wonderful sean
-
మంచుతెరలు.. సూర్యోదయం అందాలు అదుర్స్.. ఎక్కడంటే!
సాక్షి, అరకు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు – అనంతగిరి ఘాట్‌మార్గంలో గాలికొండ వ్యూపాయింట్ వద్ద ప్రకృతి అందాలు మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. గురువారం ఉదయం తరలివచ్చిన పర్యాటకుల సెల్ఫోన్ల వీటిని బంధించారు. మలుపుల వద్ద మంచు అందాలను తిలకించి పులకించిపోయారు. వంజంగి హిల్స్‌లో మంచుతెరలు పాడేరు : మేఘాలు, మంచు అందాల నిలయంగా విశ్వవ్యాప్తి పొందిన పాడేరు మండలం వంజంగి హిల్స్‌లో గురువారం ప్రకృతి కనువిందు చేసింది. అనేక ప్రాంతాలకు చెందిన పర్యాటకులు బుధవారం రాత్రే వంజంగి హిల్స్‌కు చేరుకుని కల్లాలబయలు, బోనంగమ్మ పర్వతంపై గుడారాలు వేసుకుని బస చేసారు. తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో సూర్యోదయం అందాలు పర్యాటకులను అబ్బురపరిచాయి. కొండల నిండా మంచు నెలకొనడంతో ఇక్కడ ప్రకృతి రమ్యతను చూసి పర్యాటకులంతా మంత్రముగ్ధులయ్యారు. ఉదయం పది గంటల వరకు మంచుతెరలు ఆకట్టుకున్నాయి. (క్లిక్: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు) -
కిందపడిన పతకాన్ని తీసిచ్చిన సీఎం
సాక్షి, అమరావతి: ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. చుట్టూ ఐపీఎస్, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. సైగ చేస్తే చాలు ఆదేశాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయినా ఏ మాత్రం దర్పం ప్రదర్శించని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసులకు విశిష్ట సేవా పతకాలు ముఖ్యమంత్రి అందచేశారు. ఈ సందర్బంగా ఓ పోలీస్ అధికారికి పతకాన్ని అలంకరించారు. సీఎంకు శాల్యూట్ చేసే సమయంలో ఆ పతకం పోలీస్ అధికారి నుంచి జారి పడింది. దీనిని గమనించకుండా ఆ అధికారి కవాతు చేస్తూ ముందుకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జారిపడిన ఆ పతకాన్ని సమీపంలో ఉన్న మరో అధికారి చేతికి ఇచ్చారు. ఈ వీడియో క్లిప్పింగ్ వైరల్ కావడంతో సీఎం వ్యవహరించిన తీరుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆకాశంలో అద్భుత దృశ్యం
రావులపాలెం: సమయం.. బుధవారం ఉదయం 11 గంటలు.. ఎండ చుర్రుమంటున్న వేళలో అనుకోకుండా ఆకాశం వైపు చూసిన వారికి కనువిందైన దృశ్యం కనిపించింది. మబ్బుల నడుమ సూర్యుని చుట్టూ ఇంద్రధనుస్సు మాదిరిగా రంగుల వలయం ఏర్పడింది. వలయపు అంచుకు, సూర్యునికి మధ్య పలచటి చీకటి అలముకున్నట్టు నల్లగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో.. ప్రధానంగా కోనసీమ ప్రాంతంలో ఈ విశేషం చాలాసేపు కనిపించింది. ఈ వలయం రాబోయే ఉత్పాతానికి సంకేతమని కొందరు భావిస్తే.. మరికొందరు కలియుగాంతానికి సూచన అనేంతవరకూ ఊహాగానాలు వ్యాపించాయి. కానీ ఇది తుఫాను రాకకు సంకేతం కావచ్చని రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఫిజిక్స్ విభాగం రీసెర్చ్ డెరైక్టర్ డాక్టర్ కె.రామచంద్రరావు తెలిపారు. ఇలాంటి వలయాన్ని శాస్త్త్రవేత్తలు ‘హాలో’ అంటారన్నారు. భూమికి ఏడు వేల మీటర్ల ఎత్తున దుమ్ముధూళితో కూడిన అణువులు దట్టమైన ‘హై సిర్రస్’ మేఘాలుగా మారి, వాటిలో మంచు స్ఫటికాలు ఏర్పడతాయని వివరించారు. సూర్యకాంతి వాటిపై పడి పరావర్తనం, వక్రీభవనం చెంది ఏడు రంగులుగా మారి ఈ వలయాలు ఆవిష్కృతమవుతాయన్నారు.