Womens Court
-
తల్లీ కూతురు హత్య.. వ్యక్తికి జీవితాంత ఖైదు
చిత్తూరు అర్బన్: తల్లీ, కూతురిని హతమార్చి.. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ వ్యక్తికి మరణించేంత వరకు జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని ప్రత్యేక మహిళా కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ కథనం మేరకు.. తంబళ్లపల్లె మండలంలోని గంగిరెడ్డి కాలనీకి చెందిన సయ్యద్ మౌలాలి(47) అనే వ్యక్తి వృత్తిరీత్యా చెరువులను లీజుకు తీసుకుని చేపలు పట్టి విక్రయించే వ్యాపారం చేసేవాడు. మండలంలోని గిరిజన తాండాకు చెందిన సరళమ్మ(37)కు భర్త మరణించాడు. ఆమెతో మౌలాలి కొన్నాళ్లపాటు సహజీవనం చేశాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, తల్లి ఉన్నారు. సరళమ్మ వేరే మగాళ్లతో ఫోన్లో మాట్లాడుతోందనే అనుమానంతో ఆమెతో రాత్రి పొలం వద్ద గొడవపడ్డాడు. మాటామాటా పెరిగి ఆమెను కర్రతో తలపై కొట్టాడు. ఆమె చనిపోవడంతో పెద్దేరు ప్రాజెక్టులో వేసేశాడు. శవం పైకి తేలకుండా చీరకు రాళ్లు కట్టిపడేశాడు. మరుసటి రోజు ఆమె తల్లి గంగులమ్మ తన కుమార్తె ఎక్కడని మౌలాలిని నిలదీసింది. నీ కుమార్తె ఉదయానికల్లా వస్తుందని నమ్మబలికాడు. ఆమెకు మద్యం అలవాటు ఉండడంతో మద్యం తెచ్చి ఇచ్చాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో చీరకొంగుతో గొంతుకు బిగించి చంపేశాడు. శవాన్ని ఓ చెరువులోకి తీసుకెళ్లాడు. శవం పైకి లేవకుండా ఆమె చీరను నీటిలోని ఓ చెట్టు మొదలుకు కట్టివేశాడు. ఆ మరుసటిరోజు సరళమ్మ కుమార్తెలు తమ అమ్మ, అవ్వ ఎక్కడని మౌలాలీని నిలదీశారు. వారికి కరోనా రావడంతో మదనపల్లె ఆస్పత్రిలో చేర్పించానని వారిని నమ్మించాడు. వారితో కలసి అక్కడే పడుకునే వాడు. వారిలో పెద్ద అమ్మాయిపై లైంగిక దాడి చేశాడు. ఎవరికైనా చెబితో చంపేస్తానని బెదిరించాడు. ఇలా నెల రోజులు గడిచాక ఆ పిల్లలు ముగ్గురిని కర్ణాటక గౌనిపల్లెలోని ఓ ఇంట్లో ఉంచాడు. బంధువుల ఫిర్యాదు సరళమ్మ, ఆమె తల్లి గంగులమ్మ, కుమార్తె కనపడకపోవడంతో వారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సయ్యద్ మౌలాలిని అరెస్టు చేసి.. బాలికలను అతడి నుంచి విడిపించారు. నిందితుడు చెప్పిన వివరాలతో చెరువులో పడున్న తల్లీ, కుమార్తె మృతదేహాలను బయటకు తీశారు. అతనిపై పలు హత్యలు, అత్యాచారం, అట్రాసిటీ, అపహరణ కేసులు నమోదు చేశారు. నిందితుడిపై మోపిన అభియోగాలు న్యాయస్థానంలో రుజువుకావడంతో.. అతను మరణించేంత వరకు జైల్లో ఉండాలని, రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శాంతి సోమవారం తీర్పునిచ్చారు. బాలికకు రూ.5 లక్షల పరిహారం మంజూరు చేయాలని కలెక్టర్‌కు సూచిస్తూ తీర్పులో పేర్కొన్నారు. -
మారు తండ్రికి రెండు యావజ్జీవ శిక్షలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏడాదిన్నర పాపపై లైంగికదాడికి పాల్పడి హతమార్చిన మారు తండ్రికి రెండు యావజ్జీవ శిక్షలు విధిస్తూ తమిళ నాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా మహిళా స్పీడ్ట్రాక్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. కృష్ణగిరి జిల్లా దేవర్ఉళిమంగళంకు చెందిన చెన్నాచారి (29), శ్వేత (23) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అశ్వని అనే ఒకటిన్నరేళ్ల పాప ఉండగా మనస్పర్థలతో విడిపోయారు. ఆ తరువాత ఉదయకుమార్(25) అనే ఆటో డ్రైవర్‌ను శ్వేత పెళ్లి చేసుకుని కాపురం పెట్టింది. 2016 ఆగస్టు 23న తన సమీప బంధువును పరామర్శించేందుకు శ్వేత ఆసుపత్రికి వెళుతూ అశ్వనిని ఉదయకుమార్‌కు అప్పగించింది. అశ్వని తన చేతుల్లో నుంచి జారి కిందపడి తీవ్రగాయాలకు గురైందని భార్యకు ఫోన్‌చేసి చెప్పడంతో హుటాహుటిన వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే చికిత్స ఫలించక చిన్నారి కన్నుమూసింది. పోస్టుమార్టంలో చిన్నారిపై లైంగికదాడి జరిగి, ప్రాణాలు కోల్పోయిందని తేలింది. దీంతో పోలీసులకు లొంగిపోయిన ఉదయకుమార్ అశ్వనిపై లైంగికదాడికి పాల్పడి, కర్రతో కొట్టి చంపినట్లు అంగీకరించాడు. ఈ కేసు విచారణ పూర్తికాగా, నిందితునికి రెండు యావజ్జీవ శిక్షలు, రూ.25 వేల జరిమానా విధిస్తూ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. -
అత్యాచారం కేసులో ఎస్ఐకి 20 ఏళ్ల జైలు
చెన్నై, సాక్షి ప్రతినిధి : బాలికకు మత్తుమందిచ్చి అత్యాచారం చేసిన కేసులో ఎస్ఐకి విళుపురం మహిళా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. తంజావూరు జిల్లా కల్లనై సమీపం తోకూరైకి చెందిన శంకర్ (32), విళుపురం జిల్లా ఉళుందూర్‌పేట సమీపంలోని తుల్లపాలీ 10వ బెటాలియన్‌లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. అక్కడి పోలీస్ క్వార్టర్స్‌లో కాపురం ఉండేవారు. పక్క క్వార్టర్లో ఉంటున్న మరో ఎస్ఐ కుమార్తె(15)కు మత్తుమందిచ్చి అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చగా ఎస్ఐ శంకర్ ఇందుకు కారణమని బాలిక తల్లిదండ్రులు తెలుసుకుని 2005లో ఉళుందూర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఎస్ఐ శంకర్‌ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత అతను సస్పెండ్ అయ్యాడు. విళుపురం మహిళా కోర్టులో కేసు విచారణ సాగింది. నిందితుడు శంకర్‌కు రెండు సెక్షన్ల కింద మొత్తం 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తిలకవతి గోవిందరాజన్ శుక్రవారం తీర్పు చెప్పారు.