప్పిదాలతో రెండో సెట్ ను కోల్పోయింది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్ లో ముకురుజా దూకుడుగా ఆడి రద్వాన్ స్కాకు కళ్లెం వేసింది. దీంతో ఈరోజు సెరెనా విలియమ్స్-మరియా షరపోవాల మధ్య జరిగే మరో సెమీ ఫైనల్ మ్యాచ్ విజేతతో తలపడటానికి ముకురుజా సన్నద్ధమైంది. -
వీనస్ ను కంగుతినిపించిన సెరెనా
లండన్: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో అక్క వీనస్ విలియమ్స్ ను చెల్లెలు సెరెనా విలియమ్స్ కంగుతినిపించింది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో సెరెనా 6-4, 6-3 తేడాతో వీనస్ పై గెలుపొంది క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. తొలి సెట్ లో వీనస్ కాస్త ప్రతిఘటించింది. అయితే సెరెనా పదునైన ఏస్ ల ముందు వీనస్ తలవంచి గేమ్ ను కోల్పోయింది. రెండో గేమ్ లో సెరెనా మరింత దూకుడుగా ఆడి వీసన్ ను మట్టికరిపించింది. 2009 వింబుల్డన్ టోర్నీ తర్వాత వీరిద్దరూ తొలిసారి తలపడిన గ్రాండ్ స్లామ్ లో పోరులో వీనస్ పై సెరెనా ఆధిపత్యం చెలాయించింది. దీంతో అక్కా చెల్లెళ్ల ముఖాముఖి రికార్డును సెరెనా 15-11 తేడాతో మెరుగుపర్చుకుంది.