రద్వాన్‌స్కా అవుట్ | Cibulkova edges out Radwanska in thriller | Sakshi
Sakshi News home page

రద్వాన్‌స్కా అవుట్

Published Tue, Jul 5 2016 1:14 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

రద్వాన్‌స్కా అవుట్

రద్వాన్‌స్కా అవుట్

సిబుల్కోవా సంచలనం
* వింబుల్డన్‌లో క్వార్టర్స్‌లో ప్రవేశం
* సెరెనా కూడా ముందుకు

లండన్: వింబుల్డన్‌లో మరో సంచలనం నమోదయింది. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ రద్వాన్‌స్కా ప్రి క్వార్టర్స్‌లో ఓడిపోయింది. 2 గంటల 59 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా) 6-3, 5-7, 9-7తో రద్వాన్‌స్కా (పోలాండ్)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. రెండో సెట్‌లో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకుని ఊపిరి పీల్చుకున్న రద్వాన్‌స్కా... మూడోసెట్‌లో రెండు ఏస్‌లు సంధించింది.

మూడో సెట్‌లో ఐదుసార్లు సర్వీస్ బ్రేక్‌లు జరిగాయి. 12వ గేమ్‌తో ఆధిక్యంలోకి వచ్చిన సిబుల్కోవా... ఆ తర్వాత ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. సిబుల్కోవా వింబుల్డన్‌లో క్వార్టర్స్‌కు చేరడం ఇది రెండోసారి. టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 7-5, 6-0తో కుజ్ నెత్సోవా(రష్యా)పై,  ఐదో సీడ్ హలెప్ (రొమేనియా) 6-7 (5), 6-4, 6-3తో మాడిసన్ కీస్ (అమెరికా)పై, నాలుగోసీడ్ కెర్బర్ (జర్మనీ) 6-3, 6-1తో మిసాకి (జపాన్)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement