Wood house
-
గ్రేటర్ హైదరాబాద్‌లో కెనడా విల్లా
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లు సినిమాల్లో కనిపించిన చెక్క ఇళ్లు ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చేశాయి. అచ్చం కెనడా, అమెరికాలో కనిపించే ఇళ్ల తరహాలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నిర్మించారు. తుమ్మలూర్ రెవెన్యూ పరిధి హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి పక్కన మ్యాక్ ప్రాజెక్ట్స్‌లో ఈ కెనడియన్ వుడ్ విల్లాలను నిర్మించారు. అధునాతన నిర్మాణ పద్ధతిలో, ఎక్కువ శాతం చెక్కను ఉపయోగించి నిర్మాణం పూర్తి చేశారు. అడవులకు వీలైనంత వరకు హాని కలిగించకుండా.. ప్రత్యేకంగా పెంచిన చెట్లనుంచి చెక్క సేకరించి నిర్మాణం కోసం వాడారు. ఈ కెనడియన్ వుడ్ విల్లాను హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. కార్యక్రమానికి గౌరవ అతిథులుగా కెనడా హైకమిషనర్ కెమెరాన్ మాకే హాజరయ్యారు. కెనడియన్ విల్లాల నిర్మాణం చేపడుతున్న మ్యాక్ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ తమ ప్రాజెక్ట్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ 2021లో ప్రారంభం కాగా కేవలం 12నెలలోనే ఇళ్ల నిర్మాణం పూర్తికావడం విశేషమని తెలిపారు. బ్రిటిష్ కొలంబియా కెనడా ధృవీకరించిన కలపతో విల్లాను నిర్మించామని తెలిపారు. కెనడియన్ వుడ్‌తో మ్యాక్ ప్రాజెక్ట్ కలిసి భాగస్వామ్యం కావడం విశేషమన్నారు. హైదరాబాద్ నగరం రోజురోజుకు శివారు ప్రాంతాలకు విస్తరిస్తోందని, బంగారు భవిష్యత్తుకు విల్లాలను కొనుగోలు చేయడమే మంచిదన్నారు. చదవండి: (వన్‌ప్లస్ దివాలీ సేల్.. కళ్లు చెదిరే డీల్స్) -
కలప అక్రమ రవాణాకు చెక్
రామాయంపేట(మెదక్): అటవీ ప్రాంతల నుంచి కలప అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. అడవులను కాపాడే నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాలని అటవీశాఖ అధికారులను తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. ఎవరినీ వదిలిపెట్టకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలో విలువైన కలప లేకపోవడంతో రామాయంపేట అటవీ ప్రాంతం మీదుగా ఇతర రాష్ట్రాల నుంచి టేకు, ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. దీంతో ఈ విషయమై జిల్లా అటవీశాఖ ప్రత్యేక చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి ఎక్కడిక్కడ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు ముమ్మరం చేశారు. అటవీ ప్రాంతం రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంచేందుకు సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో అధికారులు పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. జిల్లాలో అటవీ ప్రాంతం నుంచి కలప అక్రమ రవాణా తగ్గినప్పటికీ అక్రమార్కులు అడపాదడగా చెట్లను నరుకుతునే ఉన్నారు. వీరికి ఇప్పటికే గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం ఆరు రేంజీల పరిధిలో 58 వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో విలువైన కలప లేకపోవడంతో ఈ ప్రాంతంలో కలప అక్రమ రవాణా తక్కువగానే సాగుతోంది. సీఎం ఆదేశాల దరిమిలా అన్ని రేంజీల పరిధిలో ప్రత్యేక చర్యలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమ రవాణా జరిగినా ప్రాంతాలను అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. గిరిజనతండాలను ఆనుకునే ఉన్న అటవీ ప్రాంతం నుంచి అక్కడక్కడా చెట్లను నరుకుతున్నట్లు సమాచారం. ఇందుకు గుర్తుగా మొడులు మాత్రమే మిగిలాయి. జాతీయ రహదారిపై నుంచి విలువైన కలప అక్రమ రవాణా జరుగుతుండగా... పలుమార్లు రామాయంపేటవద్ద అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు పట్టుబడ్డాయి. ఇతర రాష్ట్రాలనుంచి గతంలో ఎర్రచందనం, టేకు కలప అక్రమరవాణా జరుగుతుండగా అటవీ అదికారులు రామాయంపేట వద్ద పట్టుకున్నారు. ఇందులో భాగంగా రాత్రివేళ పెట్రోలింగ్ ముమ్మరం చేయడంతోపాటు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. కలప అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిల్లా పరిధిలో అటవీప్రాంతంలో విలువైన కలప లేకపోవడంతో ఈ ప్రాంతంలో అక్రమ రవాణా తగ్గింది. ఏదేమైనా కలప అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్నటువంటి అడవిని కాపాడుకోవడానికిగాను ప్రజలు కూడా తమకు సహకరించాలి. ఎదైనా సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. – పద్మజారాణి, జిల్లా అటవీ అధికారిణి -
నడిసముద్రంలో 49 రోజులు
జకార్తా: సముద్రం మధ్యలో చెక్క ఇంట్లో పనిచేస్తున్న టీనేజీ పిల్లాడు అడిలాంగ్ చెక్కఇంటితోసహా సముద్రంలోకి అలలధాటికి 2,500 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయాడు. పసిఫిక్ మహాసముద్రంలో ఎట్టకేలకు 49 రోజుల తర్వాత ఆ పిల్లాడిని రక్షించగలిగారు. ఇండోనేసియాలోని సులవెసి ద్వీపం దగ్గర్లో జరిగిందీ ఘటన. ఒక్కడే నడిసముద్రంలో 49 రోజులున్న అడిలాంగ్ ఆకలితీర్చుకునేందుకు చేపలు వేటాడి తిన్నాడు. దాహమేస్తే సముద్రపునీటిలో బట్టలు తడిపి పిండి తాగేవాడు. అటుగా వెళ్తున్న పనామా దేశానికి చెందిన ఓ పడవ బృందం ఇతడిని కాపాడింది. ఇన్ని రోజులైనా పిల్లాడు ఆరోగ్యంగానే ఉండటం విశేషం. సముద్రంలో చేపలను వెలుతురుతో ఆకర్షించేందుకు నీటిలో తేలియాడే ఇళ్లను నిర్మిస్తారు. సముద్రం అడుగుభాగంలో వేసిన లంగరు ఆధారంగా ఇల్లు నీటిపై ఒకేచోట ఉంటుంది. వెలుతురు నిరంతరంగా ఉండే బాధ్యత యజమాని ఈ పిల్లాడికి అప్పజెప్పాడు. -
తాజా పుస్తకాలు
ఉద్యమాలలో భారత మహిళలు సింహం తన చరిత్ర తాను రాసుకునే వరకూ వేటగాడి చరిత్రే చెలామణి అవుతుందని సామెత. మనం ఏ పని చేసినా మగదృష్టితోనే చేస్తాం. ఉద్యమాల గాథలైనా విజేతల కథలైనా మగవారి వల్ల మగవారి చేత మగవారి కొరకు. స్త్రీలు ఏం చేసినా లెక్కలోకి రాదు. స్త్రీల చేతుల తోడు లేకుండా చప్పట్లు మోగగలవా? ఆదివాసీ ఉద్యమాల్లో, స్వాతంత్య్రోద్యమాల్లో పని చేసిన స్త్రీల గురించి రాయరు చాలాసార్లు. ఆ మొత్తం వెలితిని పూడ్చే ప్రయత్నం ఈ పుస్తకం. వి.గార్గి ఇంగ్లిష్‌లో రాసిన ‘హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఇన్ మూవ్మెంట్’ పుస్తకాన్ని తెలుగులో మహిళామార్గం పత్రికలో సీరియలైజ్ చేసి (అనువాదం: మధుమాలతి, సూరి) ఇప్పుడు పుస్తకంగా తీసుకువచ్చారు. సంస్కరణోద్యమాల నుంచి మొదలుపెట్టి పర్యావరణ ఉద్యమాల వరకు పిడికిలి బిగించిన స్త్రీలెందరో ఇందులో కనపడతారు. విలువైన పుస్తకం. మహిళ లేని చరిత్ర లేదు- వి.గార్గి; వెల: రూ.120; ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలు ఉడ్‌హౌస్ పుస్తకాలు రెండు తెలుగులో ఉడ్హౌస్ని అనుదించి అందించడంలో గబ్బిట కృష్ణమోహన్ సఫలీకృతులయ్యారు. ఆయన అనువాదం చేసిన ఉడ్‌హౌస్ కథలు ‘సరదాగా కాసేపు’ పేరుతో వెలువడి పాఠకాదరణ పొందాయి. ఆ ఉత్సాహంతో ఆయన మరి రెండు పుస్తకాలు తీసుకొచ్చారు. ఉడ్‌హౌస్ రాసిన ‘ది స్టోరీ ఆఫ్ విలియమ్’, ‘ది మేన్ హూ గేవ్ అప్ స్మోకింగ్’, ‘బిగ్ బిజినెస్’ తదితర పది కథలను ‘సరదాగా మరి కాసేపు’ పేరుతోనూ, ఉడ్‌హౌస్ నవల ‘ఫ్రోజెన్ ఎసెట్స్’ను ‘లంకె బిందెలు’ పేరుతోనూ అనువాదం చేసి అందించారు. రెంటిలోనూ ఉడ్‌హౌస్ పాత్రలను స్థానికీకరణం చేసి రాయడం ఒక విధంగా మంచిది ఒక విధంగా కాదు. మంచి ఏమిటంటే మూలం మరీ దగ్గరైపోవడం. చెడ్డ- మూలం మరీ దూరానికి పోవడం. హాస్యాభిమానుల పుస్తకాలు ఇవి. సరదాగా మరి కాసేపు; వెల: రూ.140; లంకెబిందెలు; వెల: రూ.150; విశాలాంధ్ర ప్రచురణ; ప్రతులకు- విశాలాంధ్ర ఎన్నికల చట్టాలపై సమగ్ర సమాచారం ఓటు వేయడం ఇవాళ ప్రతి ఒక్కరి బాధ్యతగా మారింది. ఎవరికి ఓటు వేయాలనే అంశంపై చైతన్యం తెచ్చుకోవడం కనిపిస్తూ ఉంది. అయితే ఒకరికి ఓటు వేసే స్థితి నుంచి మనమే అభ్యర్థిగా మారే స్థితికి ఎదగాలంటే (పార్టీల్లో ఉండాల్సిన నియమం లేదు. ఇండిపెండెంట్‌గా అయినా సరే) ఏం చేయాలో చాలామందికి తెలియదు. ఔత్సాహిక రాజకీయ నేతలకు కూడా తెలియదు. న్యాయవాదులు వడ్లమాని వెంకటరమణ, వడ్లమాని నాగేష్శర్మలు ఈ అవసరం కోసమే ప్రజా ప్రాతినిధ్యచట్టం అంతటిని తెలుగులోకి అనువాదం చేశారు. ఎలక్షన్ ప్రక్రియలోని అన్ని స్థాయులను విశదపరిచారు. అభ్యర్థి అర్హతలు, నామినేషన్ ఎలా వేయాలి, కట్టవలసిన డిపాజిట్లు, ఏజెంట్లు, బూత్‌లు-వాటి నిర్వహణ, రిటర్నింగ్ ఆఫీసర్లు, వారి డ్యూటీలు విపులంగా చర్చించారు. దీంతో పాటు సమాచార హక్కు చట్టం, సొసైటీల చట్టం తదితర అంశాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో గెలవండి- వెల: రూ.200; ప్రతులకు: 9912240509 పల్లెను మింగిన పెట్టుబడి పల్లెలు అభివృద్ధి చెందాలంటే నిధులు రావాలి. నిధులు రావాలంటే పెట్టుబడి రావాలి. పెట్టుబడి వస్తే? వస్తే ఏమవుతుందో పల్లెలు ఏమవుతున్నాయో వృత్తులేమవుతున్నాయో వ్యవసాయం ఏమవుతున్నదో గిరిజనులు ఏమవుతున్నారో మత్స్యకారులు ఏమవుతున్నారో ఐదేళ్ల పాటు పల్లెలు తిరిగి పరిశోధించి రాసిన పుస్తకం ఇది. చాలామంది వ్యవసాయాన్ని వదిలేయడం మనకు అభివృద్ధి. వలస వచ్చి పట్టణాల్లో మురికివాడలను పెంచడమూ అభివృద్ధే. స్థానిక వ్యవస్థలు బలపడాల్సింది పోయి అంతరాలు పెరిగి నడుం విరుచుకుంటూ ఉండటం పల్లెల్లో వర్తమాన దృశ్యం. దీనిని చూపి మేల్కొలిపే ప్రయత్నం చేశారు పుస్తక రచయిత ఎస్.ఎ.విద్యాసాగర్. పాత వ్యవస్థ మంచిదికాదు మారాలి అనుకున్నాం గతంలో. కొత్త వ్యవస్థ బాగున్నదా? భవిష్యత్తు క్షేమంగా అనిపిస్తున్నదా? ఆ అవగాహన కలిగించే పుస్తకమే ఇది. పల్లెను మింగిన పెట్టుబడి - ఎస్.ఎ. విద్యాసాగర్; వెల: రూ. 250; ప్రతులకు- 9010204633, 9492340651