winter tour
-
మంచు కొండల్లో విహారానికి సై
స్నో అడ్వెంచర్లకు కులుమనాలి అనువైన ప్రదేశంగా పేరొందింది. డిసెంబరులో కులుమనాలి చూసేందుకు వేలాది మంది సందర్శకులు వెళుతున్నారట. ఈ ప్రాంతం ప్రపంచంలోనే మంచు క్రీడలకు ప్రత్యేకమైనదిగా ఖ్యాతి గడించింది. అదే సమయంలో ఎన్నో కొత్త జంటలకు మనాలి హనీమూన్ స్పాట్‌గానూ పిలచుకుంటారు. ఉత్తరాఖండ్‌లోని ఔలి ప్రాంతం నుంచి చూస్తే హిమాలయాలు స్పష్టంగా కనిపిస్తాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా పర్యాటకుల మనసు దోచుకుంటుంది. అక్కడి ఇళ్లపై మంచు దుప్పటిలా పరుచుకుంటుంది. లద్దాఖ్‌లో మంచు వర్షం పర్యాటకులను కనువిందు చేస్తుంది. జమ్మూకశ్మీర్‌లో కేబుల్ కార్ ప్రత్యేక ఆకర్షణ. శ్రీనగర్, డార్జిలింగ్, కొడైకెనాల్, ఊటీ తదితర ప్రదేశాలకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడిని తట్టుకునే బట్టలు వెంట తీసుకోవడంతో పాటు, వైద్యుల సూచనల మేరకు మందులు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంటున్నారు. అక్కడి రహదారులపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. కొత్త అనుభూతినిచ్చింది.. కుటుంబ సభ్యులంతా కలసి మనాలి టూర్ వెళ్లాం. ఎనిమిది రోజుల లాంగ్ టూర్ అది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకూ విమానంలో వెళ్లాం. అక్కడి నుంచి రాత్రంతా బస్సు ప్రయాణం. మనాలిలో ఒక రోజు బస చేశాం. కొత్త ప్రాంతం మంచు కొండలు, ప్రకృతి అందాలు, గ్రీనరీ మనసుకు హాయిగా అనిపించాయి. నదిలో రాప్టింగ్ చేశాం. హోటల్లో రాత్రి ఫైర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడి వాతావరణం, వస్త్రధారణ కొత్త అనుభూతినిచ్చింది. – విజయ్ కుమార్ జైన్, హైదరాబాద్ప్రయాణం ఇలా.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకూ విమానంలో ప్రయాణించి, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు రహదారి మార్గంలో చేరుకోవాలి. యువత కార్, మోటారు సైకిళ్లను అద్దెకు తీసుకుని మంచు కొండల్లో రయ్.. రయ్..మంటూ దూసుకుపోతున్నారు. -
ఐఆర్సీటీసీ వింటర్ టూర్స్
సాక్షి, సిటీబ్యూరో: భారత్ దర్శన్ వంటి ఆధ్యాత్మిక పర్యటనలు, స్కూల్ టూర్స్‌తో వినోద, విజ్ఞాన పర్యటనలు, హైదరాబాద్ నుంచి జాతీయ, అంతర్జాతీయ విమానయాన పర్యటనల కోసం ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్న ఐఆర్సీటీసీ నగరవాసుల కోసం వింటర్ టూర్స్‌ను సిద్ధం చేసింది. హైదరాబాద్ నుంచి మేఘాలయ, చిరపుంజి, మాలినాంగ్, ఖజిరంగా– గౌహతి తదితర టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. అన్ని రకాల రవాణా, వసతి సదుపాయాలతో వీటిని రూపొందించినట్లు ఐఆర్సీటీసీ ఉన్నతాధికారి సంజీవయ్య తెలిపారు. ఆహ్లాదం, కనువిందు చేసే ఎన్నో దర్శనీయ స్థలాలను ఈ పర్యటనలో చూడవచ్చని ఆయన పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలు, ప్యాకేజీల వివరాలు ఇలా ఉన్నాయి. మ్యాజికల్ మేఘాలయ.. ఈ పర్యటన నవంబర్ 7 నుంచి 12వ తేదీ వరకు ఉంటుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 7న తేదీ ఉదయం 9.20 గంటలకు ఫ్లైట్ (6ఈ 186)లో బయలుదేరి ఉదయం 11.45 గంటలకు గౌహతి చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఫ్లైట్ (6ఈ 187)లో బయలుదేరి సాయంత్రం 5.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ♦ ఈ పర్యటనలో భాగంగా మొదటి రోజు గౌహతి నుంచి షిల్లాంగ్ చేరుకుంటారు. వార్డ్స్లేక్, పోలీస్బజార్ వంటి స్థలాలను సందర్శిస్తారు. రెండో రోజు చిరపుంజి పర్యటన ఉంటుంది. నొఖాలికై జలపాతం, మౌసమి గుహలు, ఎలిఫెంటా ఫాల్స్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ♦ ఆసియాలోనే అతి పరిశుభ్రమైన గ్రామంగా పేరొందిన మాలినాంగ్ను మూడోరోజు సందర్శిస్తారు. లివింగ్ రూట్ బ్రిడ్జి, డాకీలేక్ తదితర ప్రాంతాలు ఈ పర్యటనలో ఉంటాయి. సాయంత్రం షిల్లాంగ్ చేరుకుంటారు. ♦ పర్యటనలో నాలుగో రోజు ఖజిరంగా నేషనల్ పార్కు సందర్శన ఉంటుంది. డాన్‌బొస్కో మ్యూజియం, ఉమియుమ్ లేక్ సందర్శిస్తారు. 5వ రోజు పర్యటనలో భాగంగా జీప్ సఫారీ, బాలాజీ టెంపుల్, కామాఖ్య దేవాలయం తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. 6వ రోజు గౌహతి నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. చార్జీలు ఇలా.. విమానచార్జీలు, రవాణా, హోటల్ తదితర అన్ని సదుపాయాలతో ఈ ప్యాకేజీ ఇద్దరికి కలిపి బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.33,325 చొప్పున, ముగ్గురికి కలిపి బుక్ చేసుకుంటే రూ.30,397 చొప్పున ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.26,373 చార్జీ ఉంటుంది. జైసల్మేర్టుఉదయ్పూర్.. రానున్న శీతాకాలంలో మరో ఆకర్షణీయమైన పర్యటన రాజస్థాన్. నవంబర్ 12 నుంచి 17 వరకు ఉంటుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 12న ఉదయం 5.05 గంటలకు ఫ్లైట్ (6ఈ 995)లో బయలుదేరి 7.05 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి మరో ఫ్లైట్ (2టీ 703)లో ఉదయం 10.40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు జైసల్మేర్ చేరుకుంటారు. తిరుగుప్రయాణంలో 17వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు ఫ్లైట్ (6ఈ 484)లో బయలుదేరి 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ♦ ఈ పర్యటనలో జైసల్మేర్ పోర్ట్, పట్వాన్ హవేలీ, గడిసార్ లేక్ తదితర ప్రాంతాలను మొదటి రోజు సందర్శిస్తారు. ♦ రెండోరోజు ఎడారి క్యాంప్, జీప్రైడ్ వంటివి ఉంటాయి. మరుసటి రోజు జైసల్మేర్ నుంచి బయలుదేరి జోధ్‌పూర్ చేరుకుంటారు. ఆక్కడ మెహ్రంగార్త్ ఫోర్ట్, జశ్వంత్ తాడ తదితర ప్రాంతాల సందర్శన ఉంటుంది. 4వ రోజు జోద్పూర్ నుంచి ఉదయ్‌పూర్ చేరుకుంటారు. రెండు రోజుల పాటు ఉదయ్‌పూర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించి టూర్లో 6వ రోజు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. చార్జీలు ఇలా.. అన్ని సదుపాయాలతో కలిపి ఒక్కరికి రూ.35,950. ఇద్దరికి కలిపి బుక్ చేసుకొంటే ఒక్కొక్కరికి రూ.27,700 చొప్పున చార్జీలు ఉంటాయి. ముగ్గురికి కలిపి బుక్ చేసుకుంటే రూ.26,000 చొప్పున చార్జీ ఉంటుంది. పిల్లలకు రూ.23,450 చొప్పున ఉంటుంది. రన్ఆఫ్ కచ్.. నవంబర్ 16 నుంచి 18 వరకు కొనసాగే ఈ పర్యటనలో రన్ ఆఫ్ కచ్ వేడుకలను వీక్షించవచ్చు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 16న ఉదయం 8.35 గంటలకు ఫ్లైట్ (జీ8–551)లో బయలుదేరి 10.30 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2.50 గంటలకు అహ్మదాబాద్ నుంచి ఫ్లైట్ (2టీ711)లో బయలుదేరి మధ్యాహ్నం 3.45 గంటలకు కాండ్లా చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో 18న సాయంత్రం 4.05 గంటలకు ఫ్లైట్ (2టీ717)లో కాండ్లా నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఫ్లైట్ (జీ8–552)లో రాత్రి 8.35 గంటలకు బయలుదేరి 10.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. చార్జీలు ఇలా.. ఈ పర్యటన చార్జీ ఇద్దరికి కలిపి బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.29,000 చొప్పున, ముగ్గురికి కలిపి బుక్ చేసుకుంటే రూ. 27,563 చొప్పున ఉంటుంది. -
ముగిసిన శీతాకాల విడిది.. ఢిల్లీకి బయల్దేరిన ప్రణబ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శీతాకాల విడిది ముగించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ప్రణబ్ రాష్ట్రపతి నిలయం నుంచి బయలుదేరి హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి ఎయిర్‌బేస్‌లో గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అధికారులు, మంత్రులు హకీంపేటకు చేరుకుని ఘనంగా ఆయనకు వీడ్కోలు పలికారు. వీరిలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన మనమడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు పలువురు ప్రజాప్రతినిధులున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు ప్రణబ్ హైదరాబాద్ నగర పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. 10 రోజుల పర్యటనలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి గౌరవార్థం మెన్న సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేయగా, నిన్న బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ తేనీటి విందును ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయుత మహాచండీయాగంలో పాల్గొనేందుకు వెళ్లగా.. ఆ సమయంలో యాగశాలలో అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రణబ్ హెలికాప్టర్లో వెనుదిరిగిన విషయం విదితమే. -
రాష్ట్రపతిని కలిసిన గవర్నర్
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సోమవారం పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదన చారి, మాజీ రాజ్యసభ సభ్యుడు వై.శివాజీలు వేర్వేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రపతి శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు హైదరాబాద్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. -
రాష్ట్రపతి పర్యటనపై సీఎస్ సమీక్ష
హైదరాబాద్: శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నగరానికి రానున్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సచివాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన, భద్రత అంశాలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రపతి ఈ నెల 18 నుంచి 31 వరకు బొల్లారంలోని అతిథి గృహంలో బస చేయనున్నారు.