నేడు మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్
కొలంబో: ఈ ఏడాది జూన్‌లో జరిగే మహిళల క్రికెట్ వన్డే ప్రపంచకప్‌కు ఇప్పటికే అర్హత సాధించిన భారత్, దక్షిణాఫ్రికా జట్లు నేడు జరిగే క్వాలిఫయింగ్ టోర్నీలో టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. పది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో గ్రూప్ దశతో పాటు సూపర్ సిక్స్ స్టేజిలోనూ ఒక్క మ్యాచ్ కూడా ఓడని భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. అటు సూపర్ సిక్స్‌లో ఒక్క మ్యాచ్ తప్ప అన్నీ విజయాలే సాధించిన ప్రొటీస్ మహిళా జట్టు కూడా మిథాలీ రాజ్ బృందానికి గట్టి పోటీనిచ్చేందుకు ఎదురుచూస్తోంది.
సెమీస్‌లో భారత జట్టు పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించగా, దక్షిణాఫ్రికా 36 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై నెగ్గింది. అయితే ఈ టోర్నీ సన్నాహకంగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌ను ఓడించినా సూపర్ సిక్స్‌లో 49 పరుగుల తేడాతో తిరిగి భారత్ ఓడించి పైచేయి సాధించింది. బౌలింగ్ పటిష్టంగానే ఉన్నా ఓపెనర్ల నుంచి శుభారంభం అందడం కీలకమని కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయపడింది.
భారత్(vs) దక్షిణాఫ్రికా
Published Tue, Feb 21 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM
Advertisement
Advertisement