breaking news
Sushila Karki
-
నేపాల్ ప్రధాని సుశీల కర్కీ తొలి కేబినెట్ భేటీ
-
నేపాల్ తాత్కాలిక ప్రధాని కర్కీ సంచలన ప్రకటన
ఖాట్మాండ్: నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కర్కీ ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, ప్రధాని సుశీలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళనల్లో భాగంగా ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా.. నేపాల్‌లో నిరసనలు, ఆందోళనల వేళ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఘటనపై దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు. తాను అధికారాన్ని అనుభవించేందుకు రాలేదని తెలిపారు. ఆరు నెలలకు మించి ఈ పదవిలో ఉండబోమని, ఆ తర్వాత కొత్త పార్లమెంట్‌కు బాధ్యతలను అందిస్తామని చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికే బాధ్యతలు చేపట్టాం. దేశ పునర్నిర్మాణానికి ప్రజలందరి సహకారం అవసరమని, వారి మద్దతు లేకుండా తాము విజయం సాధించలేమని అన్నారు. ఇక, ఈరోజు తాత్కాలిక ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది.Kathmandu: Days after taking charge as the interim Nepal Prime Minister, Sushila Karki says, "Those involved in the incident of vandalism will be investigated.'' she said, "My team and I are not here to taste the power. We won't stay for more than 6 months. We will hand over… pic.twitter.com/dg1WhdniyJ— The Truth India (@thetruthin) September 14, 2025ఇదే సమయంలో ప్రధాని కీలక ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా ‘అమరవీరులు’గా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. ఇది ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నారు. అధికారం కోసం కాకుండా దేశాన్ని తిరిగి గాడిన పెట్టడానికే తాము వచ్చినట్టు వెల్లడించారు. దీంతో, ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నేపాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. -
జస్టిస్ సుశీల కర్కీకే పీఠం
కఠ్మాండు: కల్లోల నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి ఎవరన్నదానిపై ఉత్కంఠకు తెరపడింది. రాజకీయ అనిశ్చితి ముగిసింది. నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కీ(73)ని పదవి వరించింది. తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ఆమె శుక్రవారం రాత్రి ప్రమాణ స్వీకా రం చేశారు. హిమాలయ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రెసిడెంట్ ఆఫీసు లో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపాధ్యక్షుడు రామ్‌సహాయ్ యాదవ్, సుప్రీంకోర్టు ప్ర ధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్‌మన్‌సింగ్ రావత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన తాత్కాలిక ప్రభుత్వం ఆరు నెలల్లోగా పార్లమెంట్ ఎన్నిక లు నిర్వహిస్తుందని రామచంద్ర పౌడెల్ చెప్పారు. నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడం, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయడం తెలిసిందే. తాత్కాలిక ప్రధానమంత్రి ఎంపికపై జెన్ జెడ్ ప్రతినిధులతో జరిగిన చర్చలు శుక్రవారం కొలిక్కి వచ్చాయి. జస్టిస్ సుశీల కర్కీకి జెన్ జెడ్ మద్దతు లభించింది. ఎక్కువ మంది ఆమె వైపే మొగ్గు చూపారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్, జెన్ జెడ్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో జస్టిస్ సుశీల ఎంపికకు ఆమోదముద్ర వేశారు. దాదాపు ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలసింది. నేపాల్ సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె ఇప్పటికే రికార్డుకెక్కారు. తాత్కాలిక ప్రధానమంత్రి హోదాలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. నేపాల్ పార్లమెంట్‌ను రద్దు చేయాల్సిందిగా తొలి కేబినెట్ సమావేశంలో అధ్యక్షుడికి సిఫార్సు చేయనున్నారు. ఈ మేరకు జెన్ జెడ్ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఒప్పందం కుదిరింది. దేశంలో అవినీతి అరికట్టాలని యువత ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి.. జస్టిస్ సుశీల 1952 జూన్ 7న తూర్పు నేపాల్‌లోని బిరాట్‌నగర్‌లో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఈ ప్రాంతం ఇండియా సరిహద్దులోనే ఉంది. ఆమెకు భారత్‌తో ఎంతో అనుబంధం ఉంది. 50 ఏళ్ల క్రితం భారత్‌లోని బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. పొలిటికల్ సైన్స్‌లో పీజీ పూర్తిచేశారు. అనంతరం నేపాల్‌లో న్యాయ విద్య అభ్యసించి, న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. 2016 జూలైలో నేపాల్ సుప్రీంకోర్టులో 24వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 11 నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు. జస్టిస్ సుశీల తల్లిదండ్రులకు మొత్తం ఏడుగురు సంతానం కాగా, అందరికంటే ఆమె పెద్ద. ప్రముఖ నేపాలీ కాంగ్రెస్ నాయకుడు దుర్గాప్రసాద్ సుబేదీని జస్టిస్ సుశీల పెళ్లిచేసుకున్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలోనే వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. జస్టిస్ సుశీల పలు పుస్తకాలు రచించారు. భారతీయ మహిళ సహా 51 మంది మృతి నేపాల్‌లో జరుగుతున్న హింసాకాండలో మృతుల సంఖ్య 51కి చేరింది. వీరిలో ఒక భారతీయ మహిళ, ముగ్గురు పోలీసులు సైతం ఉన్నట్లు పోలీసులు శుక్రవారం ప్రకటించారు. 36 మృతదేహాలకు శుక్రవారం త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్లో పోస్టుమార్టం ప్రారంభించారు. నేపాల్‌లో జరిగిన హింసాకాండలో మరణించిన భారతీయ మహిళను రాజేశ్‌దేవి(55)గా గుర్తించారు. ఆమె స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్. ఆమె బస చేసిన కఠ్మాండు హోటల్‌కు మంగళవారం ఆంందోళనకారులు నిప్పుపెట్టారు. బయటపడేందుకు ప్రయతి్నస్తూ ఆమె మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. రాజేశ్‌దేవి భర్త రామ్‌వీర్‌సింగ్ సైనీ హోటల్ కిటికీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. నేపాల్‌లో గత వారం రోజుల్లో ఘర్షణల్లో మృతిచెందినవారిలో 19 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 1,700 మంది గాయపడ్డారు. హింసాకాండ శుక్రవారం తగ్గుముఖం పట్టింది. ఆందోళనకారులు శాంతించారు. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. -
సారథిపై జెన్ జెడ్‌లో విభేదాలు
కాఠ్మండు: ఉవ్వెత్తున ఎగసిన విద్యార్థుల ఆగ్రహం ధాటికి నేపాల్ ప్రభుత్వం కుప్పకూలగా సుస్థిర పాలన అందించే సారథి ఎంపికలో జెన్‌జెడ్ విద్యార్థి సంఘం తర్జనభర్జనలు పడుతోంది. ఈలోపు జెన్ జెడ్ విద్యార్ధుల్లో బేధాభిప్రాయాలు పొడచూపాయి. కొందరు విద్యుత్ బోర్డ్ మాజీ సీఈఓ కుల్మాన్ ఘీసింగ్ వైపు మొగ్గుచూపారు. మరికొందరు మాత్రం నేపాల్ మాజీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన మహిళా న్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కీ మాత్రమే సమర్థపాలన అందించగలరని వాదించారు. ఈ వాదనల నడుమే ఉమ్మడిగా జన్‌జెడ్ విద్యార్థి బృందం దేశాధ్యక్షుడు రామచంద్ర పౌదెల్, ఆర్మీ చీఫ్ అశోక్‌రాజ్ సిగ్దెల్‌తో భద్రకాళీ ప్రాంతంలోని సైనిక ప్రధాన కార్యాలయంలో గురువారం సుదీర్ఘ మంతనాలు జరిపారు. అయితే ఎవరిని తాత్కాలిక ప్రధానమంత్రిగా చేయాలనే అంశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో జెన్‌జెడ్, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉమ్మడి ప్రకటన వెలువడలేదు. మరోదఫా చర్చలు జరిపే అవకాశం ఉంది. ‘‘ప్రస్తుత అనిశ్చితికి చరమగీతం పాడే అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణ అంశం సైతం చర్చకొచ్చింది’’అని నేపాల్ సైన్యం అధికార ప్రతినిధి తెలిపారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టాలని తనను ఎవరూ ఇంతవరకు కోరలేదని జస్టిస్ సుశీల తెలిపారని ఆమె సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. అంతకుముందు ఆమెనే ప్రధాని పదవి చేపట్టాలని ఆన్లైన్లో వేలాది మంది పోల్‌లో ఓటేశారు. అయితే నేపాల్ రాజ్యాంగ నియమాల ప్రకారం మాజీ న్యాయమూర్తులు ప్రధానమంత్రి వంటి కీలక పదవులు చేపట్టేందుకు అనర్హులు. మరోవైపు కాఠ్మండు నగర మేయర్, జనాల్లో అమితమైన ఆదరణ చూరగొన్న బాలేంద్ర షా రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అసలు ఆయనకు ప్రధాని వంటి అత్యున్నత పదవులు చేపట్టే ఆలోచన లేదని తెలుస్తోంది. జస్టిస్ సుశీలకు బాలేంద్ర మద్దతు పలకడం విశేషం. ‘‘తొలుత మేం బాలేంద్ర షా వైపు మొగ్గుచూపాం. ఆయన అందుకు సంసిద్ధంగా లేరని సమాచారం వచ్చింది. దాంతో మేం జస్టిస్ సుశీలను ఎంపికచేయాలని భావించాం. అయితే జడ్జీల ఎంపిక కుదరదని, అందుకే రాజ్యాంగం ఒప్పుకోదని తేలింది. ఇక ధారన్ మున్సిపాలిటీ మేయర్ హార్క్ సంపంగ్ను ప్రధాన అభ్యరి్థగా ఆశించాం. కానీ ఆయనకు పెద్దగా ఎవరూ మద్దతు ప్రకటించలేదు. దీంతో విద్యుత్ అథారిటీ సంస్థ మాజీ సీఈఓ కుల్మాన్ ఘీసింగ్ ఇందుకు తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నాం’’అని జెన్‌జెడ్ ఒక ప్రకటన విడుదలచేసింది. అయితే సుశీల నాయకత్వం మాకు సమ్మతమే అని ‘వీ నేపాలీ గ్రూప్’సారథి, ఉద్యమకారుడు సుదన్ గురుంగ్ ప్రకటించారు. ఆర్మీ కార్యాలయం ఎదుట బాహాబాహీ ఓవైపు జెన్‌జెడ్ కీలక నేతలు ఆర్మీ ప్రధాన కార్యాలయంలో దేశాధ్యక్షుడు, ఆర్మీ చీఫ్‌లతో మంతనాలు జరుపుతుంటే బయట జెన్ జెడ్ విద్యార్థులు ఘర్షణలకు దిగారు. సుశీల సమర్థురాలు అని కొందరు, ఘీసింగ్ గొప్ప వ్యక్తి అంటూ మరికొందరు వాదనలకు దిగారు. తర్వాత వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో జెన్ జెడ్ వర్గంలో విబేధాలు బట్టబయలయ్యాయి. ‘‘సుశీల కేసులనైతే గొప్పగా తీర్చుచెప్పగలిగారేమోగానీ పరిపాలన అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయినా ఆమె 70 ఏళ్ల వృద్దురాలు. ఈ వయసులో ఆమె క్రియాశీలక పాత్ర పోషించడం చాలా కష్టం’’అనికొందరు వాదించారు. మరికొందరు ఘీసింగ్‌కు మద్దతు పలికారు. ‘‘రోజుకు 18 గంటలపాటు విద్యుత్కోతలుండేవి. ఎలక్ట్రిసిటీ అథారిటీ బోర్డ్ సీఈఓగా ఘీసింగ్ సమర్థవంతంగా పనిచేశారు. దశాబ్దాలుగా పట్టిపీడించిన విద్యుత్ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించారు’’అని మరికొందరు వాదించారు. దీంతో ఇరువర్గాల మధ్య నడిరోడ్డు మీద గొడవ మొదలైంది. అధికారంపై ఆర్మీ ఆసక్తి! అధికారంపై ఆర్మీ ఆసక్తి కనబరుస్తున్నట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. జెన్‌జెడ్ ప్రతినిధి బృందంతో అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్ చర్చలు జరుపుతున్నప్పుడే వివాదాస్పద వ్యాపారవేత్త దుర్గా ప్రసాయ్ వచ్చారు. దేశంలోని రాజరిక పాలన మళ్లీ తేవాలని ఆయన గట్టిగా విశ్వసిస్తారు. ఈయనతోపాటో రాష్రీ్టయ స్వతంత్ర పారీ్ట(ఆర్ఎస్పీ)ని సైతం ఈ చర్చల్లో భాగస్వాములుగా చేర్చుకుంటే సమస్యను త్వరగా పరిష్కరించవచ్చని ఆర్మీ చీఫ్ అశోక్ వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం. తమ కనుసన్నల్లో ఆపద్ధర్మ ప్రభుత్వ ఏర్పాటు జరగాలనే ఉద్దేశ్యంతోనే వ్యాపారి, రాజకీయ పారీ్టలను ఇందులోని ఆర్మీ లాగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యలో దుర్గా ప్రసాయ్ జోక్యాన్ని సహించని జెన్ జెడ్ విద్యార్థులు వెను వెంటనే చర్చలను అర్ధంతరంగా ఆపేసి బయటకు వచ్చేశారని తెలుస్తోంది. ‘‘మాతో చర్చలకు పిలిచి మధ్యలో దుర్గా ప్రసాయ్, ఆర్ఎస్పీలను కలుపుకుని పొండి అని ఆర్మీ చీఫ్ చెప్పడం ఏమాత్రం సబబుగా లేదు. విద్యార్థి ఉద్యమాన్ని తక్కువచేసి చూపిస్తున్నారు’’అని విద్యార్థి నేత రక్షా బామ్ తర్వాత మీడియాతో అన్నారు. చర్చలు ఎటూ తేలకపోవడంతో ఆర్మీ చీఫ్ చైనాలో తన వారంరోజుల పర్యటనను తప్పనిపరిస్థితుల్లో రద్దుచేసుకున్నారు. -
వెరవని వ్యక్తిత్వం
సంక్షుభిత సమయంలో ఒక జాతి తమను నడిపే నేతగా ఒక స్త్రీ వైపు చూడటం అరుదు. నేపాల్‌లో ఇప్పుడు అక్కడి యువత అలాంటి ఒక స్త్రీ వైపు చూస్తోంది. అక్కడ ఏర్పడబోతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ఉంటే బాగుంటుందని ఆశిస్తోంది. ఆమె ఆర్మీ చీఫ్‌ను కలిశారు కూడా! భారతదేశంలో చదువుకుని, టీచర్ స్థాయి నుంచి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి వరకూ ఎదిగిన సుశీలా కర్కీది వెరవని వ్యక్తిత్వం. ఆమె రచయిత కూడా. వివరాలు...‘ఇండియా– నేపాల్ దేశాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు. దశాబ్దాలది. ప్రభుత్వాలు వాటి వాటి విధానాల వల్ల పని చేస్తుండొచ్చు. కాని ఇరుదేశాల ప్రజలు ఏనాటి నుంచో స్నేహంగా ఉన్నారు. ప్రధాని మోదీపై నాకు మంచి అభి్రపాయం ఉంది. మా స్నేహితులు, బంధువులు ఎందరో ఇండియాలో ఉన్నారు. మావారు ఎక్కువ కాలం ఇండియాలోనే గడిపారు. భారతీయులు నేపాలీలను ఆదరిస్తూనే ఉన్నారు’ అన్నారు సుశీలా కర్కి.73 ఏళ్ల ఈ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేపాల్‌లో ఏర్పడనున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఖరారయ్యాయి. నేపాల్‌లో ఉద్యమం కొనసాగిస్తున్న జెన్ జి విద్యార్థుల బృందం తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుశీలా కర్కి మా ఎంపిక అని తేల్చి చెప్పింది. సుశీలా కర్కి తన సోషల్ మీడియా అకౌంట్లో ‘దేశ పరిస్థితుల రీత్యా నాకు అప్పజెప్పే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని తెలియచేశారు.‘నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాను. మా హాస్టల్ నుంచి నిత్యం పారే గంగను చూసే దాన్ని. ఎండాకాలం హాస్టల్ టెర్రస్ మీద పడుకునేవారం. ఉదయాన్నే గంగను చూసేవారం. అక్కడ నాతో పాటు చదువుకున్న విద్యార్థులు, పాఠాలు చెప్పిన గురువులు ఇంకా స్పష్టంగా గుర్తున్నారు’ అన్నారామె. ‘మా ఊరు విరాట్‌నగర్ నుంచి భారత్ సరిహద్దు 25 మైళ్లు ఉంటుంది. మేము తరచూ బోర్డర్ మార్కెట్‌కు వెళ్లేవాళ్లం. నాకు హిందీ వచ్చు’ అని తెలిపారామె.ప్రభుత్వంలో అవినీతి, మంత్రుల పట్ల వ్యతిరేకత, నయా సంపన్నుల వైఖరి, సోషల్ మీడియాపై నిర్బంధం... వీటన్నింటి దరిమిలా నేపాల్‌లో యువతరం తెచ్చిన తిరుగుబాటు వల్ల నాయకత్వ మార్పు స్పష్టమైంది. సుశీలా కర్కి ఆపద్ధర్మ ప్రధాని అయితే త్వరలో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటు చేయించి తప్పుకోవడమే ఆమె ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతకు ఆమె సమర్థురాలని యువత భావిస్తోంది.టీచర్‌గా మొదలైసుశీలా కర్కి నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించిన ఏకైక మహిళగా ఆ దేశవాసుల్లో గుర్తింపు, గౌరవం పొందారు. జూన్ 7, 1952న నేపాల్‌లోని శంకర్‌పూర్‌కు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన కర్కి ఏడుగురు పిల్లలలో మొదటి సంతానం. 1972లో బిరాట్నగర్లోని మహేంద్ర మొరాంగ్ క్యాంపస్ నుండి బీఏ డిగ్రీ చేసి మన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రం చదివారు. అక్కడ చదువుతున్న సమయంలోనే నేపాలీ కాంగ్రెస్ సభ్యుడు, యువజన విభాగ నాయకుడు దుర్గా ప్రసాద్ సుబేదిని కలుసుకున్నారు. అనంతరం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 1979లో కార్కి బిరాట్‌నగర్‌లో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1985లో ధరణ్‌లోని మహేంద్ర మల్టిపుల్ క్యాంపస్‌లో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేశారు. 2007లో సీనియర్ అడ్వకేట్‌గా 2009లో ఆ దేశ సుప్రీంకోర్టులో అడ్–హాక్ జస్టిస్‌గా నియమితులయ్యారు. నవంబర్ 18, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఏప్రిల్ నుండి 2016 జూలై వరకు నేపాల్ సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2017 జూన్ వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.రచయితగా...కర్కి 2018లో ‘న్యాయ’ పేరుతో తన ఆత్మకథ రాశారు. 2019 డిసెంబర్లో ‘కారా’ అనే నవల ప్రచురించారు. నేపాల్‌లో 1960 నుంచి 90ల మధ్యకాలంలో రాజు కనుసన్నల్లో సాగిన ‘పంచాయత్’ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజల అనుభవాలను ఆమె తన రచనల్లో ఉటంకించారు. ఆపద్ధర్మ అధినేతగా తన ఎంపిక జరిగితే శాంతి నెలకొల్పడం, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు భరోసా ఇవ్వడం తన తొలి ప్రాధాన్యం అని ఆమె అన్నారు.సుశీలా కర్కిది వెరవని వ్యక్తిత్వం అని అందరూ అంటారు. ఆమె న్యాయనిపుణత, అవినీతి రహిత నేపథ్యం చాలా కేసుల్లో కీలకమైన తీర్పులు ఇచ్చేలా చేసింది. ఒక అవినీతి కేసులో మంత్రిని జైలుకు పంపించడానికి సైతం ఆమె వెనుకాడలేదు. ఇవన్నీ ఆమెకు సానుకూలంగా మారాయని చర్చ సాగుతోంది. ఆ పేరు బయటకు వచ్చాక నేపాల్‌లో ముఖ్యంగా ఖాట్మండులో శాంతి నెలకొనడం ఆమె మాటకు విలువ ఉంటుందనడానికి ఉదాహరణ.గమనిక: ఈ కథనం రాసే సమయానికి సుశీలా కర్కితోపాటు మరికొన్ని పేర్లు కూడా ఆపద్ధర్మ ప్రధాని పదవికి పరిశీలనలోకి వచ్చాయి. -
నేపాల్ లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు
-
నేపాల్ ప్రధానిగా సుశీల?
కాఠ్మండు: కల్లోల నేపాల్‌లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువతరం ఆరంభించిన పోరాటం నేపాల్ ప్రధానమంత్రి కేపీ వర్మ ఓలీ రాజీనామాకు దారితీసింది. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ‘జనరేషన్ జెడ్’ఆన్లైన్లో సంప్రదింపులు ప్రారంభించింది. యువత తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కీని తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించాలని చాలామంది సూచిస్తున్నారు. యువతలో ఆమెపట్ల అమితమైన ఆదరణ కనిపిస్తోంది. తాజాగా జరిగిన వర్చువల్ సమావేశంలో 5 వేల మందికిపైగా పాల్గొన్నారు. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా జస్టిస్ సుశీల కర్కీని నియమించాలన్న ప్రతిపాదనకు ఎక్కువమంది ఓటేశారు. తొలుత కాఠ్మండు నగర మేయర్ బాలెన్ షా పేరు వినిపించింది. అయనను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అందుబాటులోకి రాలేదని జనరేషన్ జెడ్ ప్రతినిధులు చెప్పారు. మరోవైపు కర్కీకి మద్దతు రోజురోజుకీ పెరుగుతోంది. మద్దతుగా 2,500 మంది సంతకాలు మధ్యంతర ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలంటూ సుశీల కర్కీని యువత అభ్యర్థించగా.. తనకు మద్దతుగా కనీసం వెయ్యి సంతకాలు సేకరించి, చూపించాలని ఆమె కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు అనుకూలంగా సంతకాలు చేసినవారి సంఖ్య 2,500కు చేరినట్లు సమాచారం. మరోవైపు పోటీలో సుశీల కర్కీ ముందంజలో ఉన్నప్పటికీ మరికొన్ని పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చీఫ్ కుల్మాన్ ఘీసింగ్, యువనేత సాగర్ ధాకల్, ధరణ్ సిటీ మేయర్ హర్కా సంపంగ్ పేర్లపైనా చర్చ సాగుతోంది. నేపాల్‌లోని ప్రముఖ యూట్యూబర్ రందోమ్ నేపాలీ పేరు కూడా వినిపిస్తోంది. అయితే, మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపించడానికి ఎవరూ మందుకు రాకపోతే తాను ఆలోచిస్తానని ఆయన పేర్కొన్నారు. సుశీల కర్కీ నియామకానికి పెద్ద తతంగమే ఉంటుందని సమాచారం. ఆమె తొలుత నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ను, అనంతరం అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌ను కలుసుకొని మద్దతు పొందాల్సి ఉంటుందని నిపుణులు చెప్పారు.ఎవరీ జస్టిస్ సుశీల? నేపాల్ చరిత్రలో 72 ఏళ్ల సుశీల కర్కీకి ప్రత్యేక స్థానమే ఉంది. సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డుకెక్కారు. భారత్‌లోని బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. 1975లో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. సుశీల కర్కీ మొదట టీచర్‌గా పనిచేశారు. 1978లో కాఠ్మండులోని త్రిభువన్ యూనివర్సిటీలో న్యాయ విద్యలో బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యసించారు. 2016లో నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని రాజ్యాంగ మండలి సిపార్సు మేరకు అప్పటి అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ఆమెను చీఫ్ జస్టిస్‌గా నియమించారు. సుశీల కర్కీ అవినీతికి దూరంగా ఉంటారని, ఎవరికీ భయపడబోరని పేరుంది. అవినీతికి పాల్పడిన మంత్రులను జైలుకు పంపిస్తూ కీలక తీర్పులిచ్చారు. 2006లో నేపాల్ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా సేవలందించారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో చదుకున్నప్పటి రోజులను సుశీల ఇటీవలే గుర్తుచేసుకున్నారు. అక్కడ డ్యాన్స్ నేర్చుకొనే అవకాశం దక్కిందని చెప్పారు. ఆ యూనివర్సిటీలోనే తనకు ఉద్యోగం వచి్చందని, అక్కడే పీహెచ్డీ పూర్తిచేసే అవకాశం వచ్చిందని అన్నారు. కానీ, విధిరాత మరోలా ఉండడంతో న్యాయమూర్తిగా మారానని తెలిపారు.మోదీజీ కో నమస్కార్ నేపాల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీక రించడానికి తాను సిద్ధంగా ఉన్నానని జస్టిస్ సుశీల చెప్పారు. ఆమె బుధవారం ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మధ్యంతర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలంటూ యువత చేసిన విజ్ఞప్తిని స్వీకరిస్తున్నానని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామని నేపాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. నూతన ప్రారంభానికి శ్రీకారం చుడదామని అన్నారు. భారత్–నేపాల్ మధ్య దశాబ్దాలుగా బలమైన సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్ అంటే తమకు ఎంతో గౌరవం, ప్రేమ అని స్పష్టంచేశారు. తమ దేశానికి భారత్ వివిధ సందర్భాల్లో ఎంతగానో సాయం అందించిందని చెప్పారు. భారతదేశ పాలకులు, నాయకులతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి నమస్కారాలు తెలియజేస్తున్నానని జస్టిస్ సుశీల కర్కీ వ్యాఖ్యానించారు. మోదీజీ అంటే తనకు గౌరవ ప్రప త్తులు, ఆరాధనభావం ఉన్నట్లు వివరించారు. -
నేపాల్ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన సుశీల కర్కి
-
నేపాల్‌కు తొలి మహిళా చీఫ్ జస్టిస్
కాఠ్మాండు: నేపాల్‌కు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సుశీలా కర్కి నియమితులయ్యారు. ఆమె మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటికే నేపాల్ కు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొలి మహిళగా విద్యాదేవి, పార్లమెంటులో తొలి మహిళా స్పీకర్‌గా ఒన్సారి ఘర్తిలు పదవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. మూడు నెలలుగా సుశీల తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. పార్లమెంటరీ ప్రత్యేక కమిటీ ఆమె నియామకాన్ని ఆమెదించడంతో సోమవారం పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ఆమె బెనారస్ హిందూ వర్సిటలో రాజకీయ శాస్త్రం చదువుకున్నారు.