Winston Benjamin
-
ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మాజీ క్రికెటర్ కొడుకు
పారిస్ ఒలింపిక్స్‌లో వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ విన్స్టన్ బెంజమిన్ కొడుకు రాయ్ బెంజమిన్ గోల్డ్ మెడల్ సాధించాడు. విశ్వక్రీడల్లో యూఎస్ఏకు ప్రాతినిథ్యం వహించిన రాయ్.. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో 46.46 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో రాయ్ ప్రపంచ రికార్డు హోల్డర్, నార్వేకు చెందిన కార్స్టన్ వార్హోమ్‌ను ఓడించి పసిడి పతకం నెగ్గాడు.రాయ్ ఒలింపిక్స్ స్వర్ణం సాధించడం పట్ల తండ్రి విన్స్టన్ ఎనలేని ఆనందం వ్యక్తం చేశాడు. తన కొడుకు సాధించిన విజయాన్ని విన్స్టన్ ప్రపంచ కప్ ఫైనల్ గెలుపుతో పోల్చాడు. రాయ్ ఈ విజయం సాధించడానికి ఎంతో కష్టపడ్డాడని విన్స్టన్ తెలిపాడు. రాయ్ విజయం యునైటెడ్ స్టేట్స్కే కాకుండా తాను పుట్టి పెరిగిన ఆంటిగ్వాకు కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చిందని విన్స్టన్ అన్నాడు.59 ఏళ్ల విన్స్టన్ 80, 90 దశకాల్లో వెస్టిండీస్ తరఫున 21 టెస్ట్‌లు, 85 వన్డేలు ఆడి 161 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా అయిన విన్స్టన్ టెస్ట్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. 27 ఏళ్ల రాయ్ బెంజమిన్.. విన్స్టన్ ఆరుగురు సంతానంలో ఒకరు. రాయ్ టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. చిన్నతనంలో క్రికెట్ పట్ల ఆకర్శితుడైన రాయ్.. ఆతర్వాత మనసు మార్చుకుని ట్రాక్ ఆండ్ ఫీల్డ్ గేమ్స్ వైపు మళ్లాడు. -
సెమీస్‌లో సచిన్
ఆంటిగ్వా: వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఇటీవలి ప్రదర్శన ఒక విషాదం అయితే ఆ జట్టుకు ఆడిన మాజీ క్రికెటర్ల పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏ కొందరు ఆటగాళ్లో తప్ప ఎక్కువ మంది బతుకుతెరువు కోసం చిన్నపాటి పనులపై ఆధారపడక తప్పడం లేదు. వెస్టిండీస్ అందించిన భీకరమైన పేస్ బౌలర్లలో విన్స్టన్ బెంజమిన్ కూడా ఒకరు. మాల్కం మార్షల్‌కు వారసుడిగా ఒకప్పుడు మన్ననలందుకున్న ఆయన 21 టెస్టులు, 85 వన్డేలతో పాటు 171 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. అయితే ఇప్పుడు ఆయన ఇక్కడి వివ్ రిచర్డ్స్ స్టేడియంలో గ్రౌండ్స్‌మన్‌గా పని చేస్తున్నారు. భారత్, విండీస్ మధ్య వన్డే మ్యాచ్ సందర్భంగా ఈ దృశ్యం కనిపించింది. బౌండరీ లైన్ వద్ద ఉండే కుషన్లు, బోర్డులు, సైట్ స్క్రీన్లు బిగించడం ఆయన పని. మ్యాచ్‌లు జరిగే సమయంలో ఒక సూపర్వైజర్ చేతి కింద సాగే ఈ పని కోసం 52 ఏళ్ల విన్‌స్టన్‌కు రోజుకు 70 డాలర్లు లభిస్తాయి. ‘నిజాయితీగా కష్టపడుతూ దీనిని సంపాదిస్తున్నాను. ఇక్కడివాళ్లకు నేనెవరో అనవసరం. నా పనికి తగిన ప్రతిఫలం ఇమ్మని వారిని కోరాను. ఆటగాడిగా ఉన్న సమయంలో కూడా నేను పెద్దగా సంపాదించలేదు. కాబట్టి నాకు ఏదో ఉద్యోగం అవసరం. నాకు ఇద్దరు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. ఇలాంటప్పుడు ప్రతీ డాలర్ అమూల్యమైనదే’ అని చెప్పుకున్నారు. -
బౌండరీ బోర్డులు బిగిస్తూ...
విండీస్ మాజీ పేసర్ విన్స్టన్ బెంజమిన్ పరిస్థితి ఆంటిగ్వా: వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఇటీవలి ప్రదర్శన ఒక విషాదం అయితే ఆ జట్టుకు ఆడిన మాజీ క్రికెటర్ల పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏ కొందరు ఆటగాళ్లో తప్ప ఎక్కువ మంది బతుకుతెరువు కోసం చిన్నపాటి పనులపై ఆధారపడక తప్పడం లేదు. వెస్టిండీస్ అందించిన భీకరమైన పేస్ బౌలర్లలో విన్స్టన్ బెంజమిన్ కూడా ఒకరు. మాల్కం మార్షల్‌కు వారసుడిగా ఒకప్పుడు మన్ననలందుకున్న ఆయన 21 టెస్టులు, 85 వన్డేలతో పాటు 171 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. అయితే ఇప్పుడు ఆయన ఇక్కడి వివ్ రిచర్డ్స్ స్టేడియంలో గ్రౌండ్స్‌మన్‌గా పని చేస్తున్నారు. భారత్, విండీస్ మధ్య వన్డే మ్యాచ్ సందర్భంగా ఈ దృశ్యం కనిపించింది. బౌండరీ లైన్ వద్ద ఉండే కుషన్లు, బోర్డులు, సైట్ స్క్రీన్లు బిగించడం ఆయన పని. మ్యాచ్‌లు జరిగే సమయంలో ఒక సూపర్వైజర్ చేతి కింద సాగే ఈ పని కోసం 52 ఏళ్ల విన్‌స్టన్‌కు రోజుకు 70 డాలర్లు లభిస్తాయి. ‘నిజాయితీగా కష్టపడుతూ దీనిని సంపాదిస్తున్నాను. ఇక్కడివాళ్లకు నేనెవరో అనవసరం. నా పనికి తగిన ప్రతిఫలం ఇమ్మని వారిని కోరాను. ఆటగాడిగా ఉన్న సమయంలో కూడా నేను పెద్దగా సంపాదించలేదు. కాబట్టి నాకు ఏదో ఉద్యోగం అవసరం. నాకు ఇద్దరు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. ఇలాంటప్పుడు ప్రతీ డాలర్ అమూల్యమైనదే’ అని చెప్పుకున్నారు.