womendied
-
కారేపల్లి యువతి.. అసోంలో ...
కారేపల్లి (ఖమ్మం): కారేపల్లి యువతి.. అసోంలో మృతిచెందింది. ఆమె కుటుంబీకులు తెలిపిన వివరాలు... కారేపల్లి అంబేడ్కర్ సెంటర్‌కు చెందిన బాణోతు శిరీష(22), పేరుపల్లి గ్రామానికి చెందిన వరుసకు బావ అయిన అజ్మీర నరేష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. నరేష్, బీఎస్ఎఫ్ (సరిహద్దు రక్షణ దళం) కానిస్టేబుల్‌గా అసోం రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ఆ దంపతులు ఇక్కడి నుంచి రైలులో అస్సాం బయల్దేరారు. మంగళవారం సాయంత్రం అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆమె జ్వరంతో బాధపడుతోంది. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందింది. అయినప్పటికీ జ్వరం తగ్గలేదు. అలాగే అసోం వెళ్లింది. మంగళవారం రాత్రి జ్వరం (డెంగీ) మరింత తీవ్రమైంది. అదే రోజు రాత్రి మృతిచెందింది. ఆమె తండ్రి జామ్లా నాయక్, టేకులపల్లి మండలంలో ఆర్ఐగా పనిచేస్తున్నారు. తల్లి జమున, గార్ల మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తమ కూతురు ఇక లేదన్న సమాచారాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. అసోం కోల్‌కతాకు, అక్కడి నుంచి సికింద్రాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు విమానంలో మృత దేహం చేరుకుటుందని, అక్కడి నుంచి అంబులెన్స్‌లో కారేపల్లికి గురువారం తెల్లవారుజామున తీసుకొస్తామని కుటుంబీకులు తెలిపారు. -
బైక్ వాగులో పడి మహిళ మృతి
హాలియా : ప్రమాదవశాత్తు బైక్ వాగులో పడి మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రాజవరం గ్రామ పరిధిలోని డొక్కలబావితండా వద్ద హాలియా వాగులో శుక్రవారం రాత్రి దామరచర్ల మండలం మొలకచర్ల గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సైదమ్మ(30) హాలియా నుంచి మొలకచర్లకు బైక్‌పై వస్తుండగా హాలియా వాగు వంతెనపై బైక్ అదుపు తప్పివాగులో పడిపోయింది. దీంతో మహిళ ముఖంపై తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా శనివారం ఉదయం స్థానికులు చూసి హాలియా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసలు ప్రమాద స్థలికి చేరుకుని మృతదేహాన్ని సాగర్ కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు బోల్లంపల్లి సైదయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసికుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్ తెలిపారు. మృతురాలికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇదిలా ఉండగా మృతురాలికి గాయాలవడంతో పోలీసులు మందుగా మృతి అనుమానస్పదంగా ఊహించారు. సంఘటనా స్థలాన్ని సీఐ పార్థసారథి పరిశీలించారు. ప్రమాదంపై ఆయన స్థానికులను అడిగి వివరాలు తెలసుకున్నారు.