
నేపాల్‌కు తొలి మహిళా చీఫ్ జస్టిస్
కాఠ్మాండు: నేపాల్‌కు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సుశీలా కర్కి నియమితులయ్యారు. ఆమె మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటికే నేపాల్ కు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొలి మహిళగా విద్యాదేవి, పార్లమెంటులో తొలి మహిళా స్పీకర్‌గా ఒన్సారి ఘర్తిలు పదవుల్లో ఉన్న సంగతి తెలిసిందే.
మూడు నెలలుగా సుశీల తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. పార్లమెంటరీ ప్రత్యేక కమిటీ ఆమె నియామకాన్ని ఆమెదించడంతో సోమవారం పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ఆమె బెనారస్ హిందూ వర్సిటలో రాజకీయ శాస్త్రం చదువుకున్నారు.