Radwanska
-
కెర్బర్... కష్టంగా!
♦ శ్రమించి నెగ్గిన టాప్ సీడ్ ♦ ప్రిక్వార్టర్స్‌లో ముగురుజా, రద్వాన్‌స్కా ♦ వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ లండన్: ‘నంబర్‌వన్’ ర్యాంక్‌ను నిలబెట్టుకునే క్రమంలో టాప్ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) మరో అడుగు ముందుకేసింది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ప్రపంచ 70వ ర్యాంకర్ షెల్బీ రోజర్స్ (అమెరికా)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో కెర్బర్ 2 గంటల 17 నిమిషాల్లో 4–6, 7–6 (7/2), 6–4తో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. తొలి సెట్‌ను కోల్పోయి, రెండో సెట్లో 2–4తో వెనుకబడిన కెర్బర్ ఆ తర్వాత పుంజుకుంది. స్కోరును సమం చేయడంతోపాటు సెట్‌ను టైబ్రేక్‌లో గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో కెర్బర్ తొలి గేమ్‌లోనే షెల్బీ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కెర్బర్ నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 14 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు షెల్బీ ఏకంగా 47 అనవసర తప్పిదాలు చేసింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 14వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–2, 6–2తో సొరానా కిర్స్టీ (రొమేనియా)పై, 9వ సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్) 3–6, 6–4, 6–1తో తిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై, ఐదో సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్) 3–6, 7–6 (7/3), 6–2తో కొంటావీట్ (ఎస్తోనియా)పై, ఏడో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) 6–4, 6–0తో పొలోనా హెర్కాగ్ (స్లొవేనియా)పై గెలిచారు. మూడో రౌండ్లో నెగ్గిన 24వ సీడ్ కోకో వాండెవాగె (అమెరికా), అన్సీడెడ్స్ మగ్దలీనా రిబరికోవా (స్లొవేకియా), పెట్రా మార్టిక్ (క్రొయేషియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. జొకోవిచ్ జోరు... పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా), ఆరో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో జొకోవిచ్ 6–4, 6–1, 7–6 (7/2)తో గుల్బైస్ (లాత్వియా)పై, రావ్‌నిచ్ 7–6 (7/3), 6–4, 7–5తో రామోస్ (స్పెయిన్)పై నెగ్గారు. పదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), 11వ సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), 15వ సీడ్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్), 13వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. అయితే 12వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 2–6, 6–3, 6–7 (5/7), 6–1, 5–7తో సామ్ క్వెరీ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. మూడో రౌండ్లో సానియా జంట మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా మీర్జా (భారత్)–ఫ్లిప్కెన్స్ (బెల్జియం) ద్వయం 6–3, 3–6, 6–4తో నవోమి బ్రాడీ–హితెర్ వాట్సన్ (బ్రిటన్) జంటపై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా) జోడీ 7–6 (7/2), 7–5తో మార్టిన్ (ఫ్రాన్స్)–ఒలారూ (రొమేనియా) జంటపై గెలిచింది. -
ఆట మధ్యలో ఆసక్తికర ఘటన
-
ఆట మధ్యలో ఆసక్తికర ఘటన
సింగపూర్: క్రీడల్లో రాణించేందుకు క్రీడాకారులు చాలా త్యాగాలు చేస్తుంటారు. ఫిట్ నెస్ కాపాడుకునేందుకు కష్టమైన కసరత్తులతో కుస్తీలు పడుతుంటారు. ఏదిబడితే అది తినకుండా నోరు కట్టేసుకుంటారు. చావోరేవో తేల్చుకునే మ్యాచ్ ఎదురైతే విజయం కోసం ఎంతో శ్రమిస్తారు. సరదాలు, విహారాలు కట్టిపెట్టి ఆటమీదే పూర్తిగా దృష్టి పెడతారు. రష్యా టెన్నిస్ ప్లేయర్ స్వెత్లానా కుజ్నెత్సోవా తన జుట్టును త్యాగం చేసింది. తన ఆటకు అడ్డువస్తుందని మ్యాచ్ మధ్యగా ఉండగా, అందరూ చూస్తుండగా తన జుట్టును కత్తిరించుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. డబ్ల్యూటీఏ ఫైనల్స్ మ్యాచ్‌లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రద్వాంస్కా తో ఈ మ్యాచ్ లో కుజ్నెత్సోవా తలపడింది. మొదటి సెట్ గెలిచిన కుజ్నెత్సోవా రెండో సెట్ లో డీలా పడింది. నిర్ణయాత్మక మూడో సెట్ ఆడడానికి ముందు అంపైర్ నుంచి పెద్ద కత్తెర అడిగితీసుకుని తన జట్టును కత్తిరించుకుంది. కుజ్నెత్సోవా చర్యతో వీక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. జుట్టుపోయినా మ్యాచ్ గెలవడంతో ఆమెకు ఊరట లభించింది. జుట్టు కంటే మ్యాచ్ గెలవడమే ముఖ్యమనుకున్నానని ఆట ముగిసిన తర్వాత కుజ్నెత్సోవా చెప్పింది. అయితే టెన్నిస్ ప్లేయర్లు జట్టు కత్తిరించుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ లో రాఫెల్ నాదెల్ తో జరిగిన మ్యాచ్ లో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే కనుబొమ్మలపై వెంట్రులను కత్తిరించుకున్నాడు. ఒకటిఆరా వెంట్రుకలే కాబట్టి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. -
రద్వాన్‌స్కా శ్రమించి...
* మూడో రౌండ్లోకి నాలుగో సీడ్ * సెరెనా, వీనస్ అలవోకగా... * యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ న్యూయార్క్: గతంలో పదిసార్లు యూఎస్ ఓపెన్‌లో పాల్గొన్నా ఒక్కసారీ నాలుగో రౌండ్ దాటలేకపోరుున నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్) ఈసారి ఆ అడ్డంకిని దాటి మరో అడుగు ముందుకేసింది. నవోమి బ్రాడీ (బ్రిటన్)తో జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో రద్వాన్‌స్కా 7-6 (11/9), 6-3తో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. గంటా 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రాడీ నుంచి రద్వాన్‌స్కాకు గట్టిపోటీనే ఎదురైంది. బ్రాడీ శక్తివంతమైన సర్వీస్‌లు, అంచనా వేయలేని షాట్లతో రద్వాన్‌స్కా తొలి సెట్లో ఒకదశలో 2-5తో వెనుకబడింది. అయితే బ్రాడీ ఆటతీరుపై అవగాహన కలిగాక ఈ ప్రపంచ మాజీ రెండో ర్యాంకర్ తేరుకుంది. స్కోరును సమం చేయడంతోపాటు సెట్‌ను టైబ్రేక్ వరకు తీసుకెళ్లింది. టైబ్రేక్‌లో రద్వాన్‌స్కా 5-2తో ముందంజ వేసినా వెంటనే తడబడింది. రెండుసార్లు సెట్ పాయింట్లను కాపాడుకొని తుదకు టైబ్రేక్‌లో 11-9తో గెలిచి తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్ తొలి గేమ్‌లోనే రద్వాన్‌స్కా తన సర్వీస్‌ను కోల్పోయి 0-2తో వెనుకబడింది. కానీ వెంటనే కోలుకొని బ్రాడీ సర్వీస్‌ను బ్రేక్ చేసిన రద్వాన్‌స్కా స్కోరును 2-2తో సమం చేసింది. ఆ తర్వాత మరోసారి బ్రాడీ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌ను, మ్యాచ్‌ను కై వసం చేసుకుంది. ‘బ్రాడీ కంటే ఒకట్రెండు పాయింట్లు మెరుగ్గా ఆడాను. నేను 100 శాతం శ్రమించేలా ఆమె ఆడించింది. ఆరంభంలో కాస్త నెమ్మదిగా కదిలాను. దానికి మూల్యంగా రెండుసార్లు సెట్ పాయింట్ కోల్పోయే పరిస్థితి ఎదుర్కొన్నాను. ముఖ్యంగా బ్రాడీ సర్వీస్ చాలా బాగా చేసింది. దాంతో ప్రతి పాయింట్ కీలకంగా మారింది’ అని రద్వాన్‌స్కా వ్యాఖ్యానించింది. అక్కాచెల్లెళ్లు ముందుకు... మరోవైపు విలియమ్స్ సిస్టర్స్ సెరెనా, వీనస్ సునాయాస విజయాలతో మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్లో టాప్ సీడ్ సెరెనా 6-3, 6-3తో వానియా కింగ్ (అమెరికా)పై, ఆరో సీడ్ వీనస్ 6-2, 6-3తో జూలియా జార్జెస్ (జర్మనీ)పై విజయం సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో పదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 7-5తో మాంట్సెరెట్ గొంజాలెజ్ (పరాగ్వే)పై, 17వ సీడ్ పావ్లీచెంకోవా (రష్యా) 6-2, 4-6, 7-6 (7/5)తో మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స)పై, 11వ సీడ్ కార్లా నవారో (స్పెయిన్) 6-1, 6-4తో జెలెనా జంకోవిచ్ (సెర్బియా)పై గెలిచారు. 16వ సీడ్, మాజీ చాంపియన్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 3-6, 3-6తో షుఝె జాంగ్ (చైనా) చేతిలో, 15వ సీడ్ తిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 4-6, 6-4, 4-6తో వర్వారా లెప్చెంకో (అమెరికా) చేతిలో ఓడిపోయారు. ముర్రే, వావ్రింకా జోరు పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ కీ నిషికోరి (జపాన్) మూడో రౌండ్లోకి చేరుకున్నారు. రెండో రౌండ్లో ముర్రే 6-4, 6-1, 6-4తో గ్రానోలెర్స్ (స్పెరుున్)పై, వావ్రింకా 6-1, 7-6 (7/4), 7-5తో గియానెసి (ఇటలీ)పై, నిషికోరి 6-4, 4-6, 6-4, 6-3తో ఖచనోవ్ (రష్యా)పై గెలిచారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్టియ్రా) 6-4, 6-3, 6-2తో బెరాన్కిస్ (లిథువేనియా)పై, 11వ సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెరుున్) 6-0, 4-6, 5-7, 6-1, 6-4తో ఫాగ్నిని (ఇటలీ)పై, 14వ సీడ్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 7-5, 6-4, 6-4తో జెబలోస్ (అర్జెంటీనా)పై నెగ్గి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. 16వ సీడ్ ఫెలిసియానో లోపెజ్ (స్పెరుున్) 2-6, 4-6, 6-1, 7-5తో జోవో సుసా (పోర్చుగల్) చేతిలో, 30వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స) 6-3, 2-6, 2-6, 7-6 (7/1), 6-7 (3/7)తో లొరెంజీ (ఇటలీ) చేతిలో, 27వ సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 4-6, 4-6, 7-5, 2-6తో డానియల్ ఇవాన్స్ (బ్రిటన్) చేతిలో ఓటమి చవిచూశారు. ప్రిక్వార్టర్స్‌లో వొజ్నియాకి, విన్సీ గతేడాది రన్నరప్ రొబెర్టా విన్సీ (ఇటలీ), మాజీ నంబర్‌వన్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్లో విన్సీ 6-0, 5-7, 6-3తో వితెఫ్ట్ (జర్మనీ)పై, వొజ్నియాకి 6-3, 6-1తో మోనికా నికులెస్కూ (రొమేనియా)పై గెలిచారు. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో సెవస్తోవా (లాత్వియా) 6-4, 6-1తో కాటరీనా బొండారెంకో (ఉక్రెయిన్)ను ఓడించింది. ప్రాంజల శుభారంభం బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి రౌండ్లో 16వ సీడ్ ప్రాంజల 6-3, 6-2తో విక్టోరియా ఎమ్మా (అమెరికా)ను ఓడించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)-బెగెమన్ (జర్మనీ) ద్వయం 2-6, 7-5, 4-6తో స్టీఫెన్ రాబర్ట్ (ఫ్రాన్స)-డూడీ సెలా (ఇజ్రాయెల్) జంట చేతిలో ఓడిపోయింది. -
రద్వాన్‌స్కా అవుట్
సిబుల్కోవా సంచలనం * వింబుల్డన్‌లో క్వార్టర్స్‌లో ప్రవేశం * సెరెనా కూడా ముందుకు లండన్: వింబుల్డన్‌లో మరో సంచలనం నమోదయింది. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ రద్వాన్‌స్కా ప్రి క్వార్టర్స్‌లో ఓడిపోయింది. 2 గంటల 59 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా) 6-3, 5-7, 9-7తో రద్వాన్‌స్కా (పోలాండ్)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. రెండో సెట్లో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకుని ఊపిరి పీల్చుకున్న రద్వాన్‌స్కా... మూడోసెట్లో రెండు ఏస్‌లు సంధించింది. మూడో సెట్లో ఐదుసార్లు సర్వీస్ బ్రేక్‌లు జరిగాయి. 12వ గేమ్‌తో ఆధిక్యంలోకి వచ్చిన సిబుల్కోవా... ఆ తర్వాత ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. సిబుల్కోవా వింబుల్డన్‌లో క్వార్టర్స్‌కు చేరడం ఇది రెండోసారి. టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 7-5, 6-0తో కుజ్ నెత్సోవా(రష్యా)పై, ఐదో సీడ్ హలెప్ (రొమేనియా) 6-7 (5), 6-4, 6-3తో మాడిసన్ కీస్ (అమెరికా)పై, నాలుగోసీడ్ కెర్బర్ (జర్మనీ) 6-3, 6-1తో మిసాకి (జపాన్)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరారు. -
రద్వాన్‌స్కా ఇంటికి
లండన్: సీజన్ మూడో గ్రాండ్ స్లామ్ వింబుల్డన్‌లో సంచనల ఫలితాల పరంపర కొనసాగుతోంది. మూడో సీడ్ రద్వాన్ స్కా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. సోమవారం జరిగిన నాల్గో రౌండ్ పోరులో పోలండ్ క్రీడాకారిణి రద్వాన్ స్కా 3-6, 7-5, 7-9 తేడాతో 19వ సీడ్ సిబుల్కోవా (స్లోవేకియా)చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్‌ను కోల్పోయిన పొలండ్ భామ.. ఆ తరువాత రెండో సెట్లో తేరుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో సిబుల్ కోవా దాటికి రద్వాన్ స్కా తలవంచక తప్పలేదు. దీంతో సంచలనాలకు మారుపేరైన సిబుల్కోవా క్వార్టర్స్ లో అడుగుపెట్టింది. 2012లో వింబుల్డన్ లో ఫైనల్ రౌండ్ కు వెళ్లిన రద్వాన్..ఆపై కనీసం క్వార్టర్స్ అడ్డంకిని కూడా దాటలేకపోయింది. మహిళల సింగిల్స్ లో ప్రపంచ రెండో ర్యాంకర్ గార్బిని ముగురుజా (స్పెయిన్) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టగా, పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్లో నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. మరోవైపు పురుషుల సింగిల్స్ లో మూడో సీడ్ రోజర్ ఫెదరర్ క్వార్టర్స్ కు చేరాడు. నాల్గో రౌండ్ పోరులో 6-2, 6-3, 7-5 తేడాతో స్టీవ్ జాన్సన్ పై గెలిచి క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు. -
రద్వాన్‌స్కాకు షాక్
పిరన్కోవా సంచలనం * ఆరో సీడ్ హలెప్ కూడా అవుట్ * ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ పారిస్: సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలన ఫలితాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్), ఆరో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇంటిదారి పట్టారు. గతంలో 10 సార్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడినా ఏనాడూ మూడో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయిన బల్గేరియా ప్లేయర్ స్వెతానా పిరన్కోవా ధాటికి రద్వాన్‌స్కా... యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ సమంత స్టోసుర్ దూకుడుకు హలెప్ చేతులేత్తేశారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ పిరన్కోవా 2-6, 6-3, 6-3తో ప్రపంచ రెండో ర్యాంకర్ రద్వాన్‌స్కాను ఓడించి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో రద్వాన్‌స్కా 6-2, 3-0తో ఆధిక్యంలో ఉన్న దశలో వర్షం వల్ల ఆగిపోయింది. సోమవారం వర్షం కారణంగా ఆట సాధ్యపడలేదు. మంగళవారం మ్యాచ్ మొదలయ్యాక 29 ఏళ్ల పిరన్కోవా వరుసగా ఆరు గేమ్‌లు గెలిచి రెండో సెట్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో సెట్లో పిరన్కోవా అదే జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. 2014 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ హలెప్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోసుర్ 7-6 (7/0), 6-3తో విజయం సాధించింది. తద్వారా మూడేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలి సెట్లో 3-5తో వెనుకబడ్డ 2011 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్టోసుర్ వెంటనే తేరుకొని స్కోరును 5-5తో సమం చేసింది. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించింది. రెండో సెట్లో ఒకసారి హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన స్టోసుర్ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని గెలిచింది. వెంటాడిన వర్షం మంగళవారం కూడా ఫ్రెంచ్ ఓపెన్‌ను వర్షం వీడలేదు. ఫలితంగా పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగు ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు మధ్యలోనే నిలిచిపోయాయి. బాటిస్టా అగుట్ (స్పెయిన్)తో జరుగుతున్న మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి సెట్‌ను 3-6తో కోల్పోయి, రెండో సెట్‌ను 6-4తో నెగ్గాడు. మూడో సెట్లో ఈ సెర్బియా స్టార్ 4-1తో ఆధిక్యంలో ఉన్నపుడు వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. -
ఫైనల్‌కు దూసుకెళ్లిన నల్లకలువ
మెల్బోర్న్: డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నాలుగోసీడ్ క్రీడాకారిని రద్వాన్‌స్కాను వరుస సెట్లలో ఓడించి 7వ సారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 64 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సెరెనా పవర్ గేమ్ ముందు రద్వాన్‌స్కా ఏ మాత్రం నిలువలేకపోయింది. మొదటి సెట్‌ను 6-0తో అలవోకగా గెలుచుకున్న సెరెనాకు రెండో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైనప్పటికీ.. 6-4తో సెట్‌ను గెలుచుకొని ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరగనున్న ఫైనల్లో ఏడో సీడ్ క్రీడాకారిణి కెర్బర్ లేదా అన్‌సీడెడ్ క్రీడాకారిణి జొహన్నా కొంటాతో సెరెనా తలపడనుంది. ఫైనల్లో విజయం సాధిస్తే ఈ నల్ల కలువ ఖాతాలో 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ చేరుతుంది. -
ఫైనల్లో సెరినా వర్సెస్ ముగురుజా
-
వింబుల్డన్ లో ముగురుజా సంచలనం
లండన్:వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో వెనిజులా క్రీడాకారిణి గార్బైన్ ముగురుజా సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ముగురుజా 6-2, 3-6, 6-3 తేడాతో రద్వాన్ స్కాపై విజయం సాధించి తొలిసారి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో తొలిసెట్ ను ముగురుజా అవలీలగా గెలుచుకున్నా.. అనవసర తప్పిదాలతో రెండో సెట్ ను కోల్పోయింది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్ లో ముకురుజా దూకుడుగా ఆడి రద్వాన్ స్కాకు కళ్లెం వేసింది. దీంతో ఈరోజు సెరెనా విలియమ్స్-మరియా షరపోవాల మధ్య జరిగే మరో సెమీ ఫైనల్ మ్యాచ్ విజేతతో తలపడటానికి ముకురుజా సన్నద్ధమైంది.