breaking news
Womens Cricket ODI World Cup
-
CWC 2025: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఇవాళ (అక్టోబర్ 13) బంగ్లాదేశ్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేసింది. షర్మిన్ అక్తర్ (50), షోర్నా అక్తర్ (35 బంతుల్లో 51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ నిగార్ సుల్తానా (32), ఫర్జానా హాక్ (30), రూబ్యా హైదర్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేసినా.. చాలా నిదానంగా ఆడారు. వీరిలో ఫర్జానా మ్యాచ్‌ను చూసే వారికి విసుగు తెప్పించింది. 30 పరుగులు చేసేందుకు ఆమె ఏకంగా 76 బంతులు ఆడింది. రూబ్యా హైదర్ సైతం తాను చేసిన 25 పరుగుల కోసం 52 బంతులను ఎదుర్కొంది. హాఫ్ సెంచరీ చేసినా, షర్మిన్ అక్తర్ కూడా 77 బంతులు ఆడింది. నిగార్ సుల్తానా 42 బంతుల్లో 32 పరుగులు చేసింది. ఆఖర్లో రితూ మోనీ 8 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. షోర్నా, రీతూ ఆఖర్లో వేగంగా ఆడకపోయుంటే బంగ్లాదేశ్ స్కోర్ 200 కూడా దాటేది కాదు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, క్లో ట్రయాన్, నదినే డి క్లెర్క్ తలో వికెట్ తీశారు.కాగా, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. సౌతాఫ్రికా నాలుగు, బంగ్లాదేశ్ ఆరో స్థానంలో ఉన్నాయి. సౌతాఫ్రికా 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండగా.. బంగ్లాదేశ్ 3 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో 2 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. సౌతాఫ్రికా కొద్ది రోజుల కిందట జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియాపై విజయం సాధించింది. చదవండి: IND VS WI: వీరోచిత శతకాలు.. చరిత్ర తిరగరాసిన విండీస్ బ్యాటర్లు -
CWC 2025: ఆస్ట్రేలియాతో సమరం.. టీమిండియా బ్యాటింగ్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) ఇవాళ (అక్టోబర్ 12) ఆసక్తికర సమరం జరుగుతుంది. భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్లు వైజాగ్ వేదికగా అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత మహిళల జట్టు (Team India) వన్డేల్లో టాస్ కోల్పోవడం ఇది వరుసగా ఆరోసారి. తుది జట్లు..ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ (కెప్టెన్/వికెట్‌కీపర్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షుట్భారత్: ప్రతికా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), అమంజోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణికాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్‌లోనూ భారత్‌కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఆసీస్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్ లభించింది). మూడో మ్యాచ్‌లో ఆసీస్ పాక్‌పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌లో ఉంది. చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
IND Vs SA: టీమిండియాపై అనూహ్య విజయం.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా నిన్న (అక్టోబర్ 9) ఓ ఆసక్తికర పోరు జరిగింది. భారత్, సౌతాఫ్రికా జట్లు వైజాగ్ వేదికగా హోరాహోరీగా తలపడ్డాయి. తప్పక గెలుస్తుందనుకున్న ఈ మ్యాచ్‌లో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు నదినే డి క్లెర్క్ (Nadine de Klerk) (54 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడి భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. భారత్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 81 పరుగులకే 5 కోల్పోయింది. ఈ దశలో క్లెర్క్.. క్లో ట్రయాన్ (49) సహకారంతో సౌతాఫ్రికాను గెలిపించింది. లక్ష్యానికి కొద్ది దూరంలో (41 పరుగులు) ట్రయాన్ ఔట్ కాగా.. చివర్లో క్లెర్క్ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. చేతిలో మరో 3 వికెట్లు మాత్రమే ఉండి, 24 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన దశలో ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది మరో 7 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది.క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా సౌతాఫ్రికా ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. వన్డే క్రికెట్ చరిత్రలో విజయవంతమైన లక్ష్య ఛేదనల్లో, ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సౌతాఫ్రికా చరిత్రకెక్కింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఐదో వికెట్ పడిన తర్వాత 171 పరుగులు జోడించి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ (159) పేరిట ఉండేది.సౌతాఫ్రికా హ్యాట్రిక్ఈ గెలుపుతో సౌతాఫ్రికా హ్యాట్రిక్ సాధించింది. ప్రపంచకప్ టోర్నీల్లో సౌతాఫ్రికాకు భారత్‌పై ఇది వరుసగా మూడో విజయం. ఈ గెలుపుకు మరో ప్రాధాన్యత కూడా ఉంది. వన్డేల్లో భారత్ చేతిలో వరుసగా ఐదు ఓటముల తర్వాత సౌతాఫ్రికాకు లభించిన తొలి విజయం ఇది.రిచా ఘోష్ చారిత్రక ఇన్నింగ్స్ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి, రిచా ఘోష్ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చారిత్రక ఇన్నింగ్స్ కారణంగా 251 పరుగులు చేసింది. 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో రిచా.. స్నేహ్ రాణా (33) సహకారంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది తొలి ఓటమి. అంతకుముందు భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌లపై విజయాలు సాధించింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు -
పాకిస్తాన్‌తో మ్యాచ్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన టీమిండియా
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ICC Women's World Cup 2025) భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో (India vs Pakistan) టీమిండియా (Team India) సామర్థ్యం మేరకు రాణించలేకపోయింది. కొలొంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి పాక్ (Pakistan) ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 247 పరుగులకు ఆలౌటైంది.46 పరుగులతో హర్లీన్ డియోల్ టాప్ స్కోరర్‌గా నిలువగా.. రిచా ఘోష్ 35 (నాటౌట్), జెమీమా రోడ్రిగెజ్ 32, ప్రతీక రావల్ 31, దీప్తి శర్మ 25, స్మృతి మంధన 23, స్నేహ్ రాణా 20, హర్మన్‌ప్రీత్ 19, శ్రీ చరణి 1, క్రాంతి గౌడ్ 8, రేణుకా సింగ్ డకౌటయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లకు మంచి ఆరంభాలు లభించినా పెద్దగా స్కోర్లుగా మలచలేకపోయారు.పాక్ బౌలర్లలో డయానా బేగ్ 4 వికెట్లతో సత్తా చాటగా.. సదియా ఇక్బాల్, కెప్టెన్ ఫాతిమా సనా తలో 2, రమీన్ షమీమ్, సష్రా సంధు చెరో వికెట్ పడగొట్టారు.స్ప్రే ఉపయోగించిన పాక్ కెప్టెన్భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చిన్నచిన్న పురుగులు పలు మార్లు మ్యాచ్‌కు అంతరాయం కలిగించాయి. ఓ దశలో పరుగుల సమస్య ఎక్కువ కావడంతో అంపైర్ అనుమతితో పాక్ కెప్టెన్ పరుగుల నివారణ స్ప్రేను ప్రయోగించింది. ఇన్నింగ్స్ 28వ ఓవర్లో ఇది జరిగింది. స్ప్రే ఉపయోగించిన తర్వాత పురుగుల ప్రభావం తగ్గడంతో భారత బ్యాటింగ్ సజావుగా సాగింది.టాస్ సమయంలో గందరగోళంటాస్ సమయంలో గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచినట్లు రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ ప్రకటించారు. వాస్తవానికి పాక్ కెప్టెన్ టాస్ గెలవలేదు.భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ వేయగానే ఫాతిమా "టెయిల్స్" అని చెప్పింది. కానీ రిఫరీ ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ "హెడ్స్"గా వినిపించుకున్నారు. తీరా నాణెం "హెడ్స్"గా పడడంతో టాస్ పాకిస్తాన్ గెలిచిందని ప్రకటించారు. టాస్ గెలిచిన ఫాతిమా ఫీల్డింగ్ ఎంచుకోగా, దీనిపై భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం ఆసక్తికరం.చదవండి: భారత్‌తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్ -
ఏడోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా
మహిళల క్రికెట్లో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్న ఆస్ట్రేలియా ఏడోసారి విశ్వవిజేతగా నిలిచింది. చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగి ఆద్యంతం దూకుడును కొనసాగించిన ఆస్ట్రేలియా వరుసగా తొమ్మిదో విజయంతో ఈ టోర్నమెంట్‌ను అజేయంగా ముగించింది. క్రైస్ట్‌చర్చ్: ఆస్ట్రేలియా జోరు ముందు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ నిలబడలేకపోయింది. ఆదివారం జరిగిన మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా 71 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించి ఏడోసారి విజేతగా నిలిచింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హీతెర్ నైట్ ఫీల్డింగ్ ఎంచుకోగా... మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగి 50 ఓవర్లలో 5 వికెట్లకు 356 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్లు అలీసా హీలీ, రాచెల్ హేన్స్ ఆరంభం నుంచే చెలరేగిపోయారు. ముఖ్యంగా అలీసా హీలీ (138 బంతుల్లో 26 ఫోర్లతో 170) తన కెరీర్లోనే గొప్ప ఇన్నింగ్స్ ఆడింది. రాచెల్ హేన్స్ 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద... అలీసా 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌లను ఇంగ్లండ్ ఫీల్డర్లు వదిలేసి మూల్యం చెల్లించుకున్నారు. ఇన్నింగ్స్ 30వ ఓవర్లో ఎకిల్‌స్టోన్ బౌలింగ్‌లో రాచెల్ హేన్స్ (93 బంతుల్లో 68; 7 ఫోర్లు) అవుటవ్వడంతో 160 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రాచెల్ అవుటయ్యాక వచ్చిన బెత్ మూనీ (47 బంతుల్లో 62; 8 ఫోర్లు) కూడా కదంతొక్కడంతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగెత్తింది. అలీసా, బెత్ మూనీ రెండో వికెట్‌కు 156 పరుగులు జత చేయడంతో ఆసీస్ స్కోరు 300 పరుగులు దాటింది. అలీసా ‘డబుల్ సెంచరీ’ ఖాయమనుకుంటున్న దశలో ష్రుబ్షోల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయి రెండో వికెట్‌గా వెనుదిరిగింది. 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. నటాలీ సివెర్ (121 బంతుల్లో 148 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత ఆటతో అజేయ సెంచరీ సాధించినా ఆమెకు సహచర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. టామీ బీమోంట్ (27; 5 ఫోర్లు), హీతెర్ నైట్ (26; 4 ఫోర్లు), సోఫీ డంక్లే (22; 1 ఫోర్) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దాంతో ఇంగ్లండ్ లక్ష్యానికి దూరంగా నిలిచింది. ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ (3/64), జెస్ జొనాసెన్ (3/57) రాణించారు. టోర్నీ మొత్తంలో 509 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచిన అలీసా హీలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’... ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డులు లభించాయి. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు 13 లక్షల 20 వేల డాలర్లు (రూ. 10 కోట్లు), రన్నరప్ ఇంగ్లండ్‌కు 6 లక్షల డాలర్లు (రూ. 4 కోట్ల 55 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ► ఒకే ప్రపంచకప్ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల్లో (సెమీఫైనల్, ఫైనల్) సెంచరీలు చేసిన తొలి క్రికెటర్ అలీసా. గతంలో పురుషుల క్రికెట్లో పాంటింగ్ (ఆస్ట్రేలియా; 2003 ఫైనల్, 2011 క్వార్టర్ ఫైనల్), జయవర్ధనే (శ్రీలంక; 2007 సెమీఫైనల్, 2011 ఫైనల్) వేర్వేరు ప్రపంచకప్ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశారు. ► పురుషుల, మహిళల ప్రపంచకప్ టోర్నీ ఫైనల్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా అలీసా హీలీ రికార్డు సృష్టించింది. శ్రీలంకతో 2007 పురుషుల ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ప్లేయర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (149) స్కోరును అలీసా అధిగమించింది. ► ఇప్పటివరకు 12 సార్లు మహిళల ప్రపంచకప్ టోర్నీలు జరగ్గా... ఫైనల్ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే. ► ఆస్ట్రేలియా సాధించిన ప్రపంచకప్ టైటిల్స్. గతంలో ఆసీస్ 1978, 1982, 1988, 1997, 2005, 2013లలో కూడా విజేతగా నిలిచింది. -
ఎదురులేని ఆస్ట్రేలియా
వెల్లింగ్టన్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా జట్టు మహిళల క్రికెట్ వన్డే వరల్డ్‌కప్‌లో ఏడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. వెస్టిండీస్ జట్టుతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా 157 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. లీగ్ దశలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియా సెమీఫైనల్లోనూ గెలిచి ఈ టోర్నీలో వరుసగా ఎనిమిదో విజయం నమోదు చేసుకోవడం విశేషం. వర్షం అంతరాయం కలిగించడంతో 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 45 ఓవర్లలో 3 వికెట్లకు 305 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అలీసా హీలీ (129; 17 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయగా... రాచెల్ హేన్స్ (100 బంతుల్లో 85; 9 ఫోర్లు) ఆకట్టుకుంది. వీరిద్దరు తొలి వికెట్‌కు 216 పరుగులు జోడించారు. చివర్లో బెత్ మూనీ (43 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడటంతో ఆసీస్ స్కోరు 300 దాటింది. 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 37 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా ఆడుతుంది. -
ఇటు శ్రీశాంత్... అటు యువీ
న్యూఢిల్లీ : స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఏడేళ్ల పాటు క్రికెట్‌కు దూరమైన పేస్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ తొలిసారి ప్రధాన స్రవంతిలోకి అడుగు పెట్టేందుకు చేరువ య్యాడు. ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ కోసం కేరళ జట్టు ప్రకటించిన ప్రాబబుల్స్‌లో శ్రీశాంత్‌కు చోటు దక్కింది. ఇటీవలే నిషేధం ముగియడంతో 38 ఏళ్ల శ్రీశాంత్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. 2013 ఐపీఎల్లో అతను తన చివరి మ్యాచ్ ఆడాడు. ఇదే టోర్నీ కోసం పంజాబ్ ప్రకటించిన ప్రాబబుల్స్‌లో సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను కూడా ఎంపిక చేశారు. గత ఏడాది జూన్‌లో యువీ రిటైర్మెంట్ ప్రకటించాడు. యువీ అధికారికంగా ‘రిటైర్’ అయ్యాడు కాబట్టి కెనడా గ్లోబల్ టి20 లీగ్, అబుదాబి టి10 టోర్నీలో కూడా ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు యువీ మళ్లీ ఆడాలంటే బీసీసీఐ అనుమతి తప్పనిసరి. మరోవైపు బెంగాల్ జట్టు ప్రకటించిన ప్రాబబుల్స్‌లో అవకాశం దక్కించుకున్న ఆల్‌రౌండర్ మొహమ్మద్ కైఫ్... భారత పేసర్ షమీ తమ్ముడు కావడం విశేషం. క్వాలిఫయర్‌తో భారత్ తొలి పోరు దుబాయ్ : న్యూజిలాండ్ వేదికగా 2022 ఫిబ్రవరి–మార్చిలో జరిగే మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేశారు. 8 జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి పోరును మార్చి 6న క్వాలిఫయర్‌తో ఆడనుంది. ఆ తర్వాత భారత్ వరుసగా న్యూజిలాండ్ (మార్చి 10న), క్వాలిఫయర్ (మార్చి 12న), ఇంగ్లండ్ (మార్చి 16న), ఆస్ట్రేలియా (మార్చి 19న), క్వాలిఫయర్ (మార్చి 22న), దక్షిణాఫ్రికా (మార్చి 27న) జట్లతో తలపడుతుంది. -
భారత్(vs) దక్షిణాఫ్రికా
నేడు మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్ కొలంబో: ఈ ఏడాది జూన్‌లో జరిగే మహిళల క్రికెట్ వన్డే ప్రపంచకప్‌కు ఇప్పటికే అర్హత సాధించిన భారత్, దక్షిణాఫ్రికా జట్లు నేడు జరిగే క్వాలిఫయింగ్ టోర్నీలో టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. పది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో గ్రూప్ దశతో పాటు సూపర్ సిక్స్ స్టేజిలోనూ ఒక్క మ్యాచ్ కూడా ఓడని భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. అటు సూపర్ సిక్స్‌లో ఒక్క మ్యాచ్ తప్ప అన్నీ విజయాలే సాధించిన ప్రొటీస్ మహిళా జట్టు కూడా మిథాలీ రాజ్ బృందానికి గట్టి పోటీనిచ్చేందుకు ఎదురుచూస్తోంది. సెమీస్‌లో భారత జట్టు పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించగా, దక్షిణాఫ్రికా 36 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై నెగ్గింది. అయితే ఈ టోర్నీ సన్నాహకంగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌ను ఓడించినా సూపర్ సిక్స్‌లో 49 పరుగుల తేడాతో తిరిగి భారత్ ఓడించి పైచేయి సాధించింది. బౌలింగ్ పటిష్టంగానే ఉన్నా ఓపెనర్ల నుంచి శుభారంభం అందడం కీలకమని కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయపడింది.


