Wisden Leading Cricketer award
-
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టును ఏప్రిల్ 30న ప్రకటించారు. ఈ జట్టులో 15 మంది రెగ్యులర్ ఆటగాళ్లు, నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్స్ ఉన్నారు. రోహిత్ శర్మ ఈ జట్టుకు సారధిగా వ్యవహరించనుండగా.. హార్దిక్ అతనికి డిప్యూటీగా ఎంపికయ్యాడు. రెగ్యులర్ జట్టులో విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్లు ఉండగా.. శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. అందరూ ఊహించిన విధంగానే ఐపీఎల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్, శివమ్ దూబేలకు చోటు దక్కింది. యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చహల్, అర్షదీప్ సింగ్, సిరాజ్ మిగతా సభ్యులుగా ఎంపికయ్యారు.ఈ జట్టును ప్రకటించిన అనంతరం పలువురు ఆటగాళ్లకు అన్యాయం (19 మంది సభ్యుల జట్టులో చోటు దక్కక పోవడంపై) జరిగిందని సోషల్‌మీడియా గగ్గోలు పెట్టింది. మాజీలు, విశ్లేషకులు రింకూ సింగ్, కేఎల్ రాహుల్, రుతురాజ్, రియాన్ పరాగ్, నటరాజన్, రవి భిష్ణోయ్ లాంటి ఆటగాళ్లను పక్కకు పెట్టడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. రింకూ సింగ్ విషయంలో కొందరు మాజీలు ఏకంగా సెలక్టర్లనే తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెట్ గైడ్ విజ్డన్ ప్రపంచకప్‌కు ఎంపిక కాని అర్హులైన ఆటగాళ్లతో ఓ జట్టును ఎంపిక చేసింది.ఈ జట్టుకు కేఎల్ రాహుల్ సారధిగా ఎంపికయ్యాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆయా ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా మిగతా జట్టు సభ్యుల ఎంపిక జరిగింది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, అభిషేక్ శర్మ, వన్‌డౌన్‌లో రుతురాజ్ గైక్వాడ్, నాలుగో స్థానంలో రియాన్ పరాగ్, ఐదో ప్లేస్‌లో తిలక్ వర్మ, ఆరో స్థానంలో శశాంక్ సింగ్, ఆల్‌రౌండర్ కోటాలో విశాఖ చిన్నోడు నితీశ్ కుమార్ రెడ్డి, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.. పేసర్లుగా హర్షిత్ రాణా, నటరాజన్ ఎంపికయ్యాడు. ఈ జట్టుకు విజ్డన్ భారత-బి జట్టుగా నామకరణం చేసింది. -
సూర్య, హర్మన్‌ల ఖాతాలో ప్రతిష్టాత్మక అవార్డు
టీమిండియా టి20 స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రతిష్టాత్మక విజ్డెన్ క్రికెటర్ అవార్డును గెలుచుకున్నారు. గతేడాది టి20 క్రికెట్లో సూపర్ ప్రదర్శనతో అదగొట్టినందుకు గాను సూర్యకుమార్ విజ్డన్ అల్మానిక్ లీడింగ్ టి20 క్రికెటర్ ఇన్ వరల్డ్ అవార్డు గెలుచుకోగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. తద్వారా విజ్డన్ అవార్డు గెలిచిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. 2022 ఏడాదిలో సూర్యకుమార్ టి20 క్రికెట్లో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. 2022 ఏడాదిలో 187.43 స్ట్రైక్‌రేట్‌తో సూర్య 1164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉండగా.. 68 సిక్సర్లు బాదాడు. సూర్య బ్యాటింగ్ మాయాజాలంతో టీమిండియా 40 మ్యాచ్‌ల్లో 28 మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఇక నాటింగ్హమ్ వేదికగా జరిగిన టి20 మ్యాచ్‌లో 55 బంతుల్లోనే 117 పరుగులు చేసిన సూర్యకు టి20ల్లో తొలి శతకం. ఇక హర్మన్‌ప్రీత్ గతేడాది కెప్టెన్‌గానే గాక బ్యాటర్‌గానూ అదరగొట్టింది. వన్డేల్లో 754 పరుగులు, టి20ల్లో 524 పరుగులు సాధించింది. ఇంగ్లండ్‌పై వన్డే మ్యాచ్‌లో 143 పరుగులు నాటౌట్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో కెరీర్ బెస్ట్ నమోదు చేసింది. ఇక కెప్టెన్‌గా కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఇక మరిన్ని అవార్డుల విషయానికి వస్తే.. గతేడాది టెస్టుల్లో టాప్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో ఔట్‌స్టాండింగ్ టెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకోగా.. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వరుసగా మూడోసారి లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. గతేడాది బెన్ స్టోక్స్ నాయకత్వంలో 10 టెస్టుల్లో తొమ్మిదింటిలో గెలవడం విశేషం. అలాగే 2022 టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఇక ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ వరల్డ్ టాప్ వుమెన్స్ క్రికెటర్ అవార్డును రెండోసారి కొల్లగొట్టింది. -
టీమిండియా కెప్టెన్‌కు అరుదైన గౌరవం
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విస్డెన్ అత్యుత్తమ వన్డే క్రికెటర్ ఆఫ్ ది డికేడ్(2010) అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో ఐసీసీ ప్రకటించిన మేల్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది డికేడ్‌గా ఎంపికైన కోహ్లికి మరో అత్యుత్తమ గౌరవం లభించింది. 2011 వన్డే ప్రపంచకప్‌తో దశాబ్దాన్ని ప్రారంభించిన కోహ్లి.. దశాబ్ద కాల వ్యవధిలో 60కిపైగా సగటుతో 11000కుపైగా పరుగులు సాధించాడు. ఇందులో 42 శతకాలు ఉన్నాయి. 2011 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో ఓ శతకం మరో అర్ధశతకం సాయంతో 282 పరుగులు సాధించిన కోహ్లి.. భారత్‌ను రెండోసారి జగజ్జేతగా నిలపడంలో తనవంతు పాత్రను పోషించాడు. రెండేళ్ల అనంతరం 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా విరాట్ అద్భుతంగా రాణించి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ టోర్నీ ఫైనల్లో టాప్ స్కోరర్‌గా నిలిచిన అతను భారత కీర్తిపతాకను మరోసారి రెపరెపలాడించాడు. 2010 దశాబ్దంలో జరిగిన 5 ఐసీసీ టోర్నీల్లో కోహ్లి అద్భుతంగా రాణించడంతో టీమిండియా ప్రతి టోర్నీలో కనీసం సెమీస్ వరకు చేరుకోగలిగింది. కాగా, కోహ్లి తన ఓవరాల్ వన్డే కెరీర్లో 254 మ్యాచ్‌ల్లో 59.7 సగటుతో 12169 పరుగులు సాధించాడు. ఇందులో 43 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక మహిళల విభాగంలో ఆసీస్ క్రికెటర్ బెత్ మూనీ విస్డెన్ ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డు గెలుచుకుంది. కాగా, విస్డెన్ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు జట్టును కూడా ప్రకటించింది. ఆ జట్టుకు కోహ్లినే నాయకుడిగా ఎంపిక చేసింది. విస్డెన్ దశాబ్దపు ఉత్తమ టెస్ట్ జట్టు: అలిస్టర్ కుక్(ఇంగ్లండ్), వార్నర్(ఆస్ట్రేలియా), కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్), కోహ్లి(కెప్టెన్), స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా), సంగక్కర(శ్రీలంక), బెన్ స్టోక్స్(ఇంగ్లండ్), అశ్విన్(భారత్), స్టెయిన్(దక్షిణాఫ్రికా), బ్రాడ్(ఇంగ్లండ్), ఆండర్సన్(ఇంగ్లండ్) చదవండి: విలియమ్సన్‌ను ఆడించకపోవడంపై ఎస్ఆర్హెచ్ క్లారిటీ -
విజ్డెన్ ‘లీడింగ్ క్రికెటర్’గా కోహ్లి
న్యూఢిల్లీ : భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి విఖ్యాత క్రికెట్ మ్యాగజైన్ ‘విజ్డెన్’ లీడింగ్ క్రికెటర్ అవార్డుకు మరోసారి ఎంపికయ్యాడు. విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక కావడం కోహ్లికిది వరుసగా మూడోసారి. గత క్యాలెండర్ ఇయర్లో ఓ ఆటగాడి ప్రదర్శన ఆధారంగా ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్‌కు ఈ పురస్కారమిస్తారు. గతేడాది విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి 2,735 పరుగులు చేశాడు. ప్రధానంగా ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లి 593 టెస్టు పరుగులు సాధించాడు. మరొకవైపు 2018లో ఐదు టెస్టు సెంచరీలు నమోదు చేశాడు. దాంతో కోహ్లిని విజ్డెన్’ లీడింగ్ క్రికెటర్ అవార్డుకు ఎంపిక చేశారు. 2018 సీజన్ కు గాను ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా కోహ్లితో పాటు జోస్ బట్లర్, స్యామ్ కరన్, రోరీ బర్న్స్, టామీ బీమౌంట్ (ఇంగ్లండ్ మహిళా క్రికెటర్)లు ఎంపికయ్యారు. -
విజ్డెన్ ‘లీడింగ్ క్రికెటర్’గా కోహ్లి
న్యూఢిల్లీ: భారత సంచలన క్రికెటర్ విరాట్ కోహ్లి విఖ్యాత క్రికెట్ మ్యాగజైన్ ‘విజ్డెన్’ లీడింగ్ క్రికెటర్ అవార్డుకు ఎంపికయ్యాడు. గత క్యాలెండర్ ఇయర్ (2016)లో ఓ ఆటగాడి ప్రదర్శన ఆధారంగా ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్‌కు ఈ పురస్కారమి స్తారు. గతేడాది కోహ్లి టెస్టుల్లో 75.93 సగటుతో 1,215 పరుగులు, పది వన్డేల్లో 92.37 సగటుతో 739 పరుగులు, టి20ల్లో 106.83 సగటుతో 641 పరుగులు చేశాడు. ఇప్పటివరకు కేవలం ఆరుగురు బ్యాట్స్‌మెన్ ఒక క్యాలెండర్ ఇయర్లో కోహ్లి కంటే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ అతని సగటును ఏ ఒక్కరూ చేరుకోలేదని ‘విజ్డెన్’ మ్యాగజైన్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది విజ్డెన్ మ్యాగజైన్ విరాట్ కోహ్లి కవర్‌పేజీతో విడుదలైంది. 2003లో విజ్డెన్ లీడింగ్ క్రికెటర్‌ను ఎంపిక చేయడం మొదలుపెట్టగా రికీ పాంటింగ్ (ఆసీస్)కు తొలి పురస్కారం దక్కిం ది. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడు కోహ్లి. సెహ్వాగ్ (2008, 2009), సచిన్ (2010) అతనికంటే ముందు ఈ జాబితాలో ఉన్నా రు. విజ్డెన్ ఎడిటర్ లారెన్స్ మాట్లాడుతూ ‘సచిన్‌కు సరైన వారసుడు విరాట్ కోహ్లి’ అని కితాబిచ్చారు. ఇటీవల బీసీసీఐ వార్షిక అవార్డుల్లో 28 ఏళ్ల ఈ భారత కెప్టెన్‌కు ‘పాలీ ఉమ్రిగర్ అవార్డు’ దక్కిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్’గా మిస్బా ఉల్ హక్, యూనిస్ ఖాన్ (పాకిస్తాన్), బెన్ డకెట్, టాబీ రొలాండ్ జోన్స్, క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్) ఎంపికయ్యారు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఎలిస్ పెర్రీ ‘లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కించుకుంది.