Women commando
-
నక్సల్స్ ఏరివేతలో కీలకం కానున్న మహిళా శక్తి
న్యూఢిల్లీ: నక్సల్ ప్రభావిత ప్రాంతాలను ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతుంటాయి. అయితే, నక్సల్స్ ఏరివేతలో మహిళా శక్తిని కూడా వినియోగించుకోవాలని కేంద్రం భావించింది. ఈ మేరకు నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మహిళా భద్రతా దళాలు విధులు నిర్వర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడవుల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) మహిళా కమాండోలు పని చేయనున్నారు. సీఆర్పీఎఫ్ 88వ మహిళా బెటాలియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శిక్షణ పొందిన మహిళా కమెండోలను నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాల్లో విధి నిర్వహణకు పంపించాలని నిర్ణయించినట్లు సీఆర్పీఎఫ్ పేర్కొంది. ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా బెటాలియన్ ఏర్పాటుచేసిన ఘనత సీఆర్పీఎఫ్కే దక్కిందని ప్రకటించింది. ఇక సీఆర్పీఎప్ మహిళా కమెండోలను నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాలకు పంపించి నక్సలైట్లను అరికడతామని ధీమా వ్యక్తం చేసింది. సీఆర్పీఎఫ్ మహిళా బెటాలియన్‌లోని 34 మంది మహిళలను కోబ్రా దళంలోకి ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా మూడు నెలల పాటు కమాండో శిక్షణ ఇస్తున్నట్లు సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఏపీ మహేశ్వరి తెలిపారు. మహిళా బెటాలియన్‌లో పని చేస్తున్న పలువురు మహిళలకు అశోక్ చక్రతోపాటు పలు అవార్డులు దక్కాయని వివరించారు. విధి నిర్వహణలో భాగంగా సీఆర్పీఎఫ్ దళం అత్యంత ధైర్య సాహసాలు చూపిస్తోందని పేర్కొన్నారు. Women commandos for Anti-Naxals operations: @crpfindia inducts #women commondos for its anti #naxal CoBRA unit. After completion of their 3 months training, mahila warriors will be posted in Naxal affected areas like Sukma, Dantewada, Bijapur etc with male commandos. pic.twitter.com/P3UGRxA2lH — Ankur Sharma (@AnkurSharma__) February 6, 2021 -
డేర్ డెవిల్స్
ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో మహిళలు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించనున్నారు. మహిళా కమాండర్ కెప్టెన్ తానియా షెర్గిల్ నేతృత్వంలో ఈసారి పరేడ్ జరగనుంది. రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహణ చాలా కష్టమైన ప్రక్రియ. ఇందులో పాల్గొనే వారందరూ సమయపాలన పాటించాలి. ఒక్క సెకండ్ అటూ ఇటూ తేడా వచి్చనా మొత్తం పరేడ్ రసాభాస అవుతుంది. ఈసారి తానియా నేతృత్వంలో రిహార్సల్స్ అన్నీ విజయవంతంగా పూర్తి చేశారు. భారత ఆర్మీకి సేవలు అందిస్తున్న జవాన్ల కుటుంబంలో నాలుగో తరానికి చెందిన మేజర్ తానియా వయసు 26 ఏళ్లు. అయితేనేం ఆమెలో అందరినీ కమాండ్ చేసే శక్తి అపారం. ఖాకీ యూనిఫామ్, చేతిలో కత్తి ధరించి చురకత్తిలా ఆర్మీ పరేడ్‌కు ఆమె నేతృత్వం వహించిన తీరు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. అదే ఆమెకి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు అవకాశాన్ని ఇచి్చంది. ఈసారి పరేడ్‌లో సీఆర్పీఎఫ్కు చెందిన మహిళా బైకర్లు తమ శక్తిసామర్థ్యాలు ప్రదర్శించనున్నారు. 350సీసీ రాయల్ మోటార్ సైకిల్స్‌పై 65 మంది మహిళలు విన్యాసాలు చేయనున్నారు. మహిళా బైకర్లు విన్యాసాలు చేయడం ఇదే మొదటిసారి. -
సీఆర్పీఎఫ్లో తొలి మహిళా బైక్ టీం ఏర్పాటు
న్యూఢిల్లీ: మోటారు బైకులపై సాహస విన్యాసాలు ప్రదర్శించే కమెండో బృందాల్లో ఇక మహిళా కమెండోల బృందం కూడా తన సాహసాలతో ఆకట్టుకోనుంది. ఈ మేరకు సీఆర్పీఎఫ్లో తొలిసారిగా పూర్తి మహిళా కమెండోలతో ‘జాన్బాజ్’ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసింది. ఢిల్లీలో వచ్చే నెలలో జాన్బాజ్ మహిళా కమెం డోల బృందం సాహసాలను ప్రదర్శించనుంది. మోటారు బైకులపై వేగంగా ప్రయాణిస్తూ అద్దాలను పగులగొట్టుకుని వెళ్లడం, మంటల్లోంచి దూసుకెళ్లడం వంటి విన్యాసాలు చేయనుంది.