ఆంధ్రజ్యోతి విలేకరి రిమాండు | andhrajyothy reporter remand | Sakshi
Sakshi News home page

ఆంధ్రజ్యోతి విలేకరి రిమాండు

Jul 31 2015 2:00 AM | Updated on Aug 18 2018 4:06 PM

మహిళలపై అసభ్యకరంగా వ్యవహరించిన కేసులో ఓ విలేకరని గురువారం రిమాండ్ చేసినట్టు ఎస్సై సూర్యప్రసాద్ తెలిపారు.

దేవరుప్పుల : మహిళలపై అసభ్యకరంగా వ్యవహరించిన కేసులో ఓ విలేకరని గురువారం రిమాండ్ చేసినట్టు ఎస్సై సూర్యప్రసాద్ తెలిపారు. స్థానిక ఎస్సై కథనం మేరకు.. బుధవారం జనగామ నుంచి దేవరుప్పులకు టాటాఎసీలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికుల పట్ల దేవరుప్పుల మండల ఆంధ్రజ్యోతి విలేఖరి ఎం.వేణుమాధవ్ అసభ్యకరంగా వ్యవహరించారు.

ఈ విషయమై బాధిత మహిళలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది విదితమే. ఈ మేరకు ఎస్సై 354 సెక్షన్ కింద  కేసు నమోదు చేసీ నిందితుడిగా భావిస్తున్న వేణుమాధవ్‌ను గురువారం సాయంత్రం జనగామ కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ చేసినట్టు ఎస్సై వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement