womens tennis tourny
-
క్వార్టర్స్‌లో సానియా జంట
పారిస్: స్ట్రాస్‌బర్గ్ ఓపెన్ మహిళల టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో సానియా–హర్డెస్కా ద్వయం 3–6, 6–3, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో లుద్మిలా కిచెనోక్ (ఉక్రెయిన్)–తెరీజా మిహలికోవా (స్లొవేకియా) జోడీపై విజయం సాధించింది. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ రెండు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. మ్యాచ్ హోరాహోరీగా సాగినా నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో సానియా–హర్డెస్కా ద్వయం పైచేయి సాధించింది. -
ఫెడ్ కప్ విజేత ఫ్రాన్స్
పెర్త్: ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫెడ్ కప్‌లో ఫ్రాన్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆ్రస్టేలియాతో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ 3–2తో గెలిచింది. 56 ఏళ్ల చరిత్ర కలిగిన ఫెడ్ కప్‌లో ఫ్రాన్స్ జట్టు టైటిల్ నెగ్గడం ఇది రెండోసారి. ఆ జట్టు మొదటిసారి 2003లో చాంపియన్‌గా నిలిచింది. తొలి రోజు శనివారం ఇరు జట్లు చెరో సింగిల్స్‌లో గెలిచి 1–1తో సమంగా నిలిచాయి. రెండో రోజు జరిగిన మూడో సింగిల్స్‌లో క్రిస్టినా మ్లాడెనోవిచ్ 2–6, 6–4, 7–6 (7/1)తో ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా)పై నెగ్గి ఫ్రాన్స్‌కు 2–1తో ఆధిక్యం అందించింది. అయితే నాలుగో సింగిల్స్‌లో అలా తొమ్లాజనోవిచ్ (ఆ్రస్టేలియా) 6–4, 7–5తో పౌలీన్ పర్మాంటీర్ను ఓడించి స్కోరును 2–2తో సమం చేసింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో క్రిస్టినా మ్లాడెనోవిచ్–కరోలినా గార్సియా ద్వయం 6–4, 6–3తో యాష్లే బారీ్ట–సమంతా స్టోసుర్ (ఆ్రస్టేలియా)పై గెలిచి ఫ్రాన్స్ జట్టుకు ఫెడ్ కప్‌ను అందించింది. -
భారత్‌కు నిరాశ
అస్తానా (కజకిస్తాన్): ఫెడ్ కప్ వరల్డ్ గ్రూప్‌నకు అర్హత సాధించాలని ఆశించిన భారత మహిళల టెన్నిస్ జట్టుకు నిరాశ ఎదురైంది. కజకిస్తాన్‌తో శుక్రవారం జరిగిన ఆసియా–ఓసియానియా గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 0–3తో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో కర్మన్‌కౌర్ 3–6, 2–6తో జరీనా దియాస్ చేతిలో ఓటమి చవిచూసింది. రెండో సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా 1–6, 6–7 (4/7)తో ప్రపంచ 43వ ర్యాంకర్ యులియా పుతిన్సెవా చేతిలో పరాజయం పాలైంది. దాంతో కజకిస్తాన్ విజయం ఖాయమైంది. నామమాత్రమైన డబుల్స్ మ్యాచ్‌లో రియా భాటియా–ప్రార్థన ద్వయం 1–6, 1–6తో అనా డానిలినా–గలీనా వొస్కోబొయేవా జంట చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం పరిపూర్ణమైంది. గ్రూప్ ‘ఎ’లో రెండు విజయాలో కజకిస్తాన్ ‘టాపర్’గా నిలిచింది. భారత్ రెండో స్థానంలో, థాయ్‌లాండ్ మూడో స్థానంలో నిలిచాయి. నేడు జరిగే 3–4 ప్లే ఆఫ్ స్థానా ల కోసం కొరియాతో భారత్ ఆడుతుంది. వరల్డ్ గ్రూప్ బెర్త్ కోసం కజకిస్తాన్, చైనా తలపడతాయి. -
ఫైనల్ రౌండ్‌కు ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో హైదరాబాదీ ప్లేయర్ ప్రాంజల ఫైనల్ రౌండ్‌కు చేరుకుంది. పుణేలోని డెక్కన్ జింఖానా గ్రౌండ్సలో జరుగుతోన్న ఈ టోర్నీ తొలి రౌండ్లో ప్రాంజల 6-0, 6-0తో నాజ్ అమ్రీన్పై గెలుపొంది ఫైనల్ క్వాలిఫరుుంగ్ రౌండ్‌కు అర్హత సాధించింది.