క్రీడల్లో రాణించేందుకు క్రీడాకారులు చాలా త్యాగాలు చేస్తుంటారు. ఫిట్ నెస్ కాపాడుకునేందుకు కష్టమైన కసరత్తులతో కుస్తీలు పడుతుంటారు. ఏదిబడితే అది తినకుండా నోరు కట్టేసుకుంటారు. చావోరేవో తేల్చుకునే మ్యాచ్ ఎదురైతే విజయం కోసం ఎంతో శ్రమిస్తారు. సరదాలు, విహారాలు కట్టిపెట్టి ఆటమీదే పూర్తిగా దృష్టి పెడతారు. రష్యా టెన్నిస్ ప్లేయర్ స్వెత్లానా కుజ్‌నెత్సోవా తన జుట్టును త్యాగం చేసింది. తన ఆటకు అడ్డువస్తుందని మ్యాచ్ మధ్యగా ఉండగా, అందరూ చూస్తుండగా తన జుట్టును కత్తిరించుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. డబ్ల్యూటీఏ ఫైనల్స్ మ్యాచ్‌లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.