works inspection
-
‘ఉపాధి’ పనులను పరిశీలించిన కేంద్ర బృందం
ఓర్వకల్లు: ప్రధాని నరేంద్రమోదీ సలహాదారు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు సభ్యులు అమర్‌జిత్‌సిన్హా నేతృత్వంలోని కేంద్ర బృందం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లెలో బుధవారం పర్యటించింది. ఆ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పండ్ల తోటల పెంపకం, అభివృద్ధి పనులను పరిశీలించింది. రైతు వెంకటేశ్వర్లు సాగు చేసిన మునగ తోటను పరిశీలించి పంట దిగుబడి, పెట్టుబడుల ఖర్చుల వివరాలను బృందంలోని సభ్యులు అడిగి తెలుసుకున్నారు. మునగ సాగు లాభసాటిగా ఉందని, దిగుబడులకు తగ్గట్టు మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతు వివరించారు. సమీపంలో ఉపాధి హామీ పథకం కింద తవ్విన అమృత్ సరోవర్ (నీటి కుంట)ను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ కుంట ద్వారా ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎంత ఖర్చు చేశారనే వివరాలను అడిగి తెలుసుకుంది. అనంతరం జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం ప్రయోజనాలు, పనితీరుపై గ్రామస్తులతో బృంద సభ్యులు సమీక్ష నిర్వహించారు. పేదరిక నిర్మూలనకు చేపట్టాల్సిన పనులపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఉపాధి పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, రైతుల పంట పొలాలను అభివృద్ధి చేయాలని, పొలం రస్తాల వెంటవున్న కంపచెట్లను తొలగించాలని పలువురు కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి పథకమే తమను ఆదుకుందని, లేకపోతే ఎంతో మంది పస్తులుండాల్సి వచ్చేదని లక్ష్మీదేవి, శారదమ్మ అనే మహిళలు చెప్పారు. కేంద్ర బృందంలో కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ అశోక్ పంకజ్, ఎస్సీఏఈఆర్ ఎన్డీఐసీ డైరెక్టర్ సోనాల్డ్ దేశాయ్, గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఎకనామికల్ అడ్వైజర్ ప్రవీణ్ మెహతా, ఎన్ఐఆర్డి–పీఆర్ ప్రొఫెసర్ జ్యోతిస్ పాలన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోటేశ్వరరావు, డ్వామా పీడీ అమర్నాథ్రెడ్డి, డీఆర్డీఏ పీడి వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. ఇదీ చదవండి: సమష్టిగా నడుద్దాం.. క్లీన్ స్వీప్ చేద్దాం -
పెన్నాపై మరో కొత్త బ్రిడ్జి: మంత్రి అనిల్
సాక్షి, నెల్లూరు: పెన్నా బ్యారేజీ పనులను మంత్రి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరదల వల్ల నాలుగు నెలల పాటు పెన్నా బ్యారేజీ పనులు ఆలస్యం అయ్యాయని మంత్రి అన్నారు. సాధ్యమైనంత త్వరలో బ్యారేజీ పూర్తి చేసి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింపజేస్తామని తెలిపారు. చదవండి: నిమ్మగడ్డను బెదిరించాల్సిన అవసరం నాకు లేదు రెండేళ్లలో సిటీ నియోజకవర్గంలో రూ.350 కోట్లు వరకు పనులు జరుగుతున్నాయని వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికల చివరి ఆరు నెలల ముందు మాత్రమే హడావిడి చేసి, మొదటి రెండేళ్లలో నామమాత్రంగా పనులు చేశారని విమర్శించారు. పెన్నా పై మరో నాలుగు లైన్ల నూతన బ్రిడ్జి నిర్మాణానికి 150 కోట్లుతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి వెల్లడించారు. ఎక్కడ రాజీ పడకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంచేశారు.చదవండి:బాబు జమానాలో అంతులేని నిర్బంధకాండ -
ప్రాజెక్టుల రీడిజైన్‌తో ముంపు తగ్గించాం
రామగుండం: ప్రాజెక్టుల రీడిజైన్‌తోనే ముంపును తగ్గించి సామర్థ్యం పెంచడం జరిగిందని, నీటి లభ్యత ఉన్న ప్రాంతంలోనే ప్రాజెక్టు నిర్మాణాలకు డిజైన్ చేయగా, వాటిని పరిశీలించి కేంద్ర జలవనరుల సంఘం అనుమతులు జారీ చేసిందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన ఎల్లంపల్లి ప్రాజెకు ్టతో పాటు గోలివాడ (సుందిళ్ల)పంపుహౌస్ నిర్మా ణ స్థితిగతులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. కాంగ్రెస్ 2004లోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నప్పటికీ అసంపూర్తి పునరావాసం, నీటి నిల్వ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అ ప్పటికప్పుడు భూసేకరణకు రూ.600 కోట్లు కేటాయించి సమస్య పరిష్కరించామని తెలిపారు. 2014లో ఐదు టీఎంసీలు, 2015లో పది టీఎంసీ లు, 2016లో ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలను నిల్వ చేయగలిగామన్నారు. ముంపు తక్కువ సామర్థ్యం ఎక్కువ సీఎం లక్ష్యం రైతుల అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు 20.175 టీఎంసీలతో 62 గేట్లతో సుమారు 21 గ్రామాలు, వేలాది ఎకరాలు ముంపుకు గురైందన్నారు. దీంతో పోల్చుకుంటే గతంలో నిర్మించిన మిడ్ మానేర్, పులిచింతల ఇంకా ఎక్కువగా ముంపు గురైందన్నారు. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ వ్యవధిలోనే ప్రాజెక్టు నిర్మాణం, తక్కువ ముంపు, ఎక్కువ నీటి సామర్థ్యం, గరిష్ట ప్రయోజనాలతో దేశ చరిత్రలో గుర్తింపు వచ్చిందన్నారు. కాళేశ్వరం (మేడిగడ్డ) వద్ద నిర్మించే బ్యారేజీ 85 గేట్లతో నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీలు, అన్నారం బ్యారేజీ 66 గేట్లతో 11 టీఎంసీలు, సుందిళ్ల బ్యారేజీ 9 టీఎంసీలు, 74 గేట్లతో నిర్మిస్తున్నామన్నారు. ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో 115 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు పైకివస్తాయన్నారు. పనుల పురోగతిపై సంతృప్తి... మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలతో పాటు సబ్స్టేషన్ల నిర్మాణాలపై మంత్రి హరీష్‌రావు సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు గరిష్ట ఉష్ణోగ్రతలు, వర్షాలను లెక్కచేయకుండా పనులు నిరాటంకంగా కొనసాగిస్తున్నారని కొనియాడారు. అయినప్పటికీ అ«ధికారులు పేర్కొన్న నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కాకపోవడం పట్ల జరిగే జాప్యంపై అధికారులతో చర్చించారు. గోలివాడ పంపుహౌస్ వద్ద ఈనెల 25న నాలుగు మోటార్లను ప్రారంభించి 400 కేవీ సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ఉత్పత్తి ప్రారంభిస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నల్ల వెంకటేశ్వర్లు, ఎస్ఈ విజయభాస్కర్, ఈఈ సత్యరాజ్ చంద్ర, డీఈ రాజమల్లు, ఏఈ శివసాగర్, ట్రాన్స్‌కో అధికారి సుజన్ ఉన్నారు. ఎల్లంపల్లి గేట్ల పని విధానంపై సమీక్ష ఎల్లంపల్లి ప్రాజెక్టులో బిగించిన గేట్ల పని విధానాన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అధికారులతో సమీక్షించారు. ఈ మేర కు ఆయన శుక్రవారం ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆకస్మికంగా సందర్శించారు. మేడిగడ్డ, అన్నారం, స ందిళ్ల బ్యారేజీలకు గేట్ల బిగింపు, ఎల్లంపల్లి ప్రా జెక్టు గేట్ల బిగింపుపై అధికారులతో చర్చించా రు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను హైడ్రాలిక్ విధానంతో బిగించగా, మూడు ప్రాంతంలో ఆపరేటి ంగ్ విధా నాన్ని ఏర్పాటు చేశారని అధికారులు తెలి పారు. ఇదే పద్ధతిలో సుందిళ్ల బ్యారేజీకి ఎందుకు బిగించలేదని అధికారులను మంత్రి ప్రశ్నించగా.. సుం దిళ్ళ బ్యారేజీకి రోప్ డ్రమ్ ఆయిల్ సిస్టం (ఆర్డీఓఎస్) విధానంతో గేట్లను ఎత్తివేయవచ్చన్నారు. కగా స్విచ్ యార్డుగది అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన మంత్రి ఎస్ఈని మందలించారు. ఆగస్టు నెలాఖరులో కాళేశ్వరం నీరు విడుదల ధర్మారం(ధర్మపురి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పనులు నెలరోజుల్లో పూర్తిచేసి అగస్టు నెలాఖరులోగా ఎల్లంపల్లి నీటిని విడుదల చేస్తామని హరీష్‌రావు తెలిపారు. ధర్మారం మండలం మేడారం శివారులో కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఆరోప్యాకేజీ పనులు శుక్రవారం పరిశీలించారు. గురువారం రాత్రి 12 గంటలకు మేడారంలోని నవయుగ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మంత్రి రాత్రి ఇక్కడే బసచేశారు. ఉదయం టన్నెల్లో జరుగుతున్న పనులు సందర్శించారు. మం త్రి వెంట సీఈ వెంకటేశ్వర్లు, ఎస్ఈ వెంకట్రాము లు, ఈఈ శ్రీధర్, నవయుగ కంపెనీ డీపీఎం శ్రీనివాస్, డీఈఈ నర్సింగరావు, ఏఈలు ఉన్నారు. -
ఇంత జాప్యమెందుకు?
రెండేళ్లయినా చాలదా? కోమటి చెరువు పనులపై కాంట్రాక్టర్‌పై మండిపడ్డ మంత్రి సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీలు చెరువులు, కుంటల పరిశీలన కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచన సిద్దిపేట జోన్: పట్టణ శివారులోని కోమటి చెరువు ఆధునికీకరణ పనుల్లో జాప్యంపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులపై మండిపడ్డారు. మినీట్యాంక్ బండ్ తరహాలో ఆధునికీకరించే క్రమంలో నిధుల మంజూరు చేసి రెండేళ్లు గడిచినా పూర్తికాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దిపేటలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలోని చెరువుల స్థితిగతులను మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోమటి చెరువు, ఎర్రచెరువు, చింతల చెరువులను అధికారులతో కలిసి సందర్శించారు. ముందుగా కోమటి చెరువుకు చేరుకున్న మంత్రి అక్కడ జరుగుతున్న పనుల జాప్యంపై నీటి పారుదల, టూరిజం, మున్సిపల్ అధికారులను ఆరా తీశారు. చెరువు కట్టపై వర్షపు నీరు నిల్చి ఉండడం, పిల్లల పార్కులో గుంతలు ఏర్పడడం, కట్టపైన ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్ టైల్స్, బండల మధ్య పొదలు పెరగడం చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌ను పిలిచి పనులు త్వరిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గడువు కావాలని కాంట్రాక్టర్ కోరడంతో విస్మయాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది బతుకమ్మ పండుగ నాటికే పూర్తి స్థాయిలో ఆధునికీకరణ చేపట్టాలని చెప్పినా.. మళ్లీ బతుకమ్మ పండుగ వస్తుందన్నారు. సమయం ఎంత ఇచ్చినా సరిపోదు, మరో రెండేళ్లయినా చాలదంటూ అసహనం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న నీటి పారుదల శాఖ ఈఈ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణచారి, ఓఎస్డీ బాల్‌రాజుతో మంత్రి మాట్లాడుతూ.. బుధవారం ఆయా శాఖల ముఖ్య అధికారులు సిద్దిపేటకు వస్తారని పనులను వేగవంతం చేసేందుకు సమన్వయంతో కృషి చేయాలని, బతుకమ్మ పండుగ నాటికి పూర్తి స్థాయిలో పనులు జరగాలని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో కోమటి చెరువు పరిసరాల్లో శిల్పారామం తరహాలో నిర్మాణం చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. చెరువుపై రోప్ వే ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రాంతంగా మంచి గుర్తింపు వస్తుందన్నారు. నాసర్‌పురా కప్పల కుంటలో భారీ గుంతలు తీయడంపై ఆరా తీశారు. చింతల చెరువు పనులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం బైపాస్ రోడ్డు మీదుగా రంగధాంపల్లి చౌరస్తా, ఎంపీడీఓ చౌరస్తాకు చేరుకొని బాబూ జగ్జీవన్‌రామ్ కూడలి ఆధునికీకరణపై అధికారులతో సమీక్షించి, పనులను త్వరితగతిన పూర్తి చేయలన్నారు. ఫుట్‌పాత్ పనులను పరిశీలించారు. దసరా రోజు సీఎం సిద్దిపేటకు వస్తున్నారని, పనులను వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్, బ్రహ్మం, ప్రవీణ్, తాళ్లపల్లి సత్యనారాయణ, అధికారులు నాగరాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, లక్ష్మణ్, యాదగిరి తదితరులు ఉన్నారు.