భారత్ ర్యాంక్ మెరుగుకు కృషి
నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: వ్యాపారం చేసుకోడానికి సులభతరమైన దేశాలకు సంబంధించి ప్రపంచబ్యాంక్ జాబితాలో భారత్ ర్యాంక్ ఈ ఏడాది మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తంచేశారు. ఈ దిశలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని ఆమె పేర్కొన్నారు. 189 దేశాల ఇటీవలి ప్రపంచ బ్యాంక్ జాబితాలో భారత్ ర్యాంక్ 142 కావడం గమనార్హం. సీఐఐ, ఫిక్కీలు ఇక్కడ నిర్వహించిన వేర్వేరు కార్యక్రమల్లో పాల్గొన్న సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడిన ముఖ్యాంశాలను చూస్తే...
- దేశంలో వ్యాపార అవకాశాల మెరుగుకు కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి.
- దేశంలో మౌలిక రంగం అభివృద్ధికి సైతం కేంద్రం పెట్టుబడులు పెడుతోంది.
- ఆరోగ్య భద్రత, ఇంధనం, ఆటోమొబైల్, రక్షణ వంటి అంశాల్లో పెట్టుబడులకు భారత్‌లో మంచి అవకాశాలు ఉన్నాయి.
- ఈ కామర్స్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై రాష్ట్రాలతో తమ మంత్రిత్వశాఖ చర్చలు జరుపుతోంది.