పెర్త్: ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫెడ్ కప్‌లో ఫ్రాన్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆ్రస్టేలియాతో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ 3–2తో గెలిచింది. 56 ఏళ్ల చరిత్ర కలిగిన ఫెడ్ కప్‌లో ఫ్రాన్స్ జట్టు టైటిల్ నెగ్గడం ఇది రెండోసారి. ఆ జట్టు మొదటిసారి 2003లో చాంపియన్‌గా నిలిచింది.
తొలి రోజు శనివారం ఇరు జట్లు చెరో సింగిల్స్‌లో గెలిచి 1–1తో సమంగా నిలిచాయి. రెండో రోజు జరిగిన మూడో సింగిల్స్‌లో క్రిస్టినా మ్లాడెనోవిచ్ 2–6, 6–4, 7–6 (7/1)తో ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా)పై నెగ్గి ఫ్రాన్స్‌కు 2–1తో ఆధిక్యం అందించింది.
అయితే నాలుగో సింగిల్స్‌లో అలా తొమ్లాజనోవిచ్ (ఆ్రస్టేలియా) 6–4, 7–5తో పౌలీన్ పర్మాంటీర్‌ను ఓడించి స్కోరును 2–2తో సమం చేసింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో క్రిస్టినా మ్లాడెనోవిచ్–కరోలినా గార్సియా ద్వయం 6–4, 6–3తో యాష్లే బారీ్ట–సమంతా స్టోసుర్ (ఆ్రస్టేలియా)పై గెలిచి ఫ్రాన్స్ జట్టుకు ఫెడ్ కప్‌ను అందించింది.
Comments
Please login to add a commentAdd a comment