Wimbledon Womens Singles
-
క్రిచికోవా X జాస్మిన్... నేడు వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్
ఈ ఏడాది వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త విజేత అవతరించనుంది. లండన్ లో ఈరోజు జరిగే ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ జాస్మిన్ పావోలిని (ఇటలీ)తో ప్రపంచ 32వ ర్యాంకర్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) తలపడుతుంది. వీరిద్దరు తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నారు. 28 ఏళ్ల క్రిచికోవా 2021లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గగా... 28 ఏళ్ల జాస్మిన్ గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ లో రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది వింబుల్డన్ సింగిల్స్ చాంపియన్‌కు 27 లక్షల పౌండ్లు (రూ. 29 కోట్ల 23 లక్షలు)... రన్నరప్‌కు 14 లక్షల పౌండ్లు (రూ. 15 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఫైనల్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
వింబుల్డన్ రాణి ఎవరో?
వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్ నేడు లండన్: ఒకవైపు అపార అనుభవమున్న అగ్రశ్రేణి తార... మరోవైపు కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతోన్న యువతార... ఈ నేపథ్యంలో సెరెనా విలియమ్స్ (అమెరికా), ముగురుజా (స్పెయిన్) శనివారం వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీకి సిద్ధమయ్యారు. భారత కాలమాన ప్రకారం శనివారం సాయంత్రం ఫైనల్ సమరం ప్రారంభమైంది. ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన సెరెనాను టైటిల్ ఫేవరెట్‌గా భావిస్తున్నప్పటికీ, సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరిన ముగురుజాను తక్కువ అంచనా వేయలేం. ముఖాముఖి రికార్డులో సెరెనా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఒకవేళ సెరెనా గెలిస్తే ఓపెన్ శకంలో అత్యధికంగా 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్‌గా నిలుస్తుంది.