woman cricket
-
డాటర్ ఆట చూసి అమ్మ అంపైరయింది
తల్లి నుంచి స్ఫూర్తి పోందే పిల్లలే కాదు పిల్లల నుంచి స్ఫూర్తి పోందే తల్లులు కూడా ఉంటారని చెప్పడానికి బలమైన ఉదాహరణ... సలీమా ఇంతియాజ్. కూతురి క్రీడానైపుణ్యాన్ని చూసి... ‘ఆడితే ఇలా ఆడాలి’ అనుకునేది. ఆటలో కూతురి కష్టాన్ని చూసి ‘కష్టపడితే ఇలా పడాలి’ అనుకునేది. క్రికెట్లో కూతురు పాకిస్థాన్ తరపున ప్రాతినిధ్యంవహించినప్పుడు... అంతర్జాతీయ స్థాయిలో తాను కూడా ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్నది. నమ్మకమైన, గౌరవప్రదమైన అంపైర్‌గా పేరు తెచ్చుకున్న సలీమా ఇంతియాజ్ ‘ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ డెవలప్మెంట్ అంపైర్స్’ కు నామినేట్ అయిన తొలి పాకిస్తానీ మహిళగా చరిత్ర సృష్టించింది.సలీమా కెరీర్‌కు సంబంధించి 2022 కీలక సంవత్సరం. బంగ్లాదేశ్‌లో జరిగిన మహిళల ఆసియా కప్ కోసం మహిళా అంపైర్ల ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) నిర్ణయించింది. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సలీమా అరంగేట్రం చేసింది. ఈ మ్యాచ్‌తో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించింది.2008లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్( పీసీబీ) మహిళా అంపైర్ల ప్యానెల్లో చేరిన సలీమా, కుమార్తె కైనత్ ఇంతియాజ్ తనకు స్ఫూర్తి అంటుంది. పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కైనత్ కామెంటేటర్‌గా కూడా పని చేసింది.‘చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేదాన్ని. క్రికెట్లో పాకిస్థాన్కుప్రాతినిధ్యం వహించాలనేది నా కల. నా కూతురు కైనత్ వల్ల నా కల నెరవేరింది. ఆమె నా కూతురు మాత్రమే కాదు. నా స్నేహితురాలు. ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఎంతో స్ఫూర్తి పోందాను’ అని కైనత్ గురించి మురిపెంగా చెబుతుంది సలీమా. 2010లో క్రికెట్లో అరంగేట్రం చేసింది కైనత్.‘అమ్మను చూస్తే గర్వంగా అనిపిస్తుంది. క్రికెట్ గ్రౌండ్లో కనిపించాలనేది అమ్మ కల. అంపైరింగ్ ద్వారా తన కలను నెరవేర్చుకుంది. క్రికెట్ పట్ల ఆమె అభిరుచి, అంకితభావం అంటే నాకు ఇష్టం. ఈ విషయంలో నేను అమ్మలా ఉండాలనుకుంటున్నాను’ అంటుంది కైనత్. సలీమా, ఆమె భర్త స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్లు కావడంతో ఇంట్లో ఎప్పుడూ క్రికెట్ గురించి చర్చలు జరిగేవి.స్థానిక క్రికెట్ టోర్నమెంట్లలో తల్లి అంపైర్‌గా వ్యవహరించిన మ్యాచ్‌లలో కైనత్ ఆడింది.‘అంపైర్ అంటే ఇలా ఉండాలి’ అని ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశంసలను ఎన్నోసార్లు విన్నది.తాజా రికార్డ్ నేపథ్యంలో... ‘ఇది నా విజయం మాత్రమే కాదు. పాకిస్థాన్‌లోని ప్రతి ఔత్సాహిక మహిళా క్రికెటర్, అంపైర్ల విజయం. నా విజయం క్రికెట్లో తమదైన ముద్ర వేయాలని కలలు కనే అసంఖ్యాక మహిళలకు స్ఫూర్తి ఇస్తుందని ఆశిస్తున్నాను. నా ప్రయాణంలో కష్టాలు ఉన్నాయి. వ్యక్తిగత త్యాగాలు ఉన్నాయి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అవి ఎంతో విలువైనవి అనిపిస్తాయి’ అంటుంది సలీమ.‘తన రికార్డ్‌తో ఎన్నో అడ్డంకులను ఛేదించడమే కాకుండా తర్వాతి తరం మహిళా క్రికెట్ ప్రోఫెషనల్స్‌కు ఆమె స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తుంది’ అని సలీమా ఇంతియాజ్‌ను ప్రశంసించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్. -
IND Vs PAK: మనదే పైచేయి
దంబుల్లా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోరీ్నలో శుభారంభం చేసింది. పాకిస్తాన్‌పై తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ మరో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. సిద్రా అమీన్ (35 బంతుల్లో 25; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా... రేణుక, శ్రేయాంక పాటిల్, పూజ వస్త్రకర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 14.1 ఓవర్లలో 3 వికెట్లకు 109 పరుగులు చేసింది. స్మృతి మంధాన (31 బంతుల్లో 45; 9 ఫోర్లు), షఫాలీ వర్మ (29 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 57 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు. టపటపా... భారత మహిళల పదునైన బౌలింగ్ ముందు పాక్ ఏమాత్రం నిలవలేకపోయింది. పూజ తన తొలి రెండు ఓవర్లలో 2 వికెట్లు తీసి ప్రత్యరి్థని నిలువరించగా, పవర్‌ప్లే ముగిసేసరికి పాక్ 37 పరుగులు చేసింది. కెప్టెన్ నిదా దార్ (8) ప్రభావం చూపలేకపోగా, రేణుక వరుస బంతుల్లో రెండు వికెట్లతో పాక్‌ను దెబ్బ కొట్టింది. ఈ దశలో తుబా, ఫాతిమా పోరాడి 25 బంతుల్లో 35 పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్...రాధ ఓవర్లో ఫాతిమా రెండు సిక్స్‌లు బాదడంతో 100 పరుగులు దాటింది. 47 పరుగుల వ్యవధిలో పాక్ చివరి 6 వికెట్లు చేజార్చుకుంది. ఒకే ఓవర్లో 21 పరుగులు... ఛేదనలో భారత ఓపెనర్లు షఫాలీ, స్మృతి దూకుడుగా ఆడారు. వరుసగా మూడు ఓవర్లలో రెండేసి ఫోర్లు రాగా...తుబా ఓవర్లో స్మృతి రెండు ఫోర్లు, షఫాలీ ఒక సిక్స్ బాదారు. ఫలితంగా 6 ఓవర్లలోనే స్కోరు 57 పరుగులకు చేరింది. ఆ తర్వాత తుబా వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో స్మృతి చెలరేగింది. ఏకంగా ఐదు ఫోర్లు (4, 0, 4, 1 వైడ్, 4, 4, 4) బాదడంతో 21 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత 17 పరుగుల వ్యవధిలో స్మృతి, షఫాలీతో పాటు హేమలత (14) కూడా వెనుదిరిగినా...హర్మన్ (5 నాటౌట్), జెమీమా (3 నాటౌట్) కలిసి లాంఛనం పూర్తి చేశారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో నేపాల్ ఆరు వికెట్ల తేడాతో యూఏఈ జట్టుపై విజయం సాధించింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫేరోజా (సి) హర్మన్ (బి) పూజ 5; మునీబా (సి) రోడ్రిగ్స్ (బి) పూజ 11; సిద్రా (సి) రాధ (బి) రేణుక 25; ఆలియా (సి) రోడ్రిగ్స్ (బి) శ్రేయాంక 6; నిదా (సి) హేమలత (బి) దీప్తి 8; తుబా (సి) రాధ (బి) దీప్తి 22; ఇరమ్ (ఎల్బీ) (బి) రేణుక 0; ఫాతిమా (నాటౌట్) 22; అరూబ్ (రనౌట్) 2; నష్రా (సి) రిచా (బి) దీప్తి 0; సాదియా (బి) శ్రేయాంక 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 108. వికెట్ల పతనం: 1–9, 2–26, 3–41, 4–59, 5–61, 6–61, 7–92, 8–94, 9–94, 10–108. బౌలింగ్: రేణుక 4–0–14–2, పూజ 4–0–31–2, దీప్తి శర్మ 4–0–20–3, రాధ 4–0–26–0, శ్రేయాంక పాటిల్ 3.2–0–14–2. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (బి) అరూబ్ 40; స్మృతి (సి) ఆలియా (బి) అరూబ్ 45; హేమలత (సి) తుబా (బి) నష్రా 14; హర్మన్ (నాటౌట్) 5; జెమీమా (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (14.1 ఓవర్లలో 3 వికెట్లకు) 109. వికెట్ల పతనం: 1–85, 2–100, 3–102. బౌలింగ్: సాదియా 2.1–0–18–0, ఫాతిమా 2–0–15–0, నిదా 1–0–10–0, తుబా 2–0–36–0, నష్రా 4–0–20–1, అరూబ్ 3–0–9–2. -
సవాల్‌గా తీసుకుని ఈ సినిమా చేశాను: తాప్సీ
‘‘రెగ్యులర్ సినిమాల కన్నా బయోపిక్స్ కాస్త కష్టంగా, డిఫరెంట్‌గా ఉంటాయి. ఆల్రెడీ ఒక వ్యక్తి యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఆ పాత్ర పోషించడం అనేది ఇంకా కష్టం. నా కెరీర్లో చేసిన అత్యంత కష్టమైన పాత్రల్లో ‘శభాష్ మిథు’లో చేసిన పాత్ర ఒకటి’’ అన్నారు తాప్సీ. భారత మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘శభాష్ మిథు’. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో తాప్సీ టైటిల్ రోల్ చేశారు. వయాకామ్ 18 సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో తాప్సీ మాట్లాడుతూ – ‘‘నాకు క్రికెట్ గురించి అంతగా తెలియదు. బ్యాట్ పట్టుకోవడం కూడా రాదు. చిన్నతనంలో ‘రేస్’, ‘బాస్కెట్‌బాల్’ వంటి ఆటలు ఆడాను కానీ క్రికెట్ ఆడలేదు. అందుకే ‘శభాష్ మిథు’ సినిమా ప్రాక్టీస్‌లో చిన్నప్పుడు క్రికెట్ ఎందుకు ఆడలేదా? అని మాత్రం ఫీలయ్యాను. ‘శభాష్ మిథు’ సినిమా క్రికెట్ గురించి మాత్రమే కాదు.. మిథాలీ రాజ్ జీవితం కూడా. అందుకే ఓ సవాల్‌గా తీసుకుని ఈ సినిమా చేశాను. మిథాలి జర్నీ నచ్చి ఓకే చెప్పాను. ట్రెండ్‌ను బ్రేక్ చేయాలనుకునే యాక్టర్‌ని నేను. సమంతతో కలిసి వర్క్ చేయనున్నాను. ఈ ప్రాజెక్ట్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను’’ అని అన్నారు. ‘‘కవర్ డ్రైవ్‌ను తాప్సీ నాలాగే ఆడుతుంది. మహిళా క్రికెట్లో నేను రికార్డులు సాధించానని నా టీమ్ నాతో చెప్పారు. అయితే ఆ రికార్డ్స్ గురించి నాకు అంత పెద్దగా తెలియదు. కెరీర్లో మైల్‌స్టోన్స్ ఉన్నప్పుడు అవి హ్యాపీ మూమెంట్స్ అవుతాయి. కీర్తి, డబ్బు కోసం నేను క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకోలేదు. ఇండియాకు ఆడాలనే ఓ తపనతోనే హార్డ్‌వర్క్ చేశాను. నాపై ఏ ఒత్తిడి లేదు. నా ఇష్ట ప్రకారంగానే రిటైర్మెంట్ ప్రకటించాను’’ అన్నారు మిథాలీ రాజ్. -
‘మహిళల క్రికెట్‌కు ఉజ్వల భవిష్యత్తు’
రానున్న కాలంలో మహిళల క్రికెట్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉండబోతోందని.. త్వరలోనే ఐపీఎల్ తరహా పోటీలను మహిళా క్రికెట్లో సైతం చూడవచ్చని భారత మహిళా క్రికెట్ జట్టు పూర్వపు క్రీడాకారిణి, ఆంధ్రా మహిళల సీనియర్ జట్టు కోచ్ డయానాడేవిడ్ పేర్కొన్నారు. కడప నగరంలో నవంబర్ 19 నుంచి నిర్వహిస్తున్న సీనియర్ మహిళల క్రికెట్ సన్నాహక శిబిరంలో ఆంధ్రా సీనియర్ మహిళలకు నైపుణ్యాలను, మెలకువులను నేర్పుతూ రంజీ మ్యాచ్‌లకు సన్నద్ధం చేస్తున్న ఆమెను సాక్షి పలుకరించగా పలు విషయాలను పంచుకుంది. – కడప స్పోర్ట్స్ భారత మహిళా క్రికెట్ జట్టుకు మీరందించిన సేవలు? భారత మహిళల క్రికెట్ జట్టుకు 2012 వరకు సేవలందించా. వన్డే మ్యాచ్‌లు, టీ–20 మొత్తం కలిపి 28 మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించా. అనంతరం 2015 వరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాను. హైదరాబాద్ జట్టు నుంచి ప్రాతినిథ్యం వహించా. దేశంలో మహిళా క్రికెట్ పరిస్థితి ఎలా ఉంది? ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఫైనల్‌కు భారత మహిళా జట్టు వెళ్లడంతో దేశప్రజల్లో మహిళల క్రికెట్ పట్ల సానుకూల ధోరణి ఏర్పడింది. రానున్న కాలంలో పురుషుల క్రికెట్‌తో సమానంగా మహిళల క్రికెట్ అభివృద్ధి సాధిస్తుంది. మహిళల క్రికెట్‌కు ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి? మహిళల క్రికెట్‌కు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చక్కటి ప్రోత్సాహం ఇస్తోంది. జోన్‌స్థాయిలో ఆడితే ఏడాదికి రూ.24 వేలు, రాష్ట్రస్థాయిలో ఆడితే రూ.48 వేల చొప్పున చెల్లిస్తోంది. దీనికి తోడు దేశంలోనే ప్రప్రథమంగా ఏసీఏ ఆధ్వర్యంలో మూలపాడులో మహిళల కోసం అకాడమీ ఏర్పాటు చేశారు. ఇది మహిళా క్రికెట్‌కు మేలు చేస్తుంది. ఆంధ్రా మహిళల జట్టు పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రా సీనియర్ మహిళల జట్టు చక్కటి కూర్పుతో ఉంది. సన్నాహక శిబిరం బాగా సాగుతోంది. ఈనెల 4 నుంచి హైదరాబాద్‌లో నిర్వహించే పోటీల్లో చక్కటి ప్రదర్శన చేస్తారని భావిస్తున్నాం. మహిళా క్రికెట్లోకి రావాలనుకునే క్రీడాకారిణులకుమీరిచ్చే సందేశం? గతంతో పోల్చితే మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరిగింది. దీంతో పాటు ఓ స్థాయి క్రికెట్ ఆడినా చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు సైతం లభిస్తుండడంతో క్రమేణా మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోంది. నిబద్ధత, అంకితభావంతో సాధన చేస్తే చక్కటి ఫలితాలు సాధించవచ్చు. -
సెమీస్‌కా? ఇంటికా?
-
'ఆకాశంలో సగం'.. పేరుకేనా ?!