అత్యాచారం కేసులో ఎస్‌ఐకి 20 ఏళ్ల జైలు | Rape case SI 20-year-old prison | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసులో ఎస్‌ఐకి 20 ఏళ్ల జైలు

Published Sun, Aug 24 2014 12:05 AM | Last Updated on Sun, Sep 2 2018 5:04 PM

Rape case SI 20-year-old prison

 చెన్నై, సాక్షి ప్రతినిధి : బాలికకు మత్తుమందిచ్చి అత్యాచారం చేసిన కేసులో ఎస్‌ఐకి విళుపురం మహిళా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. తంజావూరు జిల్లా కల్లనై సమీపం తోకూరైకి చెందిన శంకర్ (32), విళుపురం జిల్లా ఉళుందూర్‌పేట సమీపంలోని తుల్లపాలీ 10వ బెటాలియన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. అక్కడి పోలీస్ క్వార్టర్స్‌లో కాపురం ఉండేవారు. పక్క క్వార్టర్‌లో ఉంటున్న మరో ఎస్‌ఐ కుమార్తె(15)కు మత్తుమందిచ్చి అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చగా ఎస్‌ఐ శంకర్ ఇందుకు కారణమని బాలిక తల్లిదండ్రులు తెలుసుకుని 2005లో ఉళుందూర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఎస్‌ఐ శంకర్‌ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత అతను సస్పెండ్ అయ్యాడు. విళుపురం మహిళా కోర్టులో కేసు విచారణ సాగింది. నిందితుడు శంకర్‌కు రెండు సెక్షన్ల కింద మొత్తం 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తిలకవతి గోవిందరాజన్ శుక్రవారం తీర్పు చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement