Women and men
-
రెండు మృతదేహాలు: నడుముకు చున్ని, అనుమానాలెన్నో..
హొళగుంద: రెండు మృతదేహాలు.. యువతి, యువకుడు. ఇద్దరి నడుముకు చున్నీతో కట్టేసి ఉంది. 30 ఏళ్ల వయస్సులోపు వారు. ప్రేమికులా.. దంపతులా.. వివాహేతర సంబంధమా.. ఇలా ఎన్నో అనుమానాలు ఆ మృతదేహాల చుట్టూ తిరుగుతున్నాయి. శనివారం బాపురం సమీపంలో ఎల్లెల్సీలో తేలియాడిన మృతదేహాలను అక్కడ దుస్తులు ఉతుకుతున్న స్థానికులు గుర్తించి హాలహర్వి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చే లోపు ముందుకు కొట్టుకుపోయి కనిపించలేదు. అప్పటికే చీకటి పడటంతో గాలింపు నిలిపేశారు. ఆదివారం హొళగుంద పోలీసులు స్థానిక సమ్మతగేరి క్యాంపు వద్ద కొట్టుకొస్తున్న మృతదేహాలను గుర్తించి పంచాయతీ సిబ్బందితో వెలికి తీయించి అక్కడే పంచనామా నిర్వహించారు. కాలువలో పడి దాదాపు నాలుగైదు రోజులు కావడంతో మృతదేహాలు ఉబ్బి దుర్వాసన వస్తున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆలూరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆలూరు సీఐ భాస్కర్, ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. ఎన్నో అనుమానాలు.. ► మృతదేహాలపై ఉన్న వస్త్రాల ఆధారంగా మృతులది పట్టణ ప్రాంతంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ► జీన్స్ ప్యాంట్, టీ షర్ట్, చుడిదార్ ఉండటంతో కాల్వకు చుట్టు పక్కల పట్టణ ప్రాంతానికి (ఆలూరు, ఆదోని, బళ్లారి, మోకా) చెందిన వారై ఉంటారని తెలుస్తోంది. ► మృతదేహాలకు చున్నీ కట్టి ఉండటంతో కులాంతర వివాహం, లేదా వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరిని హత్య చేసిన తర్వాత మృతదేహాలను కట్టేసి కాల్వలో పడేశారా అని చర్చించుకుంటున్నారు. ► శవాలు రెండూ నీటిలో తేలియాడిన ప్రాంతానికి గూళ్యం దగ్గరలో ఉంది. ఈనెల 18న గూళ్యం జాతర జరిగింది. జాతరకు వేల మంది హాజరయ్యారు. ఆ నేపథ్యంలో వారిద్దరు ఇక్కడ కలుసుకుని, ఏదైనా కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారా? లేక వీరిని వెంబడించి చంపేశారా అనేది తెలియాల్సి ఉంది. చదవండి: మైనర్‌ను గర్భవతిని చేసి.. జైలుకు పంపుతారని -
'ఆడా- మగల వివాహం దైవనిర్ణయం'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో నిలిచినప్పటినుంచి అధికార పక్షంపై విమర్శలదాడిని పెంచిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ ఈసారి ఏకంగా ఆదేశ సుప్రీంకోర్టు తీర్పునే తప్పుబట్టారు. స్వలింగ వివాహాలకు చట్టపరమైన అనుమతినిస్తూ కోర్టు శుక్రవారం వెలువరించిన తీర్పు అనైతికమని విమర్శించారు. 'ఆడా- మగ మధ్య వివాహం జరగడం దైవనిర్ణయం. దానికి విరుద్ధంగా స్వలింగ వివాహాలను ప్రోత్సహించడం తప్పు. భూమి మీదున్న ఏ కోర్టులూ ఆ నియమాన్ని మార్చలేవు. అలా ప్రయత్నించడం దారుణం, ఆక్షేపనీయం. విలువలకు కట్టుబడి ఉండాలనుకునే వారికి సుప్రీంకోర్టు తాజా తీర్పు శరాఘాతం లాంటిదనడంలో ఎలాంటి సందేహంలేదు' అని జిందాల్ వ్యాఖ్యానించారు. ఓబామా కేర్ ను కోర్టులు ఆకాశానికెత్తడంపైగా అసహనం వ్యక్తం చేశారు. శనివారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయ సేకరణగానీ, రాష్ట్రాల ఆమోదంగానీ లేకుండా ఇంత కీలక నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు పూర్తిగా అదుపుతప్పిందని, జ్యుడీషియరీ సభ్యులు తమ సొంత నిర్ణయాలను ప్రజలపై రుద్దేప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మహిళలకు వేతనాలు తక్కువే!
* భారతీయ ఐటీ కంపెనీలపై రీసెర్చ్ సంస్థ నివేదిక * పురుషులతో పోలిస్తే వ్యత్యాసం పెరుగుతోందని వెల్లడి న్యూఢిల్లీ: భారతీయ ఐటీ పరిశ్రమ ఉద్యోగుల్లో మహిళలు, పురుషుల మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. వేతనాల పెంపు విషయంలో మహిళలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ వ్యాఖ్యానించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఉదంతం నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఆరంభంలో ఒకే స్థాయి వేతనాలతోనే మహిళ, పురుష ఉద్యోగులు తమ కెరీర్‌ను మొదలు పెడుతున్నప్పటికీ.. కొంతకాలానికి వేతనాల్లో వ్యత్యాసం ఎగబాకుతోందని కెటలిస్ట్ ఇండియా డబ్లూఆర్సీ అనే సంస్థ తన అధ్యయన నివేదికలో పేర్కొంది. మహిళలకు వేతనాలు తక్కువగా ఉంటున్నాయని తెలిపింది. కాగా, నాదెళ్లలాంటి దిగ్గజ వ్యక్తి ఇలా వ్యాఖ్యానించడం దురదృష్టకరమని.. అయితే, తన తప్పును వెంటనే అంగీకరించి ఆయన క్షమాపణ చెప్పడం గొప్పవిషయమని కెటలిస్ట్ ఇండియా డబ్ల్యూఆర్సీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ షాచి ఇర్డే పేర్కొన్నారు. సుమారు 58 దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు, ప్రొఫెషనల్ సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదికను రూపొందించింది. అన్నిరంగాల్లోనూ...: వ్యాపారం, ఆర్థిక రంగం, సామాజిక రంగం ఇలా మగాళ్లకు అవకాశాలున్న ప్రతిచోటా మహిళలకూ అవకాశాలు ఇవ్వాల్సిందేనని ఇర్డే అన్నారు. ఒక్క టెక్నాలజీ రంగంలోనే కాకుండా.. ఇతర పారిశ్రామిక రంగాల్లోనూ ఉద్యోగుల వేతనాల్లో స్త్రీ-పురుష వ్యత్యాసం స్పష్టంగా కనబడుతోందని కెటలిస్ట్ గ్లోబల్ రీసెర్చ్ పేర్కొంది. ‘భారత్ విషయానికొస్తే... టెక్నాలజీ రంగంలో మేం చేసిన అధ్యయనం ప్రకారం మహిళలు-పురుషులు ఇద్దరూ ఒకే విధమైన బాధ్యతలు, వేతనాలతో ఉద్యోగాల్లో చేరుతున్నారు. అయితే, కొంతకాలం గడిచేసరికి వేతనాల్లో తేడా భారీగా ఉంటోంది. దాదాపు 12 ఏళ్ల కెరీర్‌ను చూస్తే.. పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులకు సుమారు రూ.3.8 లక్షల మేర వేతన వ్యత్యాసం ఉంటోంది. ఈ తేడాను తొలగించేందుకు నాయకత్వపరమైన, పటిష్ట చర్యలు అవసరం’ అని ఇర్డే వ్యాఖ్యానించారు.