woman dsp
-
పెళ్లి వాయిదా వేసుకున్న మహిళా డీఎస్పీ
మండ్య : కరోనా లాక్డౌన్ లక్షలాది మంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది. పెళ్లిళ్లు, పేరంటాలు అనేక శుభకార్యాలు అటకెక్కాయి. ఓ మహిళా డీఎస్పీ.. లాక్డౌన్ విధుల దృష్ట్యా తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు. మండ్య జిల్లాలోని మళవళ్ళి డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.జే. పృధ్వీ పెళ్లి ఈ నెల 4న జరగవలసి ఉంది. ద్యామప్ప అనే యువకునితో ఈ నెల 4, 5 వ తేదిల్లో ధార్వాడలో ఏడడుగులు నడవాల్సి ఉండేది. తరువాత ఏప్రిల్ 10వ తేదీన మైసూరులో ఘనంగా రిసెప్షన్‌కు అంతా సిద్ధమైంది. కానీ విధి మరోలా తలచింది. మండ్య, మైసూరు జిల్లాల్లో కరోనా కేసులు ఉవ్వెత్తున పెరగడం, విధుల ఒత్తిడి నేపథ్యంలో ఆమె జీవితంలో ఎంతో ప్రధానమైన శుభఘడియల్ని వాయిదా వేసుకోవడానికే మొగ్గుచూపారు. కానీ పెళ్లి వాయిదా విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పకుండా విధుల్లో ఉన్నారు. అయినప్పటికీ సంగతి తెలిసి సహచర అధికారులు ఆమె నిబద్ధతను అభినందించారు. ఎంపీ సుమలత అంబరీష్ సైతం కొనియాడారు. -
మంత్రిగారికి చుక్కలు చూపించిన మహిళ
-
మంత్రిగారికి చుక్కలు చూపించిన మహిళా అధికారి
చండీగడ్ : హర్యానా ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ అధ్యక్షతన జరిగిన గ్రీవియన్స్ అండ్ అంబాలా పబ్లిక్ రిలేషన్స్ కమిటీ సమావేశం రసాభాసగా మారడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఓ మహిళా పోలీసు అధికారిపై దురుసుగా ప్రవర్తించి ఆయన వివాదంలో ఇరుక్కున్నారు. అంబాలా జిల్లాలో జరిగిన పబ్లిక్ రిలేషన్స్ కమిటీ సమావేశం సందర్భంగా డీఎస్పీ సంగీతా కాలియాపై గెట్ అవుట్ అంటూ విరుచుకుపడ్డారు. అంతేకాకుండా డిప్యూటీ కమిషనర్ ఎన్కే సోలంకిపై అభ్యంతరకరమైన రీతిలో ఘర్షణకు దిగి తన ప్రకోపాన్ని ప్రదర్శించారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఫతేబాద్ గ్రీవియన్స్ అండ్ అంబాలా పబ్లిక్ రిలేషన్స్ కమిటీ సమావేశానికి మంత్రి అనిల్ విజ్ హాజరయ్యారు. తమ తమ ఫిర్యాదులతో వచ్చిన జనంతో అక్కడంతా కోలాహలంగా ఉంది. ఇంతలో అక్రమ మద్యం అమ్మకాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన డీఎస్పీ సంగీతా కాలియా... అక్రమ మద్యాన్ని నిరోధించడానికి తాము చేయాల్సిందంతా చేస్తున్నామన్నారు. గత పదినెల కాలంలో సుమారు 2500 కేసులు నమోదు చేశామని, ఇదొక రికార్డని సమాధానం ఇచ్చారు. అయితే ఆమె సమాధానంపై సంతృప్తి చెందని మంత్రి గారు విరుచుకుపడ్డారు. ఒకదశలో గెట్ అవుట్ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. అయినా మహిళా పోలీసు అధికారి.. మంత్రి ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. తానేమీ తప్పు చేయలేదని వాదించారు. దీంతో ఇద్దరి మధ్యా కాసేపు వాగ్వాదం చెలరేగింది. అయినా సంగీత ఎక్కడా వెనక్కి తగ్గలేదు. విధి నిర్వహణలో తాము సక్రమంగానే ఉన్నామంటూ స్పష్టం చేశారు. దీంతో అసహనానికి గురైన మంత్రి అనిల్ సహచరులు, కమిటీ సభ్యులు సహా సమావేశం నుంచి బైటికి వెళ్ళిపోయారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ మీటింగ్‌ను కొనసాగించారు. అయితే ఈ ఆరోపణలను మంత్రి అనిల్ విజ్ ఖండించారు. డిఎస్పీ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించిందనీ, అందుకే మంత్రిగా తాను అలా ప్రవర్తించాల్సి వచ్చిందంటూ తన వైఖరిని సమర్ధించుకున్నారు. సక్రమంగా పని చేయని ప్రభుత్వ అధికారులపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఫిర్యాదులు చేయడానికి వచ్చిన కొంతమంది సభ్యులను అడ్డుకుంటుంటే తాను వారించానంటూ వివరణ ఇచ్చారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రికి, డీజీపికి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు.