the words
-
‘గద్దె’మాటలతో రాములు హత్య
కొల్లాపూర్: మూఢ నమ్మకాలతో ఓ గద్దె చెప్పిన మాటలు నమ్మి బాణామతి నె పంతో బోడెల్లి రాములు హత్య జరిగింద ని పోలీసులు వెల్లడించారు. కోడేరు మం డలం రాజాపూర్కు చెందిన రాములు స జీవ దహనం కేసులో నిందితులను కొల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. హత్య లో పాల్గొన్న ఎనిమిది మంది నిందితుల తో పాటు గద్దె చెప్పిన మహిళలను కూడా అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధిం చి న వివరాలను శనివారం స్థానిక సీఐ రా ఘవరావు చెప్పిన వివరాల ప్రకారం... రాజాపూర్కి చెందిన కురుమయ్య తల్లి బి చ్చమ్మ ఐదేళ్ల క్రితం చేతులకు బొబ్బలు వచ్చి అంతుచిక్కని వ్యాధితో మరణిం చింది. మరో రెండేళ్ల తర్వాత కురుమ య్య చిన్నమ్మ బాలమ్మ కూడా ఇదే తరహాలో చనిపోయింది. బోడెల్లి రాములు బాణామతి చేయడం వల్లే తమవారు చనిపోయారని కురుమయ్య కుటుంబసభ్యులు అనుమానంతో ఉన్నారు. గత డిసెంబర్లో కురుమయ్య కొడుకు ఆం జనేయులు(18)కు శరీరమంతా బొ బ్బ లు రావడంతో అతన్ని హైదరాబాద్, క ర్నూల్ ఆస్పత్రికి తీసుకెళ్లినా బతకడం కష్టమని వైద్యులు తేల్చిచెప్పారు. ఈ నెల 1వ తేదీన ఆంజనేయులు మృత్యువాతపడ్డాడు. ఎరుకలి గద్దె ద్వారా మరణాల మి స్టరీని తేల్చుకునేందుకు కురుమయ్య కు టుంబసభ్యులు ఈ నెల 5వ తేదీ జానంపేటలోని ఎరుకలి లక్ష్మిని సంప్రదించారు. ఆమె గద్దె పెట్టి ముగ్గురి మరణాలకు బాణామతే కారణమని, మీరు అనుమానిస్తున్న వ్యక్తి రాములే బాణామతి చేశాడ ని చెప్పింది. దీంతో కురుమయ్య కుటుం బసభ్యులు రాములను హత్య చేయాలని భావించారు. అదేరోజు రాత్రి కురుమయ్యతో పాటు అతని సోదరులు మద్దిలేటి, ఎర్రయ్య, గట్టయ్యలు వారి భార్య లు రాములమ్మ, లక్ష్మీ, భాగ్యమ్మ, భారతిలు సమావేశమయ్యారు. రాము లు హత్యకు ప్రణాళిక రూపొందించుకున్నా రు. ఆరోజు రాత్రి రాములు ఇంటివ ద్ద లేకపోవడంతో తమ పథకాన్ని మరుసటి రోజుకు మార్చుకున్నారు. 6వ తేదీన తెల్లవారుజామునే రాములు ఇంటికి వెళ్లి అతడిని కొట్టుకుంటూ గ్రామంలోని రచ్చకట్ట వద్దకు తీసుకువచ్చారు. తమ వెంట తె చ్చుకున్న కత్తితో నెత్తిపై పొడిచారు. కర్రలతో తలపై కొట్టారు. పెట్రోల్ పోసి ని ప్పంటించి, సజీవద హనానికి పాల్పడ్డార ని సీఐ రాఘవరావు పేర్కొన్నారు. ఈఘటనలో పాల్గొన్న కురుమయ్య, అతని సో దరులు, వారి భార్యలతో పాటు గద్దె చె ప్పిన ఎరుకలి లక్ష్మిపై వివిధ సెక్షన్లలో కే సులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. మూఢ నమ్మకాలను నమ్మొద్దని, ఎక్కడైనా గద్దె కారణంగా అ వాంచనీయ సంఘటనలు చోటుచేసుకుంటే గద్దె చెప్పిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. సమావేశంలో ఎస్ఐలు సత్యనారాయణరెడ్డి, ఎన్.వెంకటరమణ పాల్గొన్నారు. -
జెన్ గురువుతో మల్లయుద్ధం
జెన్ పథం ఆయనో అసలు సిసలు జెన్ గురువు. చూడ్డానికి బక్కపల్చగా కనిపించినా ఆయన మల్లయుద్ధంలోనూ పట్టున్న వ్యక్తి. అసామాన్యులు. ఆయన ఉన్న ఊళ్లోనే మరో మల్లయుద్ధ వీరుడున్నాడు. అతను మల్లయుద్ధంలో ప్రావీణ్యుడే కానీ కోపిష్టి. అనవసరంగా అందరితో చీటికీ మాటికీ గొడవ పడుతుండే వాడు. ఆ ఊళ్లో వాళ్లందరూ ఎంత సేపూ అసలు సిసలు గురువును చూడ్డానికే వెళ్లి తమకున్న సందేహాలను నివృత్తి చేసుకునే వారు. అది ఆ కోపిష్టి మల్లయుద్ధ వీరుడికి నచ్చలేదు. జెన్ గురువుపై ఈర్ష్యాద్వేషాలు ఎక్కువయ్యాయి. ఆయనను ఎలాగైనా దెబ్బతీయాలనుకున్నాడు. ఊరి ప్రజల మనస్సు మళ్లించడం కోసం గురువుగారిపై లేనివీపోనివీ చెప్పి ఎవరినీ ఆయన వద్దకు వెళ్లవద్దని వారించాడు. కానీ ఎవరూ అతని మాటలు లె క్క చేయలేదు. అసలు సిసలు గురువుదగ్గరకు వెళ్లి రావడం మానలేదు. దాంతో ఇక లాభం లేదనుకుని ఆ కోపిష్టి నేరుగా తనే గురువుగారున్న ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ వాకిట్లో నిల్చుని ఆ దారిన వచ్చీపోయే వారందరికీ వినిపించేలా గురువుగారిని తిట్టడం మొదలుపెట్టాడు. ‘‘నువ్వు అసలుసిసలు గురువువి అయితే లోపలి నుంచి బయటకు రా....ఎవరికో నీతులూ చెప్పడం కాదు... నన్ను ఎదుర్కో... నాతో తలపడు... మనిద్దరిలో ఎవరు గొప్పో ఈ ఊరి ప్రజలకు తెలియాలి’’ అని నానా మాటలు పెద్ద పెద్దగా అన్నాడు. అతని మాటలు విన్న గురువుగారు ఏమీ చెక్కుచెదరలేదు. దాంతో శిష్యులు బాధ పడ్డారు. ‘‘ఏమిటి గురువుగారూ, అతను అన్నేసి మాటలు అంటుంటే మీరే దీ పట్టనట్టు ఉన్నారు. మీరు మామూలు గురువుగారు కాదు కదా. మల్లయుద్ధంలోనూ పట్టున్నవారు. మీరు తలచుకుంటే అతన్ని సులభంగా నేలకూల్చవచ్చు’’ అని శిష్యులు ముక్తకంఠంతో చెప్పుకొచ్చారు. వారు చెప్పిన మాటలన్నీ విన్న గురువుగారు ఏ మాత్రం రెచ్చిపోలేదు. పెపైచ్చు ఓ చిన్న నవ్వు నవ్వారు. ఆయనేదీ విననట్టే మిన్నకుండిపోయారు. ఆయన నుంచి ఎటువంటి ప్రతిస్పందనా లేకపోవడంతో కోపిష్టి మరింత రెచ్చిపోయాడు. ఆయనపై అవాకులూ చవాకులూ వాగి వాగి అలసిపోయాడు. గొంతెండిపోయింది. నోరు పెగల్డం లేదు. అతను అక్కడ నిలవలేకపోయాడు. డీలాపడిన కోపిష్టి ఏ మాత్రం అరవలేక అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయాడు. అప్పుడు అసలు సిసలు గురువుగారు నాలుగే నాలుగు మాటలన్నారు. అవేమిటంటే.... ‘‘ఎలా ఉంది నా మల్లయుద్ధం?’’ అని. ఇక్కడ గురువుగారికి మౌనమే ఆయుధమై కోపిష్టిని మానసికంగా శారీరకంగా దెబ్బతీసిందన్న వాస్తవాన్ని శిష్యులు గ్రహించి ఆవేశానికి ఆవేశం, ద్వేషానికి ద్వేషం జవాబు కాదని తెలుసుకున్నారు. - యామిజాల జగదీశ్