ర్యాంకు రాలేదనే ప్రాణం తీసుకుంది
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అబిడ్స్ ప్రాంతంలో కలకలం రేగింది. మంగళవారం ఉదయం మయూరి కాంప్లెక్స్ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. కాచిగూడకు చెందిన యువతి(18)గా పోలీసులు గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నీట్ పరీక్షలో అర్హత సాధించకపోవటంతో మనస్థాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. జెస్లీస్ భవనంలోని వెళ్లిన దృశ్యాలు, పై నుంచి దూకిన విజువల్స్ మీడియాకు చిక్కాయి. తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.