Woman rescued
-
ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను కాపాడిన ‘దిశ యాప్’
-
సముద్రంలో సజీవంగా..
-
రెండేళ్ల క్రితం తప్పిపోయి.. సముద్రంలో సజీవంగా
బొగోటా: కొలంబియాలో వింత సంఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం తప్పిపోయిన ఓ మహిళ సముద్రంలో సజీవంగా కనిపించిన వైనం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొలంబియా సముద్ర తీరంలో నీటిపై తేలుతున్న సదరు మహిళను బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మత్స్యకారులు రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పేరు ఎంజెలికా గైటన్. ఆమె రెండేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు వెల్లడించింది. గైటన్ ఆర్సీఎన్ రేడియోతో మాట్లాడుతూ... తాను మళ్లీ పుట్టానని, దేవుడు తన మరణాన్ని కోరుకోలేదంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఆమె దాదాపు ఎనిమిది గంటల పాటు నీటిపైనే తేలుతూ ఉన్నట్లు చెప్పింది. (చదవండి: 'ఒక్క పనితో మా మనసులు దోచేసింది') ‘20 సంవత్సరాలుగా నా భర్త చేతిలో గృహహింసకు గురయ్యాను. నా భర్త ఎప్పుడూ నన్ను చిత్రహింసలకు గురిచేసేవాడు. తీవ్రంగా కొట్టేవాడు. నాకు ఇద్దరు పిల్లలు. వారు చిన్న పిల్లలు కావడంతో అతని నుంచి విడిపోలేక హింసలను భరించాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలుమార్లు అతడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను. పోలీసులు ఒక్కరోజు అతడిని జైలులో ఉంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించే వారు. అయినా అతడు మారలేదు. పైగా పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు మరింత కొట్టేవాడు. ఈ క్రమంలో 2018లో నా భర్త నన్ను చంపాలని చుశాడు. నన్ను నేను కాపాడుకునేందుకు ఇంటి నుంచి పారిపాయాను. నాకు ఆశ్రయం లేకపోవడంలో 6 నెలలు వీధుల్లోనే గడిపాను ఆ తర్వాత నాకు కామినో డిఫే రెస్క్యూ సెంటర్లో ఆశ్రయం దొరికింది’ అని చెప్పింది. (చదవండి: ప్లీజ్ ఆ వీడియో తొలగించండి: అంకిత) అయితే అక్కడ ఉండటానికి గడువు పూర్తి కావడంతో నిరాశ్రయురాలిని అయ్యానని, దీంతో చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం కొలంబియా సముద్రంలో దూకినట్లు పేర్కొంది. సముద్రంలో దూకిన ఆనంతరం స్పృహ కోల్పోయానని ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తనకు గుర్తు లేదని పేర్కొంది. తనను రక్షించిన వ్యక్తులు నీటిలో అసస్మారక స్థితిలో ఉన్నానని చెప్పినట్లు గైటాన్ వివరిచింది. ఇక ఆమెను రక్షించిన మత్స్యకారులు మాట్లాడుతూ.. మేము తీరంలో చేపల వేటకు వెళుతుండగా దూరంగా ఆమె నీటిలో తెలుతూ కనిపించిందన్నారు. అది ఎంటన్నది తమకు స్పష్టంగా కనిపించకపోవడంతో చెక్క అయి ఉంటుందనుకున్నామన్నారు. కాసేపటకి ఆమె రక్షించాలంటూ చేయి పైకిత్తడంతో ఏంటో చూడటానికి దగ్గరికి వెళ్లామని, అక్కడికి వెళ్లి చూడగా గైటాన్ అపస్మారక స్థితిలో కనిపించిందని వారు చెప్పారు. (చదవండి: ఈ బుడ్డోడు సూపర్.. అస్థిపంజరంతో కలిసి) -
ఐదు రోజులుగా కొన ఊపిరితో శిథిలాల కింద..
కఠ్మాండు: నేపాల్లో సహాయక చర్యలకోసం తీవ్రంగా శ్రమిస్తోన్న సైనికుల ముఖాల్లో చిరునవ్వులు పూస్తున్నాయి. వారు మరింత వేగంగా పనిచేయాలన్న ఆలోచనలు వేగం పుంజుకుంటున్నాయి. అందుకు ప్రధాన కారణం.. మృత్యుదిబ్బలా మారిన కఠ్మాండులో శిథిలాల కింద నుంచి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నవారు కొద్ది కొద్దిగా బయటపడుతున్నారు. శరవేగంగా శిథిలాలు తొలగిస్తున్న గాంగ్బూ అనే గ్రామంలో దేవీ ఖాడ్కా (24) అనే మహిళ ప్రాణాలతో బయటపడింది. భూకంపం ధాటికి కుప్పకూలిన జనసేవా అనే అతిథి గృహ శిథిలాల కింద ఆమె పడిపోయింది. అయితే నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇజ్రాయెల్ సైన్యం కలసి అక్కడ శిథిలాలను తొలగించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆమెకు గాయాలు కూడా అయ్యాయి. గత ఏప్రిల్ 25న నేపాల్లో రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో భూకంపం సంభవించి 5,000మంది చనిపోగా.. 12,000మందికి పైగా గాయాలయ్యాయి.