న్యూఢిల్లీ : భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి విఖ్యాత క్రికెట్ మ్యాగజైన్ ‘విజ్డెన్’ లీడింగ్ క్రికెటర్ అవార్డుకు మరోసారి ఎంపికయ్యాడు. విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక కావడం కోహ్లికిది వరుసగా మూడోసారి. గత క్యాలెండర్ ఇయర్‌లో ఓ ఆటగాడి ప్రదర్శన ఆధారంగా ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్‌కు ఈ పురస్కారమిస్తారు. గతేడాది విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి 2,735 పరుగులు చేశాడు. ప్రధానంగా ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లి 593 టెస్టు పరుగులు సాధించాడు.
మరొకవైపు 2018లో ఐదు టెస్టు సెంచరీలు నమోదు చేశాడు. దాంతో కోహ్లిని విజ్డెన్’ లీడింగ్ క్రికెటర్ అవార్డుకు ఎంపిక చేశారు. 2018 సీజన్ కు గాను ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా కోహ్లితో పాటు జోస్ బట్లర్, స్యామ్ కరన్, రోరీ బర్న్స్, టామీ బీమౌంట్ (ఇంగ్లండ్ మహిళా క్రికెటర్)లు ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment