వ్యాపారం చేయడంలో ఏపీకి రెండోర్యాంకు!
సులభంగా వ్యాపారం చేసే అంశంలో మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రపంచ బ్యాంకు ర్యాంకులు ఇవ్వగా, వాటిలో ఆంధ్రప్రదేశ్ రెండో ర్యాంకు సాధించింది. మొదటి స్థానంలో ఎప్పటిలాగే గుజరాత్ నిలవగా, మూడో స్థానంలో జరా్ఖండ్ ఉంది. గుజరాత్ స్కోరు 71.14 శాతం కాగా, ఏపీ స్కోరు 70.12 శాతం.
ఇక తెలంగాణ రాష్ట్రం 42.45 శాతం స్కోరుతో 13వ స్థానంలో నిలిచింది. మొత్తం 29 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రపంచబ్యాంకు ఈ ర్యాంకులు ఇచ్చింది. అన్నింటికంటే చిట్టచివరి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఈ రాష్ట్రానికి వచ్చిన స్కోరు 1.23 శాతం మాత్రమే.