woman thrashed
-
పూజారిపై ఉమ్మిన మహిళ.. జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన సిబ్బంది
సాక్షి, బెంగళూరు: మహిళపై ఆలయ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. బెంగళూరు గుడిలో నుంచి ఓ మహిళను బలవంతంగా బయటకు గెంటేశారు ఆలయ సిబ్బంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. డిసెంబర్ 21న జరిగిన ఈ ఘటనలో బాధితురాలు అమృతహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడిలో మహిళను కొట్టి జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లిన వీడియో ట్విటర్లో షేర్ చేయడంతో తాజాగా వైరల్‌గా మారింది. ఇందులో ఆలయం లోపల ఉన్న ఓ మహిళను ఆలయ సిబ్బంది బయటకు నెట్టేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె ప్రతిఘటించడంతో చెంపదెబ్బ కొట్టాడు. అయినా బయటకు వచ్చేందుకు నిరాకరించగా.. మహిళ మెడ పట్టుకొని లాక్కొచ్చాడు. జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చుకెళ్లాడు. అప్పటికీ మహిళ మొండిగా ప్రవర్తించడంతో ఆమెను కొట్టేందుకు ఐరాన్ రాడ్‌ను కూడా తీసుకొచ్చాడు. అయితే పూజారి అడ్డుకోవడంతో ఆమె బయటకు వెళ్లిపోయింది. కాగా మహిళ ఆలయ సిబ్బంది అంత దారుణంగా ప్రవర్తించడం వెనక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు గుడికి వెళ్లి వెంకటేశ్వరుని భార్యనని చెప్పుకుంటూ.. స్వామివారి విగ్రహం పక్కనే కూర్చోవాలని పట్టుబట్టింది. అందుకు పూజారి అనుమతించలేదు. దీంతో మహిళ పూజారిపై ఉమ్మింది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది మహిళను జుట్టు పట్టుకొని గుడి నుంచి బయటకు తోసేశారు. అయితే సదరు మహిళ మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద ఆలయ సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. చదవండి: సుప్రీంకోర్టు కీలక ఆదేశం, 50వేల మందికి ఊరట.. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు? -
వీళ్లు ఆడవాళ్లా లేక రౌడీలా?.. తప్పతాగి నడిరోడ్డులో యువతిపై దాడి
భోపాల్: తాగిన మత్తులో అర్ధరాత్రి నలుగురు మహిళలు నడిరోడ్డులో హల్చల్ చేశారు. మరో మహిళపై దాడి చేశారు. కాలితో తన్నుతూ, బెల్టుతో కొడుతూ చిత్రహింసలు పెట్టారు. చుట్టూ చాలా మంది ఉన్నా వారి దుశ్చర్యను ఎవరూ అడ్డుకోకపోగా.. వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. యువతిపై నలుగురు మహిళలు దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇండోర్‌లోని ఎల్ఐడీ జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. యువతి వెంట్రుకలు పట్టుకుని పిడిగుద్దులతో విరుచుకుపడటం, బెల్టుతో కొట్టటం, కిందపడేసి తన్నుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనపిస్తున్నాయి. ఎలాంటి కారణం లేకుండానే తనపై నలుగురు మహిళలు దాడి చేశారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు ఇండోర్‌లోని ఓ ఎరువుల దుకాణంలో సెల్స్పర్సన్గా పని చేస్తోందని, ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. WATCH - Indore: Video of 'drunk' girls beating another girl on road goes viral.#Indore #Fight https://t.co/HBnMtpAWWI pic.twitter.com/Lan7H8IW4i — Md fasahathullah siddiqui (@MdFasahathullah) November 7, 2022 ఇదీ చదవండి: మద్యం మత్తులో ఎమ్మెల్యే కొడుకు హంగామా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ -
నీళ్లు పట్టుకుందని... చితక్కొట్టారు!
వీధిపంపు వద్ద నీళ్లు పట్టుకుందని.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దళిత మహిళను పట్టుకుని చితక్కొట్టారు. ఈ దారుణ ఘటన షామ్లి జిల్లాలో జరిగింది. గంగేటు గ్రామానికి చెందిన రామో దేవి (55) అనే మహిళ వీధిపంపు వద్ద నీళ్లు పట్టుకోడానికి వెళ్లింది. అది చూసిన తెహసిన్ ఖురేషి, మొహిసిన్ అనే ఇద్దరు సోదరులు ఆమెను తీవ్రంగా అవమానించి, చితక్కొట్టారు. దాంతోపాటు ఆమెను కులం పేరుతో దూషించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు సోదరులిద్దరిపై ఐపీసీ సెక్షన్లు 323, 506లతో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. వారిలో తెహసిన్ను అరెస్టు చేయగా.. మొహిసిన్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.