రద్వాన్‌స్కా ఇంటికి | Radwanska loses to cibulkova | Sakshi
Sakshi News home page

రద్వాన్‌స్కా ఇంటికి

Published Mon, Jul 4 2016 7:41 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

Radwanska loses to cibulkova

లండన్: సీజన్ మూడో గ్రాండ్ స్లామ్ వింబుల్డన్లో సంచనల ఫలితాల పరంపర కొనసాగుతోంది.  మూడో సీడ్ రద్వాన్  స్కా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది.  సోమవారం జరిగిన నాల్గో రౌండ్ పోరులో పోలండ్ క్రీడాకారిణి రద్వాన్ స్కా 3-6, 7-5, 7-9 తేడాతో 19వ సీడ్ సిబుల్కోవా (స్లోవేకియా)చేతిలో ఓటమి పాలైంది.  తొలి సెట్ను కోల్పోయిన పొలండ్ భామ.. ఆ తరువాత రెండో సెట్లో తేరుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో సిబుల్ కోవా దాటికి రద్వాన్ స్కా తలవంచక తప్పలేదు.  దీంతో సంచలనాలకు మారుపేరైన సిబుల్కోవా క్వార్టర్స్ లో అడుగుపెట్టింది.

 

2012లో వింబుల్డన్ లో ఫైనల్ రౌండ్ కు వెళ్లిన రద్వాన్..ఆపై కనీసం క్వార్టర్స్ అడ్డంకిని కూడా దాటలేకపోయింది. మహిళల సింగిల్స్ లో ప్రపంచ రెండో ర్యాంకర్ గార్బిని ముగురుజా (స్పెయిన్) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టగా, పురుషుల సింగిల్స్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్లో నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. మరోవైపు పురుషుల సింగిల్స్ లో మూడో సీడ్ రోజర్ ఫెదరర్ క్వార్టర్స్ కు చేరాడు. నాల్గో  రౌండ్ పోరులో 6-2, 6-3, 7-5 తేడాతో స్టీవ్ జాన్సన్ పై గెలిచి క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement