wind energy
-
జీడబ్ల్యూఈసీ ఇండియా ఛైర్పర్సన్ నియామకం
గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్(జీడబ్ల్యూఈసీ) ఇండియా ఛైర్‌పర్సన్‌గా గిరీష్ తంతిని నియమించారు. ఆయన ప్రస్తుతం సుజ్లాన్ ఎనర్జీ సంస్థలో వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ సందర్భంగా జీడబ్ల్యూఈసీ విడుదల చేసిన ప్రకటనలో ‘దేశంలో పవన విద్యుదుత్పత్తి, సరఫరా సామర్థ్యాన్ని పెంపొందించాల్సి ఉంది. అందుకు అవసరమయ్యే విధివిధానాలు రూపొందించడానికి జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జీడబ్ల్యూఈసీ పనిచేస్తోంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద పవన విద్యుత్తు విపణిగా, సముద్ర తీర గాలితో 46 గిగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా మనదేశం ఎదగడానికి గిరీష్ తంతి నాయకత్వం సహకరిస్తుంది’ అని తెలిపింది.ఇదీ చదవండి: పైలట్ల కొరత తీర్చేందుకు ప్రత్యేక శిక్షణజీడబ్ల్యూఈసీ 80కు పైగా దేశాల్లోని సుమారు 1,500 కంపెనీలు, డెవలపర్లు, కాంపోనెంట్ సరఫరాదారులు, పరిశోధనా సంస్థలు, జాతీయ పునరుత్పాదక సంఘాలు, ఫైనాన్స్, బీమా కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. -
టీవీ, మొబైళ్లలోకి ప్రవేశిస్తున్న ‘గాలి’!
భూ భ్రమణం, ఉపరితల ఉష్ణోగ్రతల మధ్య తేడావల్ల గాలులు ఏర్పడి ఒకవైపు నుంచి మరోవైపునకు వీస్తాయి. ఈ గాలి ఎందుకు అవసరం అంటే వెంటనే ఏం చెబుతాం.. గాలి పీల్చకుండా బ్రతుకలేమని అంటాం. వాతావరణ మార్పులకు గాలి అవసరం అని చెబుతాం. అయితే ఇటీవల నెలకొంటున్న పరిస్థితుల వల్ల గాలి అవసరాలు పెరుగుతున్నాయి. గాలి నెమ్మదిగా మన వరండా నుంచి గుమ్మం ద్వారా మన టీవీలో చేరి వినోదాన్ని అందిస్తోంది. మన మొబైల్లో ప్రవేశిస్తోంది. మన మిక్సీలో పిండి రుబ్బేందుకు సహాయం చేస్తోంది. అదేంటి గాలి ఇన్ని పనులు చేస్తోందా అని ఆశ్చర్యపోతున్నారా.. క్రమంగా పవన విద్యుత్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆయా ప్రాజెక్ట్‌ల్లో తయారైన కరెంట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి నిత్యావసరాలకు వాడుతున్నాం. ఈరోజు గ్లోబల్ విండ్ డే సందర్భంగా పవన విద్యుత్‌కు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.వాస్తవానికి 3500 ఏళ్ల కిందటే పవనశక్తిని కనుగొన్నా.. భౌగోళిక, సాంకేతిక పరిస్థితుల దృష్ట్యా అంతగా అభివృద్ధి చెందలేదు. పారిస్ వాతావరణ ఒప్పందం తరవాత అనేక దేశాలు పవన విద్యుత్తుపై దృష్టి సారిస్తున్నాయి. భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసేందుకు, కర్బన ఉద్గారాలను కట్టడి చేసేందుకు, ఇంధన సుస్థిరతను సాధించేందుకు పునరుద్ధరణీయ ఇంధన వనరులు దోహదపడతాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగమవుతున్న ఇంధనాల్లో వీటి వాటా 41శాతం. అందులోనూ పవన విద్యుత్తు 11శాతానికే పరిమితమైంది. సౌర విద్యుత్తు తరవాత చౌకగా లభ్యమయ్యేది పవన విద్యుత్తే. థర్మల్ విద్యుత్తు కంటే దీన్ని సుమారు 35శాతం తక్కువ ఖర్చుకే ఉత్పత్తి చేయవచ్చు.ప్రపంచవ్యాప్తంగా భారత్ పవన విద్యుత్తు తయారీలో నాలుగో స్థానం(42.87 గిగావాట్లు)లో ఉంది. మొదటి స్థానంలో చైనా 288.32 గిగావాట్లు, తరవాతి స్థానాల్లో వరుసగా అమెరికా (122.32 గిగావాట్లు), జర్మనీ (62.85 గిగావాట్లు) ఉన్నాయి. డెన్మార్క్ తన విద్యుత్తు అవసరాలన్నింటికీ పూర్తిస్థాయిలో పవనశక్తినే ఉపయోగిస్తోంది. భారతదేశానికి మూడు వైపులా సుమారు 7,600 కిలోమీటర్ల మేర సముద్రతీరం ఉంది. నేషనల్ విండ్‌పవర్ కార్పొరేషన్, ప్రపంచ బ్యాంకుల సంయుక్త నివేదిక ప్రకారం..సముద్ర తీరాల వద్ద సుమారు 300 గిగావాట్ల సామర్థ్యంతో, ఇతర ప్రాంతాల్లో 195 గిగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పే అవకాశముంది. 2030 నాటికి 450 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన పునరుద్ధరణ ఇంధన వనరుల విద్యుదుత్పత్తి కేంద్రాలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో పవనశక్తి ద్వారా 140 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం సాధించాలని నిర్ణయించింది. కానీ, నేటికీ పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం 42.87 గిగావాట్లకే పరిమితమైంది.రాష్ట్రాలవారీగా పవన విద్యుత్తు స్థాపిత సామర్థ్యంతమిళనాడు 9.62 గిగావాట్లుగుజరాత్ 8.58మహారాష్ట్ర 5.1కర్ణాటక 4.98రాజస్థాన్ 4.34ఆంధ్రప్రదేశ్ 4.11తెలంగాణ 0.12 గిగావాట్లపునరుత్పాదక ఇంధన వనరుల్లో సౌరశక్తి కూడా ప్రధానపాత్ర పోషిస్తోంది. పవన విద్యుత్తు, సౌరశక్తి మధ్య ప్రధాన తేడాలు గమనిస్తే..సౌరశక్తి పగటిపూటే లభ్యమవుతుంది. విద్యుత్తు వినియోగం మాత్రం రాత్రి వేళల్లో ఎక్కువగానే ఉంటుంది. దాంతో గ్రిడ్ స్థిరత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. బ్యాటరీ నిల్వల ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉన్నప్పటికీ, ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పవనశక్తి లభ్యత రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటుంది. సౌర, పవన విద్యుత్తులను సమ్మిళితం చేయడం ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
Global Wind Day 2024: గాలి ‘పవర్’ అప్పుడే తెలిసింది!
ప్రతి సంవత్సరం జూన్ 15న జరుపుకునే గ్లోబల్ విండ్ డే, పవన శక్తి ప్రాముఖ్యత, భూగోళాన్ని మార్చే దాని శక్తి గురించి అవగాహన పెంచుతుంది. ఇది పవన శక్తిని స్థిరమైన, పునరుత్పాదక శక్తి వనరుగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించే ప్రయత్నం.భారత్‌లో ఇంధన పొదుపు శాఖ ఆధ్వర్యంలో ఏటా విభిన్న థీమ్ తో గ్లోబల్ విండ్ డేను నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ ఇంకా తెలియరాలేదు. గ్లోబల్ విండ్ ఎనర్జీ డే చరిత్ర, ప్రాముఖ్యత, ఇతర ఆసక్తికర విషయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.పవన విద్యుత్ చరిత్ర ఇదీ..విండ్ ఎనర్జీ చరిత్ర వేలాది సంవత్సరాల క్రితం నాటిది. ఈజిప్టులోని నైలు నదిపై పడవలను నడపడానికి తొలిసారిగా విండ్ మిల్స్ ఉపయోగించారు. తరువాత చైనాలో పవన శక్తిని అభివృద్ధి చేశారు. ఇక్కడ గాలితో నడిచే నీటి పంపులను క్రీస్తుపూర్వం 200లో కనుగొన్నారు. క్రీ.శ. 1వ శతాబ్దంలో అలెగ్జాండ్రియాకు చెందిన హెరాన్ విండ్ వీల్ ను సృష్టించాడు.విండ్ మిల్స్ అనతి కాలంలోనే ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రజాదరణ పొందిన పరికరంగా మారింది. వాటి ఉపయోగం చివరికి 1800ల చివరలో, 1900ల ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ కు వ్యాపించింది. పశ్చిమ అమెరికాలో వేలాది నీటి పంపులు, చిన్న విండ్ టర్బైన్లను ఏర్పాటు చేసిన హోమ్ స్టెడర్లు, వ్యవసాయదారులు దీనిని చేశారు. 1970 లలో చమురు కొరత కారణంగా పవన విద్యుత్ అభివృద్ధికి అత్యంత ఆవశ్యకత ఏర్పడింది. ఇది చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి పునరుత్పాదక శక్తి వనరులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడానికి దారితీసింది.46,422 మెగావాట్ల సామర్థ్యంభారత పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన పురోగతిని ప్రదర్శిస్తూ కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) తన తాజా డేటాను ఆవిష్కరించింది. 2024 మే 31 నాటికి సంచిత భౌతిక పురోగతి నివేదిక సౌర, పవన విద్యుత్ వ్యవస్థాపన రంగాలలో గణనీయమైన పురోగతిని హైలైట్ చేస్తుంది. ఒక్క మే నెలలోనే భారత్ 3,007.28 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించింది. ఈ గణనీయమైన పెరుగుదలకు ప్రధానంగా రెండు ప్రధాన కారణాలు. అవి పవన శక్తి, సౌర శక్తి. పవన విద్యుదుత్పత్తి 535.96 మెగావాట్లు పెరగడంతో మొత్తం సామర్థ్యం 46,422.47 మెగావాట్లకు చేరింది. -
సంద్రంలో ‘విండ్ పవర్’
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే సహజ ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు, వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలనేది వాటన్నిటి లక్ష్యం. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత పెరుగుతోంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సముద్రంలో ఏర్పాటు చేసే పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ లీజ్ రూల్స్–2023ను తాజాగా ప్రకటించింది. సముద్రంలో విండ్ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉండే చోటు కోసం జరిగే సర్వేకు మూడేళ్లు ఉన్న గడువును ఐదేళ్లకు పెంచింది. అలాగే ప్రాజెక్టుల లీజు వ్యవధి 35 ఏళ్లుగా నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్వాహకులు మెగావాట్‌కు రూ.1లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలని చెప్పింది. అయితే ఇది రిఫండబుల్ అని స్పష్టం చేసింది. థర్మల్ కంటే ఖర్చు తక్కువ పవన శక్తి సామర్థ్యం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ప్రపంచ పవన విద్యుత్ పరిశ్రమ సామర్థ్యం 837 గిగావాట్లకి చేరింది. ఇది ఏటా 1.2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను తగ్గించడంలో సహాయపడుతోంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూసీ) విశ్లేషణ ప్రకారం.. విండ్ పవర్ వృద్ధి రేటు వచ్చే దశాబ్దంలో 15 శాతానికి పెరగాలి. ఇందుకోసం పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపన పెరగాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో దేశంలోని సముద్రంలో 2026 నాటికి దాదాపు 20 గిగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించే ప్రయత్నం జరుగుతోంది. భూమి మీద కంటే సముద్రంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆఫ్‌షోర్ విండ్ పవర్ ప్లాంట్లతో అధికంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అయ్యే ఖర్చు కంటే తక్కువకే పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఈ విద్యుత్ విక్రయానికి ఓపెన్ యాక్సెస్, ఇంటర్–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జీల మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. రాష్ట్రంలో సముద్రం అనుకూలం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 8,998.323 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో పవన విద్యుత్ 4,083.37 మెగావాట్లుగా ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పవన విద్యుత్ ఉత్పత్తి పెరుగుదలను నమోదు చేసుకుంది. ప్రభుత్వ చర్యలకు వాతావరణంలో వస్తున్న మార్పులు తోడవ్వడంతో ఏపీలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయొరాలజీ (పుణె)కి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలోని సముద్ర ప్రాంతాల్లో గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. -
Anand Mahindra: నితిన్ గడ్కారీజీ మనమూ ఇలా చేద్దామా?
కేంద్ర రవాణా, ఉపరితల శాఖ మంత్రిగా నితిన్ గడ్కారీ నిమిషం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఓవైపు ఈవీ వెహికల్స్‌ని ప్రోత్సహిస్తూనే మరోవైపు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే లక్ష్యంతో స్వయంగా హైడ్రోజన్ సెల్ కారులో ప్రయాణం చేస్తున్నారు. ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్సీ ఇంజన్ల తయారీపై మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలకు సూచనలు చేస్తున్నారు. కాలుష్య రహిత ఇంధనం కోసం ఇంతలా పరితపిస్తున్న మంత్రి నితిన్ గడ్కారీకి ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా ఓ సూచన చేశారు. టర్కీకి చెందిన ఇస్తాంబుల్ యూనివర్సిటీ విద్యార్థులు ఇటీవల అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. రోడ్లపై వాహనాలు వేగంగా ప్రయాణించినప్పుడు గాలిని చీల్చుకుంటూ వెళ్తాయి. ఈ క్రమంలో గాలులు బలంగా వీస్తాయి. ఈ విండ్ ఫోర్స్‌ని ఉపయోగించుకుని కరెంటు ఉత్పత్తి చేసే టర్బైన్లని డెవలప్ చేశారు. ఈ టర్బైన్లు గంటకి 1 కిలోవాట్ పవర్‌ను జనరేట్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టను టర్కీలోని ఇస్తాంబుల్ రోడ్లపై చేపట్టారు. ఇస్తాంబుల్‌లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు వీడియోను ఉద్దేశిస్తూ .. ఇండియాలో ఉన్న ట్రాఫిక్‌కి ఈ తరహా ప్రాజెక్టును కనుక చేపడితే ప్రపంచంలోనే విండ్ పవర్లో ఇండియా గ్లోబల్ ఫోర్స్‌గా నిలుస్తుంది. మనదేశంలోని హైవేల వెంట ఇలాంటి టర్బైన్లు ఏర్పాటు చేద్దామా అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని అడిగారు ఆనంద్ మహీంద్రా. Developed by Istanbul Technical University. Ingenious. Uses the wind generated by passing traffic. Given India’s traffic, we could become a global force in wind energy! 😊 Can we explore using them on our highways @nitin_gadkari ji? https://t.co/eEKOhvRpDo — anand mahindra (@anandmahindra) April 6, 2022 -
టీ అమ్మే వ్యక్తి.. నేడు రైలు ఇంజిన్ తయారు చేసే స్థాయికి!
ఆగ్రా: టీ అమ్ముతూ, సైకిళ్లను రిపేర్ చేసే త్రిలోకి ప్రసాద్ గాలి శక్తితో నడిచే ఇంజన్ని తయారు చేశాడు. అతను ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రి నివాసి. పైగా అతను తయారు చేసిన ఇంజిన్‌ను కారు, ఆటోమొబైల్స్‌కు సరిపోయేలా రీ డిజైన్ చేస్తే అధిక మొత్తంలో వాహన కాలుష్యం నియంత్రించగలం అని చెబుతున్నాడు. అంతేకాదు పైగా త్రిలోకి తయారు చేసిన న్యూమాటిక్ ఇంజిన్ ద్విచక్ర వాహనం నుండి రైలు వరకు ఏదైనా నడపగలదు. (చదవండి: నీ దొంగ బుద్ధి తగలెయ్య!...మరీ ఆ వస్తువా! ఎక్స్పీరియన్స్ లేనట్టుందే....) ఈ ఇంజిన్ వాహనం అవసరాలకు అనుగుణంగా ఇంజిన్ ఆకారాన్ని మాత్రమే మార్చితే సిపోతుందని అంటున్నాడు. ఈ మేరకు 50 ఏళ్ల త్రిలోక్ మాట్లాడుతూ....నేను చిన్న వయసులోనే ట్యూబ్‌వెల్ ఇంజిన్‌ను తయారు చేయడం నేర్చుకున్నాను. అయితే నేను 15 ఏళ్ల క్రితం టైర్లకు పంక్చర్లు రిపేరు చేసేవాడు. ఇలా నేను చేస్తూ ఉండగా ఒకరోజు పంక్చర్ అయిన ట్యూబ్‌లో గాలిని నింపుతున్నప్పుడు ఎయిర్ ట్యాంక్ వాల్వ్ లీక్ అయ్యి , గాలి ఒత్తిడి కారణంగా ట్యాంక్ ఇంజిన్ రివర్స్‌లో పనిచేయడం ప్రారంభించింది. దీంతో అప్పటి నుంచి గాలి శక్తిని ఇంజిన్‌లో ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. ఆ క్రమంలో నేను యంత్రాన్ని గాలితో ఆపరేట్ చేయగలిగితే ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని భావించాను. ట్యాంక్‌లో గాలి నింపే ఖర్చును తగ్గించే ప్రయత్నంతో మొదలైన ఆలోచన చివరకు పూర్తి స్థాయి ఆటోమోటివ్ ఇంజిన్‌గా రూపాంతరం చెందింది. అని చెప్పారు. ఈ క్రమంలో త్రోలోకి భాగస్వామి సంతోష చౌహర్ మాట్లాడుతు తమ బృందంలో తానొక్కడే గ్రాడ్యుయేట్ అని మిగిలిన వారంతా పది కూడా పూర్తిచేయలేదు. మా బృందం అంతా కలిసి ఊపిరితిత్తుల ఆకారంలో రెండు బెల్లోలను తయారు చేసి వాటిని యంత్రంలో అమర్చాం. ఆ తర్వాత యంత్రానికి ఉన్న మీటను తిప్పడం ద్వారా బెలోస్లో గాలి ఒత్తిడి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇంజిన్ మానవుని ఊపిరితిత్తుల మాదిరిగానే గాలిని పంపింగ్ చేయడం ప్రారంభించింది. అంతేకాదు యంత్రంలోని భాగాల్లో ఘర్షణను తగ్గించేందుకు లూబ్రికెంట్ అయిల్ అవసరం. పైగా పెట్రోల్-డీజిల్ ఇంజిన్ల వలే కాకుండా మేము తయారు చేసిన లిస్టర్ ఇంజన్లో లూబ్రికెంట్ ఆయిల్ వేడిగా లేదా నల్లగా మారదు. అని చెప్పాడు. అయితే త్రిలోకి తనకు వారసత్వంగా వచ్చిన ఇల్లు, పొలం అమ్మి ఈ యంత్రాన్ని తయారు చేసినట్లు చెప్పాడు. అంతేకాదు తమ బృందం పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. (చదవండి: పువ్వుల్లొ దాగున్న ఇల్లు... కానీ అవి మొక్కలకు పూయని పూలు!) -
‘విండ్’కు సింగిల్ విండో
సాక్షి, హైదరాబాద్: పవన విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఉత్పత్తిదారులు, డెవలపర్లకు అనుకూల వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పవన విద్యుత్ విధానాన్ని ప్రకటించనుంది. 2017–19 కాలంలో రాష్ట్రంలో 2,000 మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించడం.. మరోవైపు తెలంగాణ 4,224 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగి ఉందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ వెల్లడించిన నేపథ్యంలో కొత్త పాలసీకి ప్రణాళికలు రూపొందిస్తోంది. పాలసీ ప్రకారం ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు 24 నెలల వ్యవధిలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభిస్తే పలు రాయితీ, ప్రోత్సాహకాలు అందించనుంది. ఈ మేరకు ముసాయిదా పవన విద్యుత్ విధానాన్ని ఇంధన శాఖ రూపొందించింది. ♦ సింగిల్ విండో విధానంలో పవన విద్యుత్ ప్రాజెక్టులకు 30 రోజుల్లో అన్ని రకాల అనుమతులను ప్రభుత్వం జారీ చేయనుంది. మెగావాట్‌కు రూ.25 వేల చొప్పున లావాదేవీల చార్జీలను విధించనుంది. ♦ విద్యుత్ ప్లాంట్ల కోసం డెవలపర్లు సేకరించే వ్యవసాయ భూములను ఆటోమెటిక్‌గా వ్యవసాయేతర భూములుగా భూ వినియోగ మార్పిడి చేసినట్లు ప్రభుత్వం పరిగణిస్తుంది. కంపెనీలు భూ వినియోగ మార్పిడి చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఎలాంటి భూ వినియోగ మార్పిడి ప్రక్రియ అవసరం ఉండదు. ♦ విద్యుత్ ప్లాంట్ల కోసం కొనుగోలు చేసే భూములకు ల్యాండ్ సీలింగ్ చట్టం నుంచి మినహాయింపు కల్పించనుంది. సొంత అవసరాల కోసం నిర్మించే ప్లాంట్ల విద్యుత్ సరఫరా, పంపిణీ చార్జీలను మినహాయించనుంది. ♦ సొంత అవసరాలు, బహిరంగ మార్కెట్లో విక్రయానికి ఏర్పాటు చేసే ప్లాంట్ల విద్యుత్‌కు 100% బ్యాంకింగ్ సదుపాయాన్ని డిస్కంలు కల్పించనున్నాయి. డిమాండ్ గరిష్టంగా ఉండే ఫిబ్రవరి–జూన్‌లో, ఇతర సమయాల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు బ్యాంకింగ్ చేసిన విద్యుత్‌ను తిరిగి పొందడానికి అవకాశం ఉండదు. మిగిలిన సమయాల్లో బ్యాంకింగ్ విద్యుత్‌ను ఉత్పత్తిదారులు వెనక్కి తీసుకోవచ్చు. ♦ సొంత అవసరాల కోసం ఏర్పాటు చేసే ప్లాంట్లకు విద్యుత్ సుంకాన్ని ప్రభుత్వం మినహాయించనుంది. రాష్ట్రంలో విద్యుత్ విక్రయించే పవన విద్యుత్ ప్లాంట్లకు 100 శాతం క్రాస్ సబ్సిడీ సర్ చార్జీని మినహాయించనుంది. ♦ విద్యుత్ సరఫరా, పంపిణీ గ్రిడ్లకు అనుసంధానం కోసం సరఫరా, పంపిణీ లైన్ల ఏర్పాటు బాధ్యత ఉత్పత్తిదారులదే. అయితే ట్రాన్స్‌కో, డిస్కంలకు చెల్లిం చాల్సిన పర్యవేక్షణ చార్జీలను మినహాయించనుంది. ప్లాంట్ల ఏర్పాటుకు సాంకేతిక సాధ్యాసాధ్యాల ప్రతిపాదనలను ట్రాన్స్‌కో, డిస్కంలు 30 రోజుల్లో పరిష్కరిస్తాయి. ♦ విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు స్థానిక గ్రామ పంచాయతీకి ఎకరాకు రూ.25 వేలు చొప్పున అభివృద్ధి చార్జీలు డెవలపర్లు చెల్లించాలి. 14 పనిదినాల్లో గ్రామ పంచా యతీలు ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ♦ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి అన్ని పరికరాలపై 100 శాతం స్టేట్ జీఎస్టీని ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. ♦ భూ రిజిస్ట్రేన్లపై 100 శాతం స్టాంప్ డ్యూటీని తిరిగి చెల్లించనుంది. ♦ ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్ముకునేందుకు ఇంట్రాస్టేట్ ఓపెన్ యాక్సెస్ అనుమతులను ప్రభుత్వం జారీ చేయనుంది. ♦ సౌర, పవన విద్యుత్ ప్లాంట్లను ఒకే చోట నిర్మించే విధంగా హైబ్రిడ్ ప్లాంట్లను ప్రభుత్వం ప్రోత్సహించనుంది. -
పునరుత్పాదక విద్యుత్‌కు చేయూతనివ్వాలి
‘సాక్షి’ ఇంటర్వ్యూ టాటా పవర్ ఎండీ అనిల్ సర్దానా.. చౌక టెక్నాలజీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అవసరం... ఈ వ్యవస్థ పటిష్టం కావడం ఆర్థిక వృద్ధికి కీలకం.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో 2020 నాటికి 26వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని ప్రైవేట్ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ నిర్దేశించుకుంది. ఇందులో నాలుగోవంతు వాటా పునరుత్పాదక విద్యుత్‌ది ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే సంప్రదాయేతర విద్యుదుత్పత్తి విభాగం పనితీరు, ఎదుర్కొంటున్న సవాళ్లు వంటి విషయాల గురించి టాటా పవర్ ఎండీ అనిల్ సర్దానా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే... జోరుగా స్థల సమీకరణ టాటా పవర్లో భాగమైన సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక విభాగం సామర్థ్యం ప్రస్తుతం 1,106 మెగావాట్లుగా ఉంది. 2020 నాటికల్లా టాటా పవర్ 26,000 మె.వా. విద్యుదుత్పాదన సామర్థ్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా... అందులో సుమారు 20-25 శాతం కాలుష్యరహితమైన సంప్రదాయేతర వనరుల ద్వారా ఉండాలని నిర్దేశించుకున్నాం. ప్రస్తుతం పవన విద్యుత్‌కి సంబంధించి 398 మె.వా. సామర్థ్యం ఉంది. మరో 160 మె.వా. ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాం. ఇక సౌర విద్యుత్‌కి సంబంధించి 28 మె.వా. పైగా సామర్థ్యం ఉంది. మరిన్ని ప్రాజెక్టులను చేపట్టే దిశగా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో స్థల సమీకరణ ప్రక్రియ జరుగుతోంది. విద్యుదుత్పత్తి విధానాన్ని బట్టి భౌగోళికంగా పరిస్థితులు అనువుగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటున్నాం. రెండింటికీ ప్రాధాన్యం.. సౌర, పవన విద్యుత్.. రెండింటికీ ప్రాధాన్యం ఇస్తున్నాం. అయితే, దేశీయంగా పవన విద్యుత్ రంగ విధానాలు గడిచిన ఇరవై ఏళ్లుగా అభివృద్ధి చెందాయి. కానీ, సౌర విద్యుత్ రంగం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంకా పూర్తి స్థాయిలో రూపొందాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే.. మొత్తం మీద ఏటా 150-200 మె.వా. మేర పవన విద్యుత్, 30-50 మె.వా. మేర సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్నాం. ఇతర దేశాల్లో విస్తరణ.. అంతర్జాతీయంగా నాలుగు కీలక ప్రాంతాలను ఎంచుకున్నాం. ఇందులో ఆఫ్రికా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, సార్క్ దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో మార్కెట్ పరిస్థితులను, అవకాశాలను అధ్యయనం చేస్తున్నాం. దక్షిణాఫ్రికా, ఇండొనేషియా వంటి దేశాల్లో ఇతర కంపెనీలతో కలిసి ఇప్పటికే ప్రాజెక్టులు చేపట్టాం. అవకాశాలు, రిస్కులు, రివార్డులు మొదలైన అంశాల ప్రాతిపదిక గా ఆయా దేశాలను ఎంచుకుంటున్నాం. సంప్రదాయేతర విద్యుదుత్పత్తికి సవాళ్లు.. ఈ రంగం ప్రధానంగా కొనుగోలుదారులపరమైన సమస్య ఎదుర్కొంటోంది. చాలా మటుకు పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితులు బాగా లేవు. దీంతో అవి కొనుక్కునే విద్యుత్ చెల్లింపుల్లో జాప్యాలు జరుగుతున్నాయి. మరోవైపు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ రకాల విధానాలు పాటిస్తుండటం వల్ల ఇలాంటి ప్రాజెక్టులు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. స్థల సమీకరణలో జాప్యం, అటవీ శాఖ అనుమతుల్లో జాప్యం, పునరావాస కల్పన లాంటివి వీటికి తోడవుతున్నాయి. ఇక పవన విద్యుత్‌కి అనువైన పరిస్థితులు ఉన్న కొన్ని రాష్ట్రాలు.. ఇప్పటికే తమకు సరిపడేంత విద్యుత్ ఉండటంతో కొత్తగా మరింత సామర్థ్యాన్ని పెంచేందుకు అంతగా ఇష్టపడటం లేదు. ఇందుకు టారిఫ్‌లను తగ్గించేయడం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోకపోవడం వంటి మార్గాలు ఎంచుకుంటున్నాయి. పంపిణీ సంస్థలు తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలన్న నిబంధనను అమలు చేయకపోవడం వల్ల సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. ప్రభుత్వ సహకారం కావాలి.. ఎకానమీ వృద్ధిలో కీలక పాత్ర పోషించే విద్యుత్ రంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ రంగం ఎదగడానికి అడ్డుగా ఉంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. అలాగే ప్రభుత్వం విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యాపారాల్లో డిజిన్వెస్ట్ చేసి, పెట్టుబడులు రావడానికి ఊతమివ్వాలి. ప్రైవేట్ సంస్థలు ప్రజల అవసరాలకు తగిన విధంగా స్పందించేలా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విద్యుదుత్పత్తి పరిమాణంలోనే కాకుండా నాణ్యతలో కూడా ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగి ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం గట్టిగా తల్చుకుంటే ఇది సాధ్యమే. పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు(ఆర్పీవో) వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేస్తే ఈ రంగానికి గట్టి ఊతం లభిస్తుంది. పునరుత్పాదక వనరులు దేశవ్యాప్తంగా ఒకే స్థాయిలో ఉండవు కనుక అవి పుష్కలంగా ఉన్న చోట్లలో భారీఎత్తున ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఆర్పీవోల వల్ల భరోసా కలుగుతుంది. ఇక, సౌర విద్యుదుత్పత్తికి ఉపయోగించే టెక్నాలజీపైనా (సీఎస్టీ లేదా పీవీ) ఆంక్షలు పెట్టకుండా దాన్ని డెవలపర్లకే విడిచిపెట్టాలి. విద్యుదుత్పత్తి వ్యయాలను తగ్గించే టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ప్రోత్సాహమివ్వాలి.