Wistron
-
‘చైనాకి యాపిల్ మరో భారీ షాక్!’
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఐఫోన్ల తయారీ కోసం డ్రాగన్ కంట్రీపై ఆధారపడడం ఏమాత్రం ఇష్టం లేని యాపిల్ భారత్‌లో మరో ఐఫోన్ తయారీ కేంద్రాన్ని నిర్మించనుంది. ఈ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను టాటా గ్రూప్ నెలకొల్పనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో కర్ణాటక కేంద్రంగా భారత్‌లో ఐఫోన్లను తయారు చేసే విస్ట్రాన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను టాటా గ్రూప్ 125 మిలియన్ భారీ మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేసింది. అయితే, బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం.. తమిళనాడు హోసుర్ కేంద్రంగా టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా రెండో ఐఫోన్ తయారీ యూనిట్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నారని తెలిపింది. ఈ ఫ్యాక్టరీలో టాటా గ్రూప్ కనీసం 20 లైన్లో ఐఫోన్లను తయారు చేసేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుందని, తద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశం కలుగుందని బ్లూంబెర్గ్ నివేదికలో పేర్కొంది. ఇక ఈ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ 12 నెలల నుంచి 18 నెలల లోపల అందుబాటులోకి రానుందని అంచనా. చైనాకు భారీ షాక్ టెక్ దిగ్గజం యాపిల్ చైనాపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఫలితంగా చైనా కాకుండా మిగిలిన దేశాలైన భారత్, థాయిలాండ్, మలేషియాలలో ఐఫోన్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు స్థానిక కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా భారత్‌కు చెందిన టాటా కంపెనీ ఐఫోన్లు తయారు చేసుకునేలా ఒప్పందం కుదర్చుకుంది. ఇప్పటికే భారత్‌లోని కర్ణాటక కేంద్రంగా ఐఫోన్లను మ్యానిఫ్యాక్చరింగ్ చేస్తున్న విస్ట్రాన్ కార్పొరేషన్‌ను టాటా కొనుగోలు చేసేలా పావులు కదిపింది. ఈ తరుణంలో విస్ట్రాన్ కాకుండా.. టాటానే సొంతంగా ఐఫోన్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించేలా యాపిల్.. టాటా గ్రూప్‌ను ప్రొత్సహించింది. ఆ చర్చలు చివరి దశకు రావడం.. దేశీయంగా టాటా మరో ఐఫోన్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయని బ్లూమ్‌బర్గ్ నివేదిక హైలెట్ చేసింది. చదవండి👉 యూపీఐ చెల్లింపుల్లో మార్పులు..ఆర్బీఐ కీలక నిర్ణయం! -
టాటా చేతికి విస్ట్రన్.. ఇక ‘ఐఫోన్ మేడిన్ టాటా’
భారత్‌లో యాపిల్ ఐఫోన్లను సరఫరా చేసే విస్ట్రన్ కంపెనీని ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ పూర్తి స్థాయిలో టేకోవర్ చేసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో యాపిల్ ఐఫోన్లను తయారు చేసే తొలి దేశీయ కంపెనీగా టాటా గ్రూప్ అవతరించనుంది. టాటా గ్రూప్ ఇప్పటికే తమిళనాడు కేంద్రంగా విడి భాగాలను తయారు చేసి వాటిని యాపిల్‌కు అందిస్తుంది. అయితే ఇప్పుడు విస్ట్రన్ టేకోవర్‌తో పాక్స్కాన్, పెగాట్రాన్ తరహాలో టాటా సంస్థ ఐఫోన్లను తయారు చేస్తుంది. విస్ట్రన్ ఇండియాలో 100 శాతం షేర్ల కొనుగోలు ఒప్పందంపై టాటా గ్రూప్ సంతకం చేసినట్లు కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో యాపిల్ ఐఫోన్ల అసెంబ్లింగ్ కాంట్రాక్ట్ పొందేందుకు విస్ట్రన్ ఇండియాకు సుమారు రూ.1040 కోట్లు టాటా గ్రూప్ చెల్లించనున్నది. -
తుది దశలో టాటా-విస్ట్రాన్ డీల్
న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్‌కు చెందిన కర్ణాటక ప్లాంటును టాటా గ్రూప్ కొనుగోలు చేసే అంశం తుది దశలో ఉన్నట్లు సమాచారం. అనుబంధ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా టాటా గ్రూప్ ఈ డీల్‌ను కుదుర్చుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ పూర్తయితే యాపిల్ ఐఫోన్లను తయారు చేసే తొలి భారతీయ సంస్థగా టాటా నిలవనుంది. అలాగే, ఈ ప్లాంటులో ఐఫోన్లతో పాటు ఇతరత్రా కొత్త యాపిల్ ఉత్పత్తులను కూడా అసెంబుల్ చేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రస్తుతం తైవాన్‌కు చెందిన విస్ట్రాన్‌తో పాటు ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ వంటి సంస్థలు యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. -
150 ఏళ్ల చరిత్రలో.. తొలి ఐఫోన్ తయారీ సంస్థగా టాటా గ్రూప్!
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ యాపిల్ ఐఫోన్ల సప్లయి తయారీ సంస్థ విస్ట్రాన్ కొనుగోలు కోసం చేస్తున్న ప్రయత్నాలు చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే నెల ఆగస్ట్‌లో టాటా గ్రూప్ - విస్ట్రాన్‌ల మధ్య కొనుగోలు ఒప్పందం పూర్తవ్వనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే జరిగితే భారత కంపెనీ ఐఫోన్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి అవుతుంది. కర్ణాటక కేంద్రంగా విస్ట్రాన్ సంస్థ ఐఫోన్లను తయారు చేసి యాపిల్ సంస్థకు అందిస్తుంది. ఈ సంస్థ విలువ రూ.4942 కోట్లు. ఇందులో 10వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో ఫాక్స్‌కాన్ ఐఫోన్ 14 మోడళ్లను తయారు చేసింది. టాటా చేతుల్లోకి వచ్చేది అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు, ఇతర ప్రోత్సహాకాలు పొందాలంటే నిబంధనల ప్రకారం.. విస్ట్రాన్ వచ్చే ఏడాది మార్చి వరకు ఐఫోన్లను తయారు చేయాల్సి ఉంది. ఆ గడువు ముగిసిన వెంటనే విస్ట్రాన్ తయారీ ప్లాంట్‌ను టాటా గ్రూప్‌కు అప్పగించనున్నట్లు సమాచారం. ఒప్పందం, తయారీ ఇతర అంశాలపై టాటా గ్రూప్, విస్ట్రాన్‌లు ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. కార్పొరేట్ ప్రపంచంలో 155 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్ ఉప్పు నుంచి టెక్నాలజీ సర్వీసుల వరకు అన్నింటిని విక్రయిస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ సంస్థ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ, ఈ-కామర్స్ రంగంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. విస్ట్రాన్‌తో ఒప్పందం పూర్తయితే కార్పొరేట్ చరిత్రలో టాటా గ్రూప్ అనే పేరు సువర్ణక్షరాలతో లికించపడుతుంది. చదవండి👉 ‘దయ చేసి నమ్మకండి.. అవన్నీ అవాస్తవాలే’! -
భారత్‌లో ఐఫోన్ల తయారీ నిలిపివేత..వ్యాపారంలో లాభాలు లేక సతమతం?
భారత్‌లో ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాభాల్ని గడించే విషయంలో విస్ట్రాన్ అసంతృప్తిగా ఉంది. కాబట్టే వచ్చే ఏడాది నాటికి దేశీయంగా మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లలో ఐఫోన్ల తయారీని దశల వారీగా నిలిపి వేయనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ అంశంపై విస్ట్రాన్ యాజమాన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. విస్ట్రాన్ భారత్‌లో అనుకున్నంత స్థాయిలో దీర్ఘకాలిక లాభాల్ని గడించడంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేలా వియాత్నం, మెక్సికో వంటి దేశాల్లో లాభదాయకమైన టెక్నాలజీ తయారీ సంబంధిత ప్రొడక్ట్‌లపై దృష్టి సారించినట్లు సమాచారం. ఐఫోన్‌తో జరిపిన చర్చలు విఫలం ఇక, ఐఫోన్ల తయారీ నిలిపివేతపై విస్ట్రాన్ ఎగ్జిక్యూటీవ్‌లు కీలక వ్యాఖ్యలు చేశారంటూ రిపోర్ట్లు పేర్కొన్నాయి. భారత్‌లో యాపిల్ చేస్తున్న బిజినెస్‌లో ప్రాఫిట్స్ రావడం లేదని, ఎక్కువ లాభాలు వచ్చేలా యాపిల్ సంస్థతో జరిపిన చర్చలు విఫలమైనట్లు హైలెట్ చేశాయి. అయితే అంతర్జాతీయ తయారీ సంస్థలైన ఫాక్స్‌కాన్, పెగాట్రాన్స్ స్థాయిలో విస్ట్రాన్ ఆదాయాన్ని అర్జించడంలో ఇబ్బందులు పడుతుందని సమాచారం. చదవండి👉 ఐఫోన్ 14పై స్టీవ్ జాబ్స్ కూతురు.. ఇది కూడా ఎగతాళేనా? విస్ట్రాన్ భారత్‌లో యాపిల్ కోసం ఐఫోన్ ఎస్ఈలను తయారు చేయడమే కాదు..ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అంటే ఐఫోన్ల తయారీ, స్టోరేజ్ నిర్వహణ, అమ్మకాలు జరుపుతుంది. అయినప్పటికీ ఫ్రాఫిట్స్ పొందే విషయంలో ఇబ్బందులు పడుతుంది. వ్యాపారాన్ని మరింత విస్తరించలేకపోతుంది. వేధిస్తున్న అట్రిషన్ రేటు ఇంకా, కర్ణాటకలోని కోలార్ జిల్లా, అచ్చటనహళ్లి గ్రామ పారిశ్రామక వాడలో ఉన్న విస్ట్రాన్ తయారీ యూనిట్లో ఉద్యోగులు స్థిరంగా ఉండటం లేదు. అధిక వేతనం కోసం ఇతర సంస్థల్లో చేరుతున్న సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉంది. నివేదిక ప్రకారం.. చైనా - భారత్‌ల మధ్య వర్క్ కల్చర్ విషయంలో కంపెనీ అనేక సవాళ్లు విస్ట్రాన్ ఐఫోన్ తయారీ నిలిపివేయడానికి దోహదపడ్డాయి. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించకపోవడంతో అట్రిషన్ రేట్ పెరిగేందుకు దారి తీసింది. ఐఫోన్ 15 తయారు చేయనున్న టాటా! సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా, విస్ట్రాన్ తన ఐఫోన్ల తయారీని టాటా గ్రూప్‌కు విక్రయిస్తోంది. ట్రెండ్ ఫోర్స్ రిపోర్ట్ సైతం టాటా గ్రూప్ భారత్‌లో విడుదల కానున్న ఐఫోన్ 15 మోడళ్లను తయారు చేసేందుకు ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. చివరిగా.. 2008లో పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సర్వర్లతో సహా ఇతర సేవల్ని అందించేలా విస్ట్రాన్ భారతీయ మార్కెట్లో అడుగు పెట్టింది. 2017లో, కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించి యాపిల్ కోసం ఐఫోన్లను తయారు చేయడం ప్రారంభించింది. చదవండి👉‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ వైరల్