వింబుల్డన్ లో ముగురుజా సంచలనం | Muguruza beats Radwanska in wimbledon 2015, enters into final | Sakshi
Sakshi News home page

వింబుల్డన్ లో ముగురుజా సంచలనం

Published Thu, Jul 9 2015 7:50 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

వింబుల్డన్ లో ముగురుజా సంచలనం

వింబుల్డన్ లో ముగురుజా సంచలనం

లండన్:వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో వెనిజులా క్రీడాకారిణి గార్బైన్ ముగురుజా సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ముగురుజా 6-2, 3-6, 6-3  తేడాతో రద్వాన్ స్కాపై విజయం సాధించి తొలిసారి గ్రాండ్ స్లామ్ టోర్నీ  ఫైనల్లోకి ప్రవేశించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో తొలిసెట్ ను ముగురుజా అవలీలగా గెలుచుకున్నా..  అనవసర తప్పిదాలతో రెండో సెట్ ను కోల్పోయింది. 

 

అయితే నిర్ణయాత్మక మూడో సెట్ లో ముకురుజా దూకుడుగా ఆడి  రద్వాన్ స్కాకు కళ్లెం వేసింది. దీంతో ఈరోజు సెరెనా విలియమ్స్-మరియా షరపోవాల మధ్య జరిగే మరో సెమీ ఫైనల్ మ్యాచ్ విజేతతో తలపడటానికి ముకురుజా సన్నద్ధమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement