ఆంధ్రజ్యోతి విలేకరి రిమాండు
దేవరుప్పుల : మహిళలపై అసభ్యకరంగా వ్యవహరించిన కేసులో ఓ విలేకరని గురువారం రిమాండ్ చేసినట్టు ఎస్సై సూర్యప్రసాద్ తెలిపారు. స్థానిక ఎస్సై కథనం మేరకు.. బుధవారం జనగామ నుంచి దేవరుప్పులకు టాటాఎసీలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికుల పట్ల దేవరుప్పుల మండల ఆంధ్రజ్యోతి విలేఖరి ఎం.వేణుమాధవ్ అసభ్యకరంగా వ్యవహరించారు.
ఈ విషయమై బాధిత మహిళలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది విదితమే. ఈ మేరకు ఎస్సై 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసీ నిందితుడిగా భావిస్తున్న వేణుమాధవ్‌ను గురువారం సాయంత్రం జనగామ కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ చేసినట్టు ఎస్సై వివరించారు.