wooden bridges
-
పాలకులు మరిచారు.. రైతులే నిర్మించుకున్నారు!
సాక్షి, రంగారెడ్డి: పరిగి మండలంలోని చిగురాల్పల్లి గ్రామ సమీపంలోని వాగుపై వంతెన లేక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన సగం మంది రైతుల వ్యవసాయ భూములు వాగు అవతలివైపు ఉన్నాయి. వారు వాగు దాటే పొలాలకు వెళ్లాలి. సమీప గ్రామమైన రుక్కుంపల్లికి వెళ్లాలన్నా ఆ వాగు దాటాల్సిందే. వర్షాకాలంలోనైతే ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటుతుంటారు. తమ కష్టాలు తీర్చాలని ప్రజాప్రతినిధులకు, నాయకులకు దశాబ్దకాలంగా మొరపెట్టుకుంటునే ఉన్నారు. (తెలంగాణలో 1873 పాజిటివ్, 9 మంది మృతి) వాగుపై వంతెన నిర్మిస్తామని నాయకులు హామీ ఇస్తున్నా.. అమలు చేయడం లేదు. ఇక.. ఎవరికోసమే చూడడం కంటే తామే వంతెన వేసుకోవాలని రైతులంతా నిర్ణయించకున్నారు. అందరూ చేయిచేయి కలిపి కర్రలు, తాళ్లతో సుమారు 50 మీటర్ల పొడవుతో తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. మనుషులు, మేకలు, గొర్రెలు ఆ తాళ్ల వంతెనపై నుంచి వెళుతుఉండగా.. బరువు ఎక్కువగా ఉండే ఎద్దులు, గేదెలు వాగులోంచి వెళుతున్నాయి. -
అడుగడుగునా భయం భయం..!
ఒడిశా, భువనేశ్వర్/పూరీ: పూరీ జిల్లాలోని బ్రహ్మగిరి సమితి బల్లిఘాట్ బిందైబొస్తొ గ్రామస్తుల నిత్య జీవితం ఇలా అడుగడుగునా భయం భయంతో సాగుతోంది. ఏ చిన్నపాటి అవసరం తీర్చుకోవాలన్నా.. ఈ గెడ్డను దాటి, అవతలి ఒడ్డున ఉన్న పూరీ పట్టణం పోవాల్సిందే. ఈ క్రమంలో గెడ్డపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కర్రల వంతెనపైనుంచే ఇక్కడి వారంతా రోజువారీ రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఇది ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు ఏ క్షణంలో కూలిపోతోందోనని పాదచారులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నడిచే క్రమంలో వంతెనపై ఉన్న ఏ చిన్న బల్ల కానీ కర్ర కానీ జారినా అక్కడి గెడ్డలో పడిపోవాల్సిందే. ఈ విషయంపై పలుమార్లు అధికారులు, నేతలను కలిసి, శాశ్వత వంతెన ఏర్పాటు చేయాలని కోరినా ఫలితం లేదని బాధిత గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వంతెన నిర్మాణానికి చొరవ చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
హత విధీ.. ఇదేమి వారధి
► చెక్క వంతెనతో చిక్కులు ► అదుపు తప్పితే నదిలో పడాల్సిందే ► వారం రోజుల క్రితం నదిలో పడిన మహిళలు ► సమీపంలోని రైతులు రక్షించడంతో తప్పిన ప్రమాదం ► పట్టించుకోని పాలకులు, అధికారులు రాంబిల్లి(యలమంచిలి): మండలంలోని మూలజంప గ్రామంలో సుమారు 2 వేల మంది ఉంటున్నా రు. వీరిలో అధికశాతం మంది వ్యవసాయదారులే. పశువుల పాకల వద్దకు, పంటపొలాలకు వెళ్లాలంటే నదిని దాటాల్సిందే. దీంతో ఏటా గ్రామస్తులు చందా లు వేసుకొని తాటి చెక్కలతో వంతెన నిర్మించుకుంటారు. ప్రమాదమని తెలిసినా మరో మార్గం లేక ఈ చెక్క వంతెనపై రాకపోకలు సాగిస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ సమస్యతో సతమతమవుతున్నా పట్టించుకునే నాధుడే లేకుండాపోయాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు పాలకులు, అధికారుల దృష్టికి సమస్యను తీసుకొచ్చినా పట్టిం చుకోలేదంటున్నారు. చెరకు క్రషర్లు శారద నది ఆవల ఉండడంతో రాత్రిళ్లూ ఈ వంతెనపై నుంచే రాకపోకలు సాగి స్తుంటారు.ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఈ చెక్కలపై రాకపోకలు సాగించేటప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం చెక్క విరిగి పోయి 10 మంది మహిళలు నది లో పడిపోయారు. అప్పట్లో తక్కువగా నీరు ఉండటంతో పాటు అక్కడే ఉన్న రైతు వి.రాముతోపాటు మరికొందరు స్పందించి వెంటనే నదిలోకి దిగి మహిళలను రక్షించి ఒడ్డుకు చేర్చారు. మహిళలు ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇటీవల ఒక తెప్పను ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిని నిర్వహించే వారు లేకపోవడంతో ఒడ్డున వృథాగా పడి ఉంది.