woman chief justice
-
జమ్మూకశ్మీర్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి..
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ హైకోర్టు చరిత్రలో మొట్టమొదటిసారి ప్రధాన న్యాయమూర్తిగా ఓ మహిళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమార్తిగా ఉన్న జస్టిస్ గీతా మిట్టల్‌ను జమ్మూకశ్మీర్ ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వురు జారీ అయ్యాయి. ఆమెతో పాటు మరో ఇద్దరు జడ్జీలు జమ్మూకశ్మీర్ హైకోర్టులో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఢిల్లీ యూనివర్శిటీలో న్యాయవిద్యను పూర్తి చేసుకున్న గీత మిట్టల్ 1981 నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆమె 2004 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు అడిషనల్ జడ్జీగా నియమితులయ్యారు. గత సంవత్సరం ఢీల్లీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి పదవీ విరమణ చేసిన తర్వాత గీత మిట్టల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఢీల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోర్టు పనితీరులో మార్పులు తీసుకువచ్చారు. ఆమె చేసిన న్యాయ సేవలకుగానూ ‘ నారీ శక్తి పురష్కార్’’ ను అందుకున్నారు. -
నేపాల్‌కు తొలి మహిళా చీఫ్ జస్టిస్
కాఠ్మాండు: నేపాల్‌కు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సుశీలా కర్కి నియమితులయ్యారు. ఆమె మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటికే నేపాల్ కు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొలి మహిళగా విద్యాదేవి, పార్లమెంటులో తొలి మహిళా స్పీకర్‌గా ఒన్సారి ఘర్తిలు పదవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. మూడు నెలలుగా సుశీల తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. పార్లమెంటరీ ప్రత్యేక కమిటీ ఆమె నియామకాన్ని ఆమెదించడంతో సోమవారం పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ఆమె బెనారస్ హిందూ వర్సిటలో రాజకీయ శాస్త్రం చదువుకున్నారు.