'యుద్ధ క్షేత్రంలో మహిళా బెటాలియన్లు పెంచం'
న్యూఢిల్లీ: భారత ఆర్మీ యుద్ధ క్షేత్రంలో ప్రత్యేక మహిళా బెటాలియన్లను పెంచే ఆలోచనేది తమకు ప్రస్తుతం లేదని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. మంగళవారం ఆయన ఈ మేరకు రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
'ప్రస్తుత భారత ఆర్మీలో మహిళా బలగాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ లేదు. అలాగే ఇండియన్ ఆర్మీలో పురుషులు, మహిళల మధ్య ఎలాంటి వివక్ష లేదు. పనిచేసే పరిస్థితుల్లో.. ప్రమోషన్లలో, జీతభత్యాల చెల్లింపుల్లో, సౌకర్యాల కల్పనలో పురుష సైనికులకు ఇస్తున్నట్లుగానే మహిళా సైనికులకు చెల్లిస్తున్నాం' అని ఆయన చెప్పారు.