withdraw from contest
-
అతని కోసమే చేశా..!
సాక్షి, కరీంనగర్ అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డికి తన మద్దతు ఇచ్చేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నట్లు కల్లెం ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లోని ప్రెస్‌భవన్‌లో గు రువారం విలేకరులతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసి, ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణలోని ప్రజాసమస్యలు, రైతు, నిరుద్యోగ, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై జీవన్‌రెడ్డికి పూర్తిగా అవగాహన ఉందన్నారు. ప్రజాసమస్యలను మండలిలో ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు. రైతులకు సాగునీరు, వనరులపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగిన జీవన్‌రెడ్డిని పట్టభద్రు ల ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ లీగల్‌సెల్ అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, రిటైర్డు డీఈవో అక్రముల్లాఖాన్, టీపీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ఆకుల ప్రకాశ్, టీపీసీసీ అధికార ప్రతినిధి గుగ్గిళ్ల జయశ్రీ, ఆర్గనైజింగ్ కార్యదర్శి చాడగొండ బుచ్చిరెడ్డి, కార్పొరేటర్లు ఉమాపతి, సరిళ్ల ప్రసాద్, దేవ శిల్పవేదం పాల్గొన్నారు. -
'ఆప్'సోపాలు!
ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్, బిజెపిల రాజకీయాలను సవాలు చేస్తానని తొడకొట్టి ముందుకొచ్చిన ఆప్ ఇప్పుడు ఆపసోపాలు పడుతోంది. పార్టీ ఏరి కోరి టికెట్ ఇచ్చిన నలుగురు క్యాండిడేట్లు చడీ చప్పుడూ లేకుండా పోలీ నుంచి తప్పుకున్నారు. వీరిలో ముగ్గురు రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ కి చెందిన వారు. ఒకరు రాజస్థాన్ కి చెందిన వారు. ఉత్తరప్రదేశ్ లోని ఎటా, ఆగ్రా, ఫరుఖాబాద్, రాజస్థాన్ లోని అజ్మీర్ లోని ఆప్ అభ్యర్థులు పోటీనుంచి తప్పుకున్నారు. ఫరూఖాబాద్ లో కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పై పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి ముకుల్ త్రిపాఠీ పార్టీ నాకు సాయం చేయడం లేదని ఆరోపిస్తూ వైదొలిగారు. ఎటా నుంచి దిలీప్ యాదవ్, ఆగ్రా నుంచి రవీందర్ సింగ్, అజ్మీర్ నుంచి అజయ్ సోమానీలు కూడా ఇవే కారణాలు చెబుతూ పక్కకు తప్పుకున్నారు. వీరంతా పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారని, ఆవినీతి నిర్మూలనే ప్రధానాంశంగా తెరమీదికి వచ్చిన ఆప్ నిండా అవినీతే ఉందని ఆరోపించారు. మరో వైపు మురాదాబాద్ నుంచి పోటీకి దిగిన ఖాలిద్ పర్వేజ్, అవధ్ కి చెందిన అరుణా సింగ్ లకు ముందు టికెట్లు ఇచ్చి, తరువాత వారు అవినీతి పరులని తేలడంతో ఆప్ నాలిక కరుచుకుంది. వారిద్దరి టికెట్లు రద్దు చేసింది. మొత్తం మీద 'ఆప్' సోపాలు కొనసాగుతున్నాయి.