కోల్కతాలో యువతిపై గ్యాంగ్ రేప్
కోల్కతా: బెంగాల్ రాజధానిలో కోల్కతాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. క్యాబ్లోంచి యువతిని బయటకు లాగి ఈ ఘోరానికి పాల్పడ్డారు. బాబూఘాట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
లారీలో వచ్చిన ఐదుగురు యువకులు క్యాబ్లో వెళుతున్న యువతిని ఆటకాయించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను హౌరా సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. నేరం జరిగిన ప్రాంతం వాటగుంజి పోలీస్ స్టేషన్లో పరిధిలోకి వస్తుంది. రేపిస్టులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.