కొల్లాపూర్: మూఢ నమ్మకాలతో ఓ గద్దె చెప్పిన మాటలు నమ్మి బాణామతి నె పంతో బోడెల్లి రాములు హత్య జరిగింద ని పోలీసులు వెల్లడించారు. కోడేరు మం డలం రాజాపూర్‌కు చెందిన రాములు స జీవ దహనం కేసులో నిందితులను కొల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. హత్య లో పాల్గొన్న ఎనిమిది మంది నిందితుల తో పాటు గద్దె చెప్పిన మహిళలను కూడా అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధిం చి న వివరాలను శనివారం స్థానిక సీఐ రా ఘవరావు చెప్పిన వివరాల ప్రకారం... రాజాపూర్‌కి చెందిన కురుమయ్య తల్లి బి చ్చమ్మ ఐదేళ్ల క్రితం చేతులకు బొబ్బలు వచ్చి అంతుచిక్కని వ్యాధితో మరణిం చింది.
మరో రెండేళ్ల తర్వాత కురుమ య్య చిన్నమ్మ బాలమ్మ కూడా ఇదే తరహాలో చనిపోయింది. బోడెల్లి రాములు బాణామతి చేయడం వల్లే తమవారు చనిపోయారని కురుమయ్య కుటుంబసభ్యులు అనుమానంతో ఉన్నారు. గత డిసెంబర్‌లో కురుమయ్య కొడుకు ఆం జనేయులు(18)కు శరీరమంతా బొ బ్బ లు రావడంతో అతన్ని హైదరాబాద్, క ర్నూల్ ఆస్పత్రికి తీసుకెళ్లినా బతకడం కష్టమని వైద్యులు తేల్చిచెప్పారు. ఈ నెల 1వ తేదీన ఆంజనేయులు మృత్యువాతపడ్డాడు. ఎరుకలి గద్దె ద్వారా మరణాల మి స్టరీని తేల్చుకునేందుకు కురుమయ్య కు టుంబసభ్యులు ఈ నెల 5వ తేదీ జానంపేటలోని ఎరుకలి లక్ష్మిని సంప్రదించారు.
ఆమె గద్దె పెట్టి ముగ్గురి మరణాలకు బాణామతే కారణమని, మీరు అనుమానిస్తున్న వ్యక్తి రాములే బాణామతి చేశాడ ని చెప్పింది. దీంతో కురుమయ్య కుటుం బసభ్యులు రాములను హత్య చేయాలని భావించారు. అదేరోజు రాత్రి కురుమయ్యతో పాటు అతని సోదరులు మద్దిలేటి, ఎర్రయ్య, గట్టయ్యలు వారి భార్య లు రాములమ్మ, లక్ష్మీ, భాగ్యమ్మ, భారతిలు సమావేశమయ్యారు. రాము లు హత్యకు ప్రణాళిక రూపొందించుకున్నా రు. ఆరోజు రాత్రి రాములు ఇంటివ ద్ద లేకపోవడంతో తమ పథకాన్ని మరుసటి రోజుకు మార్చుకున్నారు.
6వ తేదీన తెల్లవారుజామునే రాములు ఇంటికి వెళ్లి అతడిని కొట్టుకుంటూ గ్రామంలోని రచ్చకట్ట వద్దకు తీసుకువచ్చారు. తమ వెంట తె చ్చుకున్న కత్తితో నెత్తిపై పొడిచారు. కర్రలతో తలపై కొట్టారు. పెట్రోల్ పోసి ని ప్పంటించి, సజీవద హనానికి పాల్పడ్డార ని సీఐ రాఘవరావు పేర్కొన్నారు.
ఈఘటనలో పాల్గొన్న కురుమయ్య, అతని సో దరులు, వారి భార్యలతో పాటు గద్దె చె ప్పిన ఎరుకలి లక్ష్మిపై వివిధ సెక్షన్లలో కే సులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. మూఢ నమ్మకాలను నమ్మొద్దని, ఎక్కడైనా గద్దె కారణంగా అ వాంచనీయ సంఘటనలు చోటుచేసుకుంటే గద్దె చెప్పిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఐలు సత్యనారాయణరెడ్డి, ఎన్.వెంకటరమణ పాల్గొన్నారు.
‘గద్దె’మాటలతో రాములు హత్య
Published Sun, Jan 11 2015 4:30 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement